shaheed
-
భగత్‌సింగ్‌ను గుర్తుచేసుకుంటూ మారథాన్.. విజేతకు రూ. 4 లక్షల బహుమానం!
అమర వీరుడు భగత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ మార్చి 24న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మారథాన్ నిర్వహించనున్నారు. తాత్యా తోపే నగర్ స్టేడియంలో ‘షహీద్-ఏ-అజం’ పేరిట మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారి కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అన్ని వయసుల వారు ఈ మారథాన్‌లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారికి టీ-షర్ట్, అల్పాహారం, సర్టిఫికేట్ అందించనున్నారు. మారధాన్ విజేతకు రూ.4 లక్షల నగదు బహుమానం అందించనున్నారు. 24న ఉదయం 6 గంటలకు మారథాన్ ప్రారంభం కానుంది. ఈ ఈ మారథాన్‌ను సిక్స్త్ సెన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆరోజు భగత్ సింగ్‌కు నివాళులు అర్పించనున్నారు. -
మహాత్ముని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?
బ్రిటీష్‌వారి బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మహాత్ముడు తన జీవితాన్ని త్యాగం చేశారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. గాంధీజీ త్యాగాన్ని స్మరించుకునేందుకు ప్రతీ ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. గాంధీ వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి, అహింస, సామరస్య మార్గాన్ని చూపింది. అది.. 1948, జనవరి 30నాటి సాయంత్రం వేళ.. మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్లో జరిగే ప్రార్థనా సమావేశంలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 5:17 గంటల ప్రాంతంలో నాథూరామ్ గాడ్సే .. మహాత్మాగాంధీపై కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాపూజీ మరణానంతరం, ఆయన వర్ధంతి (జనవరి 30)ని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల ఆర్మీ చీఫ్‌లు రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. అలాగే అమరవీరులందరినీ స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలలో మహాత్మా గాంధీని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, గురుతులు మనందరి మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత మంత్రం నేడు ప్రతి ఒక్కరికీ చేరింది. బాపూజీ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -
‘మీ సోదరుడు అల్లా కోసం అమరుడయ్యాడు’
తిరువనంతపురం: రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన ఓ ముస్లిం యువకుడు మరణించినట్లు వారి కుటుంబానికి ఓ సందేశం వచ్చింది. ఎదిగివచ్చిన కొడుకు కంటికి కానరానంత దూరం వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగి పోయారు. వివరాలు.. మలప్పురం జిల్లా ఇడప్పల్‌కు చెందిన మహ్మద్ ముహాసిన్ 2017, అక్టోబర్‌లో ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ చదువుతున్న ముహాసిన్.. అఫ్గానిస్తాన్ వెళ్లి.. ఇస్లామిక్ స్టేట్‌లో చేరినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముహాసిన్ కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో ఓ సందేశం వచ్చింది. మలయాళంలో ఉన్న సందేశంలో ‘అల్లా సేవలో తరించాలనే మీ సోదరుని కోరిక నెరవేరింది. పది రోజుల క్రితం మీ సోదరుడు అమరుడయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే.. మీకే ప్రమాదం’ అని హెచ్చరిస్తూ ఓ సందేశం వచ్చింది. దాంతో పాటు ముహాసిన్ మృతదేహం ఫోటో కూడా వచ్చింది. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. ‘కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో వచ్చిన ఫోటోను ముహాసిన్‌దిగానే భావిస్తున్నారు. ఇంతకు మించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వాట్సాప్ సందేశం మలయాళంలో వచ్చింది. దీన్ని బట్టి.. ముహాసిన్‌తో పాటు కేరళకు చెందిన మరో వ్యక్తి కూడా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నాం. అయితే సందేశం పంపిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. -
రేపు సెలవు ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ : షాహిద్ దివస్ సందర్భంగా రేపు అంటే మార్చి 23న సెలవుగా ప్రకటించాలని శిరోమణి అకాళీ దళ్ పార్టీ కోరుతోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ ప్రేమ్ సింగ్ చందుముజ్రా గురువారం లోక్‌సభలో ఓ లేఖను సమర్పించారు. ‘వారి గౌరవార్థం పార్లమెంట్‌కు సెలవు దినం ప్రకటించాలి. లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ రాశాను. ఆమె సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని ప్రేమ్ సింగ్ మీడియాకు తెలిపారు. గదర్ కుట్రలో నిందితులుగా తేలటంతో లాహోర్‌లోని జైల్లో 1931, మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీశారు. వారి గుర్తుగా మార్చి 23ను ప్రతీ ఏటా షాహిద్ దివస్‌గా జరుపుకుంటున్నాం. అంతేకాదు పార్లమెంట్ హౌజ్‌లోలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాడు(1929, ఏప్రిల్8వ తేదీన) భగత్ సింగ్, భటుకేశ్వర దత్‌లు చేసిన బాంబు దాడికి గుర్తుగా సందర్శకుల గ్యాలెరీలో వారికి రెండు కుర్చీలు కేటాయించాలని అకాళీదల్ కోరింది. -
‘షహీద్’ పదం మా డిక్షనరీలో లేదు
న్యూఢిల్లీ: ఆర్మీ లేదా పోలీసు శాఖలో ‘అమర వీరుడు’లేదా ‘షహీద్’అనే పదాలే లేవని రక్షణ శాఖ, హోంశాఖలు తేల్చిచెప్పాయి. ఏదైనా ఘటనలో ఆర్మీ అధికారి చనిపోతే ‘యుద్ధంలో మరణించినవారు’, పోలీసులు చనిపోతే ‘పోలీస్ చర్యల్లో మరణించినవారు’ అని పేర్కొంటారని తమ నివేదికలో కేంద్ర సమాచార కమిషన్‌కు తెలిపాయి. ‘షహీద్’ లేదా ‘అమరవీరుడు’ పదాలకు న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా అర్థం చెప్పాలంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త హోం శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పదాల వాడుకపై పరిమితులు.. అలాగే తప్పుగా వాడితే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలియజేయాలని కోరాడు. ఈ దరఖాస్తుకు హోం, రక్షణ శాఖల్లో స్పందన రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు. -
పోలీస్ కస్టడీకి ఇద్దరు ‘లష్కరే ఉగ్రవాదులు’
న్యూఢిల్లీ: రాజధానిలో పేలుళ్లకు కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ఇద్దరికి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. నిందితుడు రషీద్‌కు ఏడురోజులపా టు పోలీస్ కస్టడీకి పంపగా మరో నిందితుడు షాహిద్‌కు నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి పంపుతూ అదనపు సెషన్స్ జడ్జి దయాప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు. రషీద్, షాహిద్‌లకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ తో సంబంధాలున్నాయని, వారెదుర్కొంటున్న నేరారోపణలను రుజువు చేసేందుకు తమ విచారణకు పంపాలని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అనుమతిస్తూ నింది తులిద్దరికి పోలీస్ రిమాండ్‌కు పంపింది.