భగత్‌సింగ్‌ను గుర్తుచేసుకుంటూ మారథాన్‌.. విజేతకు రూ. 4 లక్షల బహుమానం! | Shaheed-e-Azam Marathon To Be Organised On 24th March | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: భగత్‌సింగ్‌ను గుర్తుచేసుకుంటూ మారథాన్‌.. విజేతకు రూ. 4 లక్షల బహుమానం!

Published Sat, Mar 23 2024 8:31 AM | Last Updated on Sat, Mar 23 2024 11:12 AM

Shaheed e Azad Marathon is Going to be Organised on 24 March - Sakshi

అమర వీరుడు భగత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ మార్చి 24న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మారథాన్ నిర్వహించనున్నారు. తాత్యా తోపే నగర్ స్టేడియంలో ‘షహీద్-ఏ-అజం’ పేరిట మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారి  కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 

అన్ని వయసుల వారు ఈ మారథాన్‌లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారికి టీ-షర్ట్, అల్పాహారం, సర్టిఫికేట్  అందించనున్నారు. మారధాన్‌ విజేతకు రూ.4 లక్షల నగదు బహుమానం అందించనున్నారు. 

24న ఉదయం 6 గంటలకు మారథాన్ ప్రారంభం కానుంది. ఈ ఈ మారథాన్‌ను సిక్స్త్ సెన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆరోజు భగత్‌ సింగ్‌కు నివాళులు అర్పించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement