organisers
-
భగత్‌సింగ్‌ను గుర్తుచేసుకుంటూ మారథాన్.. విజేతకు రూ. 4 లక్షల బహుమానం!
అమర వీరుడు భగత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ మార్చి 24న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మారథాన్ నిర్వహించనున్నారు. తాత్యా తోపే నగర్ స్టేడియంలో ‘షహీద్-ఏ-అజం’ పేరిట మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారి కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అన్ని వయసుల వారు ఈ మారథాన్‌లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారికి టీ-షర్ట్, అల్పాహారం, సర్టిఫికేట్ అందించనున్నారు. మారధాన్ విజేతకు రూ.4 లక్షల నగదు బహుమానం అందించనున్నారు. 24న ఉదయం 6 గంటలకు మారథాన్ ప్రారంభం కానుంది. ఈ ఈ మారథాన్‌ను సిక్స్త్ సెన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆరోజు భగత్ సింగ్‌కు నివాళులు అర్పించనున్నారు. -
ప్రేక్షకులు లేకుండా నిర్వహించలేం
సింగపూర్: ప్రేక్షకులు లేకుండా సింగపూర్ ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్‌ప్రి రేసును నిర్వహించడం సాధ్యం కాదంటూ రేసు నిర్వాహకులు సోమవారం తెలిపారు. కరోనా కారణంగా మార్చిలో ఆరంభం కావాల్సిన 2020 ఎఫ్1 సీజన్... జూలైలో జరిగే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో ఆరంభమయ్యే అవకాశం ఉంది. కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఈ ఏడాది జరిగే రేసులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే యోచనలో ఎఫ్1 అధికారులు ఉన్నారు. అయితే రాత్రి పూట వీధుల గుండా సాగే సింగపూర్ గ్రాండ్‌ప్రి ట్రాక్‌ను హోటల్స్, అపార్ట్మెంట్ల చుట్టూ నిర్మించారు. దాంతో ఈ గ్రాండ్‌ప్రిని ప్రేక్షకులు లేకుండా నిర్వహించడం కష్టమని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ రేసును నిర్వహించడానికే ప్రయత్నిస్తున్నామని... అందుకోసం సింగపూర్ ప్రభుత్వంతో, ఎఫ్1 అధికారులతో చర్చిస్తున్నామని సింగపూర్ రేసు నిర్వాహకులు తెలిపారు. ఈ రేసు సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. అయితే సింగపూర్లాగే వీధుల గుండా సాగే మొనాకో గ్రాండ్‌ప్రి ఇప్పటికే రద్దవగా... అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి వాయిదా పడింది. -
వారం పేరు తప్పేసి... అచ్చేశారు
సిడ్నీ: ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరం ముస్తాబైంది. అయితే ప్రారంభోత్సవ టికెట్లను అచ్చుతప్పులతో ముద్రించి నిర్వాహకులు అభాసుపాలయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ మొదలవుతున్న రోజు బుధవారమైతే గురువారం అని ముద్రించడం విమర్శలపాలైంది. ఏప్రిల్ 4న నిర్వహించ తలపెట్టిన ప్రారంభ వేడుకల్ని గురువారం అని 14 వేల టికెట్లలో ముద్రించారు. నిజానికి ఏప్రిల్ 4 బుధవారం. తప్పుదొర్లిన మాట నిజమేనని అంగీకరించిన నిర్వాహకులు తిరిగి సరిదిద్దుకొని ముద్రించే ఆలోచనేది లేదని స్పష్టం చేశారు. ‘అంతా సవ్యం గానే సాగుతున్న దశలో తప్పుగా టికెట్లు అచ్చువేయడం నిరాశపరిచింది. ప్రింటింగ్ సంస్థ ఇలాంటి తప్పు చేసి ఉండాల్సింది కాదు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సింది. అయితే ఇప్పటికే ఏప్రిల్ 4వ తేదీ ప్రారంభోత్సవమని పాకిపోయింది. మళ్లీ బుధవారమని ముద్రించాల్సిన అవసరం లేదు. ఈ టికెట్లే చెల్లుబాటవుతాయి ’ అని గేమ్స్ చీఫ్ పీటర్స్ మీడియాతో అన్నారు. -
లక్కీడిప్ నిర్వహకుల అరెస్్ట
ఆత్మకూరు: వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామ సమీపంలో జమ్ములమ్మ గుడివద్ద లక్కీడిప్ నిర్వహకులను అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అనుమతులు లేకుండా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఎంటర్ ప్రైజస్, లక్ష్మీ నరసింహ ఎంటర్ ప్రైజస్‌లను అనంతపురానికి చెందిన లక్ష్మీరెడ్డి, శ్రీపతిరావు పేటకు చెందిన ప్రభాకర్‌రెడ్డిలు ఏర్పాటు చేశారన్నారు. కొద్ది మంది ఏజెంట్లను నియమించుకొని లక్కీడిప్ నిర్వహిస్తున్నారన్నారు. సమాచారం రావడంతో దాడిచేసి నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.55,000 నగదు, రెండు మోటార్ సైకిళ్లు, ఒక ఇండికా విస్టా కారు, ఐదు సెల్ఫోన్లు, ఒక రోలింగ్ మిషన్, నాలుగువేల టోకెన్స్, 22 రశీదు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏజెంట్లు సాంబశివరావు, హుస్సేన్, సుబ్బారావు, రాముడులను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. దాడుల్లో సీఐ కృష్ణయ్య, వెలుగోడు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మోసపోవద్దు... లక్కీడిప్‌లతో మోసపోవద్దని, ఎక్కడైనా ఇలాంటి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్ సూచించారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఎంటర్ ప్రైజస్, లక్ష్మీ నరసింహఎంటర్ ప్రైజస్ ద్వారా 9వేల మందితో రూ. 3కోట్లకు పైగా వసూలు చేసినట్లు తమ విచారణలో బయటపడిందన్నారు. ఆత్మకూరు ప్రాంతంలో కూడా ఇలాంటి ఉన్నాయని, వాటిపై దృష్టి సారించామన్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కోడిపందాలు ఆడుతున్న నలుగురి అరెస్ట్
కరీంనగర్: కోడిపందాలు ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోడిపందాల్లో పాల్గొన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 33 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
రాజకీయ గ్రహణం
దేశంలోనే 25శాతం పత్తి విత్తనోత్పత్తి సాధించే గద్వాల ప్రాంతానికి రాజకీయ గ్రహణం పట్టింది. విత్తనోత్పత్తిలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పేరుగాంచిన ఈ ప్రాంతం నేడు కుదేలవుతోంది. వాతావరణ పరంగా అనువుగా ఉండే ఈ ప్రాంతం లో విత్తనోత్పత్తికి ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో వ్యాపారులు మూడు దశాబ్దాల క్రితం ఇక్కడ దృష్టి కేంద్రీకరించారు. కానీ ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు,వర్గాలు విత్తనోత్పత్తిని దెబ్బతీసేలా ఉన్నారుు. గద్వాల, న్యూస్‌లైన్: గద్వాల ప్రాంత రైతులకు పత్తివిత్తనోత్పత్తి సాగు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గతేడాది పదివేల ఎకరాల విస్తీర్ణానికి కుదించిన కంపెనీలు, ప్రస్తుత ఖరీఫ్ పంటకు ఇంకా విత్తనాలే ఇవ్వలేదు. ఐదువేల ఎకరాలకు మించి సాగు లేకుండా విత్తనాలను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీడ్ పత్తి విత్తనోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్గనైజర్లు రాజకీయాలతో అనుబంధం కావడం, గ్రూపులుగా విడిపోవడం, కంపెనీల అధిపతులకు నేతలతో ఫోన్లు చేయించడం ఇలాంటి సంఘటనలతో గద్వాల ప్రాంతంలో పత్తి విత్తనోత్పత్తిని కంపెనీలు వదులుకునే పరిస్థితికి తీసు కొచ్చేలా చేశాయి. కంపెనీల వద్ద రెండేళ్లకు సరిపడా పత్తి విత్తనాల స్టాక్ ఉన్నట్లు స్థానిక ఆర్గనైజర్లు చెబుతున్నా, వాస్తవంలో మూడేళ్లుగా జరుగుతున్న సంఘటనలు, పత్తి పంట పుప్పొడి రాక పోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నారుు. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభ ం.. గద్వాల ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, వర్షాలను ఆధారంగా చేసుకుని పత్తివిత్తనోత్పత్తికి గద్వాల డివిజన్ ప్రాంతం మంచి అనువుగా ఉంది. దీంతో సీమాంధ్ర నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి పత్తివిత్తనోత్పత్తి సాగును ప్రారంభించారు. వారితోపాటు ఇక్కడి రైతులు కూడా పత్తివిత్తనోత్పత్తిలో భాగస్వామ్యం కావడం తో ఏటేటా పత్తి విత్తనోత్పత్తి సాగు విస్తరిస్తూ వ చ్చింది. ఇలా 30వేల ఎకరాలకు విస్తరించిన పత్తి విత్తనోత్పత్తి రైతులకు మంచి గిట్టుబాటు ధరను అందించడం కూడా మరో కారణమైంది. ఎకరాకు అధిక రాబడి... ఎకరా పత్తి విత్తనోత్పత్తి సాగు చేసిన రైతుకు లక్ష నుంచి రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి తోడు సాగునీటి వనరులు ఉన్న రైతులు ఇంటిల్లిపాది తమకున్న రెండెకరాల్లో పనిచేస్తే పెట్టుబడులు పోగా ఏటా రూ. 2 లక్షల నుంచి 3 లక్షలు మిగులుబాటు అయ్యేవి. దీనికి తోడు పత్తి విత్తనోత్పత్తి సాగుకు అవసరమైన పెట్టుబడులను కంపెనీలు, ఆర్గనైజర్లు తక్కువ వడ్డీకి ఇవ్వడం కూడా రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేది. ఆదాయం వస్తున్న ఆర్గనైజర్లలో వర్గాలు... గద్వాల ప్రాంతంలో ఏటా 30వేల ఎకరాల పత్తి విత్తనోత్పత్తి జరగడం, పత్తి విత్తనాలను పండిం చిన రైతుల నుంచి ఆర్గనైజర్ల వరకు క్రయ, విక్రయాలలో దాదాపు వేయి కోట్ల వరకు వ్యాపారం జరిగేది. ఇంతటి ఆదాయం ఉండటంతో ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు దశాబ్ద కాలంగా కోట్లకు పడగెత్తారు. ఆదాయం వస్తున్న ఆర్గనైజర్లు ఒకేతాటిపై ఉండే పరిస్థితి నుంచి రాజకీయ నేతల అనుచరులుగా మారిపోయారు. ఇలా వర్గాలుగా చేరి విత్తనోత్పత్తి సంస్థలకు రాజకీయాల బెదిరింపులను తీసుకెళ్లే వరకు వెళ్లారు. దీంతో కం పెనీలు ఈ ప్రాంతంలో పత్తివిత్తనోత్పత్తికి పెట్టుబడులు పెట్టడం అంత శ్రేయస్సు కాదన్న ఉద్దేశంతో రెండేళ్లుగా తగ్గింపును ప్రారంభించారు. నిల్వలు పేరుకుపోవడం వల్లే కంపెనీల వద్ద సీడ్ నిల్వలు పెద్ద ఎత్తున పేరుకపోయాయి. ప్రస్తుత ఏడాది 3 కోట్ల ప్యాకెట్ల నిల్వ లు నిలిచిపోయా యి. అందుకే ప్రస్తుతం 40వేల నుంచి 25వేలకు విస్తీర్ణం తగ్గించారు. వచ్చే ఏడాది మూడువేల ఎకరాలకు మించి పత్తి సాగు ఉండే అవకాశం లేదు. నిల్వలు పూర్తిగా కమర్షియల్‌కు వెళ్లిపోవడం జరిగితే రెండేళ్లలో మళ్లీ పత్తి విత్తనోత్పత్తి గతేడాది మాది రిగానే అధిక విస్తీర్ణానికి పెరగొచ్చు. రైతు లు అధైర్య పడవద్దు. - సీడ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి