సాక్షి, న్యూఢిల్లీ : షాహిద్ దివస్ సందర్భంగా రేపు అంటే మార్చి 23న సెలవుగా ప్రకటించాలని శిరోమణి అకాళీ దళ్ పార్టీ కోరుతోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ ప్రేమ్ సింగ్ చందుముజ్రా గురువారం లోక్‌సభలో ఓ లేఖను సమర్పించారు.
‘వారి గౌరవార్థం పార్లమెంట్‌కు సెలవు దినం ప్రకటించాలి. లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ రాశాను. ఆమె సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని ప్రేమ్ సింగ్ మీడియాకు తెలిపారు. గదర్ కుట్రలో నిందితులుగా తేలటంతో లాహోర్‌లోని జైల్లో 1931, మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీశారు. వారి గుర్తుగా మార్చి 23ను ప్రతీ ఏటా షాహిద్ దివస్‌గా జరుపుకుంటున్నాం.
అంతేకాదు పార్లమెంట్ హౌజ్‌లోలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాడు(1929, ఏప్రిల్8వ తేదీన) భగత్ సింగ్, భటుకేశ్వర దత్‌లు చేసిన బాంబు దాడికి గుర్తుగా సందర్శకుల గ్యాలెరీలో వారికి రెండు కుర్చీలు కేటాయించాలని అకాళీదల్ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment