దేశంలోనే 25శాతం పత్తి విత్తనోత్పత్తి సాధించే గద్వాల ప్రాంతానికి రాజకీయ గ్రహణం పట్టింది. విత్తనోత్పత్తిలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పేరుగాంచిన ఈ ప్రాంతం నేడు కుదేలవుతోంది. వాతావరణ పరంగా అనువుగా ఉండే ఈ ప్రాంతం లో విత్తనోత్పత్తికి ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో వ్యాపారులు మూడు దశాబ్దాల క్రితం ఇక్కడ దృష్టి కేంద్రీకరించారు. కానీ ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు,వర్గాలు విత్తనోత్పత్తిని దెబ్బతీసేలా ఉన్నారుు.
గద్వాల, న్యూస్‌లైన్: గద్వాల ప్రాంత రైతులకు పత్తివిత్తనోత్పత్తి సాగు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గతేడాది పదివేల ఎకరాల విస్తీర్ణానికి కుదించిన కంపెనీలు, ప్రస్తుత ఖరీఫ్ పంటకు ఇంకా విత్తనాలే ఇవ్వలేదు. ఐదువేల ఎకరాలకు మించి సాగు లేకుండా విత్తనాలను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీడ్ పత్తి విత్తనోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్గనైజర్లు రాజకీయాలతో అనుబంధం కావడం, గ్రూపులుగా విడిపోవడం, కంపెనీల అధిపతులకు నేతలతో ఫోన్లు చేయించడం ఇలాంటి సంఘటనలతో గద్వాల ప్రాంతంలో పత్తి విత్తనోత్పత్తిని కంపెనీలు వదులుకునే పరిస్థితికి తీసు కొచ్చేలా చేశాయి. కంపెనీల వద్ద రెండేళ్లకు సరిపడా పత్తి విత్తనాల స్టాక్ ఉన్నట్లు స్థానిక ఆర్గనైజర్లు చెబుతున్నా, వాస్తవంలో మూడేళ్లుగా జరుగుతున్న సంఘటనలు, పత్తి పంట పుప్పొడి రాక పోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నారుు.
మూడు దశాబ్దాల క్రితం ప్రారంభ ం..
గద్వాల ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, వర్షాలను ఆధారంగా చేసుకుని పత్తివిత్తనోత్పత్తికి గద్వాల డివిజన్ ప్రాంతం మంచి అనువుగా ఉంది. దీంతో సీమాంధ్ర నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి పత్తివిత్తనోత్పత్తి సాగును ప్రారంభించారు. వారితోపాటు ఇక్కడి రైతులు కూడా పత్తివిత్తనోత్పత్తిలో భాగస్వామ్యం కావడం తో ఏటేటా పత్తి విత్తనోత్పత్తి సాగు విస్తరిస్తూ వ చ్చింది. ఇలా 30వేల ఎకరాలకు విస్తరించిన పత్తి విత్తనోత్పత్తి రైతులకు మంచి గిట్టుబాటు ధరను అందించడం కూడా మరో కారణమైంది.
ఎకరాకు అధిక రాబడి...
ఎకరా పత్తి విత్తనోత్పత్తి సాగు చేసిన రైతుకు లక్ష నుంచి రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి తోడు సాగునీటి వనరులు ఉన్న రైతులు ఇంటిల్లిపాది తమకున్న రెండెకరాల్లో పనిచేస్తే పెట్టుబడులు పోగా ఏటా రూ. 2 లక్షల నుంచి 3 లక్షలు మిగులుబాటు అయ్యేవి. దీనికి తోడు పత్తి విత్తనోత్పత్తి సాగుకు అవసరమైన పెట్టుబడులను కంపెనీలు, ఆర్గనైజర్లు తక్కువ వడ్డీకి ఇవ్వడం కూడా రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేది.
ఆదాయం వస్తున్న ఆర్గనైజర్లలో వర్గాలు...
గద్వాల ప్రాంతంలో ఏటా 30వేల ఎకరాల పత్తి విత్తనోత్పత్తి జరగడం, పత్తి విత్తనాలను పండిం చిన రైతుల నుంచి ఆర్గనైజర్ల వరకు క్రయ, విక్రయాలలో దాదాపు వేయి కోట్ల వరకు వ్యాపారం జరిగేది. ఇంతటి ఆదాయం ఉండటంతో ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు దశాబ్ద కాలంగా కోట్లకు పడగెత్తారు. ఆదాయం వస్తున్న ఆర్గనైజర్లు ఒకేతాటిపై ఉండే పరిస్థితి నుంచి రాజకీయ నేతల అనుచరులుగా మారిపోయారు. ఇలా వర్గాలుగా చేరి విత్తనోత్పత్తి సంస్థలకు రాజకీయాల బెదిరింపులను తీసుకెళ్లే వరకు వెళ్లారు. దీంతో కం పెనీలు ఈ ప్రాంతంలో పత్తివిత్తనోత్పత్తికి పెట్టుబడులు పెట్టడం అంత శ్రేయస్సు కాదన్న ఉద్దేశంతో రెండేళ్లుగా తగ్గింపును ప్రారంభించారు.
నిల్వలు పేరుకుపోవడం వల్లే
కంపెనీల వద్ద సీడ్ నిల్వలు పెద్ద ఎత్తున పేరుకపోయాయి. ప్రస్తుత ఏడాది 3 కోట్ల ప్యాకెట్ల నిల్వ లు నిలిచిపోయా యి. అందుకే ప్రస్తుతం 40వేల నుంచి 25వేలకు విస్తీర్ణం తగ్గించారు. వచ్చే ఏడాది మూడువేల ఎకరాలకు మించి పత్తి సాగు ఉండే అవకాశం లేదు. నిల్వలు పూర్తిగా కమర్షియల్‌కు వెళ్లిపోవడం జరిగితే రెండేళ్లలో మళ్లీ పత్తి విత్తనోత్పత్తి గతేడాది మాది రిగానే అధిక విస్తీర్ణానికి పెరగొచ్చు. రైతు లు అధైర్య పడవద్దు.
- సీడ్ గ్రోయర్స్ అసోసియేషన్
అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి
రాజకీయ గ్రహణం
Published Mon, May 5 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement