bhagat singh
-
భారత విప్లవ ప్రతీక!
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్‌కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్‌గా మార్చాడు.బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్‌లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.భగత్ సింగ్‌ను బ్రిటిష్‌వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం -
ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు
లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఒక కూడలికి భారత స్వాతంత్ర్య పోరాట వీరుడు భగత్ సింగ్ పేరు పెట్టడంలో జరుగుతున్న జాప్యంపై లాహోర్ హైకోర్టు అక్కడి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. దీనిపై నోటీసులు జారీ చేస్తూ, సమాధానం చెప్పేందుకు చివరి అవకాశం ఇచ్చింది.లాహోర్‌లోని షాద్మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంపై కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు పంజాబ్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీనికి సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును పంజాబ్ ప్రభుత్వం కోరింది. పాకిస్తాన్‌లోని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమ్స్ మహమూద్ మీర్జా విచారణ చేపట్టారు. ఈ అంశంపై స్పందించడానికి పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది సాద్ బిన్ ఘాజీ కోర్టుకు హాజరై, దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరారు.పంజాబ్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు, ఈ అంశంపై స్పందించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఖలీద్ జమాన్ ఖాన్ కాకర్ కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు నవంబర్ 8కి వాయిదా వేసింది.షాద్మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. 1931లో భగత్‌సింగ్‌ను ఉరితీసిన షాద్మాన్ చౌక్‌కు ఆయన పేరు పెట్టాలని లాహోర్ హైకోర్టు 2018లో ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఖురేషీ తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించలేదని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. ఆయనను సిక్కులు, హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతగానో గౌరవిస్తారు.ఇది కూడా చదవండి: ఎమర్జెన్సీకన్నా దారుణం -
Durgawati Devi: మూడేళ్ల కొడుకును పణంగా పెట్టి... భగత్‌సింగ్‌ను కాపాడిన భాభీ
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్వీర్... వీరంతా ఆమెను ‘దుర్గా భాభీ’ అని పిలిచేవారు. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టగలం అని భావించిన దళంలో పిస్తోల్ పట్టిన తొలి విప్లవ వనిత దుర్గావతి దేవి. బ్రిటిష్ అధికారి సాండర్స్‌ను హత్య చేసిన భగత్‌సింగ్‌ను లాహోర్ నుంచి తప్పించేందుకు అతడి భార్య అవతారం ఎత్తిందామె. చరిత్ర పుటలలో కనుమరుగై పోయిన ఆ త్యాగమయి గురించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...‘సైమన్ గోబ్యాక్’ నిరసన కార్యక్రమం చేస్తున్న లాలా లజపతిరాయ్ మీద బ్రిటిష్ పోలీసుల లాఠీచార్జీ జరిగి ఆయన ప్రాణం పోయింది. పంజాబ్‌లో యువతకు మార్గదర్శిగా ఉన్న ఆ మహా నాయకుణ్ణి కోల్పోయినందుకు ‘హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్’ (హెచ్ఎస్ఆర్ఏ) సభ్యులకు ఆగ్రహం వచ్చింది. ఇది స్వాతంత్య్ర సమరయోధుడు భగవతి చరణ్ ఓహ్రా నడుపుతున్న గ్రూప్. చంద్రశేఖర ఆజాద్, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ తదితరులంతా ఇందులో సభ్యులు. వీరంతా కలిసి లాఠీచార్జిని ఆర్డర్ వేసిన బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్‌ను చంపాలనుకున్నారు. నిర్ణయం అమలు పరచడమే తరువాయి.స్కాట్ బదులు సాండర్స్భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఈ ముగ్గురు 17 డిసెంబర్ 1928న లాహోర్‌లో పోలీస్ ఆఫీసర్ స్కాట్‌ను హతమార్చడానికి సిద్ధమయ్యారు. అయితే బైక్ మీద రావాల్సిన స్కాట్ కారులో, కారులోనూ రావాల్సిన మరో అధికారి సాండర్స్ బైక్ మీద రావడంతో అయోమయం నెలకొంది. అయినా సరే ఎదురుపడిన సాండర్స్‌పై మొదట రాజ్‌గురు, ఆ తర్వాత భగత్ సింగ్ తుపాకీ పేల్చి అతణ్ణి హతమార్చారు. లాహోర్ అంతా గగ్గోలు రేగింది. వందలాది మంది పోలీసులు అన్ని దారులు... బస్టాండ్లు... రైల్వేస్టేషన్లు కమ్ముకున్నారు. లాహోర్‌లో ఉండటం భగత్‌సింగ్‌కు ఏ మాత్రం మంచిది కాదు. అతణ్ణి తప్పించేవారు ఎవరు?ఆమె వచ్చిందిభగవతి చరణ్ ఓహ్రా సతీమణి దుర్గావతిని అందరూ దుర్గాభాభీ అని పిలిచేవారు. సాండర్స్‌ని హత్య చేశాక భగత్‌సింగ్, రాజ్‌గురు నేరుగా దుర్గావతి దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆమె భర్త వేరే పని మీద కలకత్తా వెళ్లి ఉన్నాడు. జరిగింది తెలుసుకున్న దుర్గావతి వెంటనే భగత్‌సింగ్‌ను లాహోర్ దాటించడానికి సిద్ధమైంది. జుట్టు కత్తిరించుకుని హ్యాట్ పెట్టి రూపం మార్చిన భగత్‌సింగ్‌కు ఆమె భార్యగా నటిస్తూ తన మూడేళ్ల కొడుకుతో మరుసటి రోజు సాయంత్రం లాహోర్ నుంచి డెహ్రాడూన్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో మొదటి తరగతి ప్రయాణికురాలిగా బయల్దేరదీసింది. వందలాది నిఘా కళ్ల మీద ఈ పని చేయడం చాలా ప్రమాదం... మూడేళ్ల కొడుక్కు కూడా ఏదైనా కావచ్చు అని భగత్‌సింగ్ ఆమెతో అన్నాడు. ‘నా కొడుక్కు మరణం సంభవిస్తే ఒక దేశభక్తునిగా తన ప్రాణం అర్పించే అవకాశం వాడికి దక్కుతుంది’ అని చెప్పి ఆమె ముందుకు కదిలింది. భగత్‌సింగ్ ఆధునికవేషంలో ఉన్న అధికారిగా, దుర్గావతి అతని భార్యగా, రాజ్‌గురు నౌకరుగా ఆ ప్రయాణం చేశారు. బ్రిటిష్ వాళ్లకు ఏ మాత్రం అనుమానం రాలేదు. భగత్‌సింగ్‌ను అలా క్షేమంగా కలకత్తా చేర్చి వెనక్కు వచ్చింది దుర్గావతి.గొప్ప దేశభక్తురాలుస్వతంత్ర పోరాటం చేస్తున్న భగవతి చరణ్ ఓహ్రాను వివాహం చేసుకునేనాటికి దుర్గావతికి 13 ఏళ్లు. పెళ్లి తర్వాతనే చదువుకుంది. ఇంట్లో ఇరుగు పొరుగు పిల్లలకు పాఠాలు చెప్పేది. సాయుధ పోరాటం చేయాలన్న భర్త ఆశయానికి మద్దతుగా నిలిచిందామె. భగత్‌సింగ్‌ను తన కన్నబిడ్డలా భావించింది. భగత్‌సింగ్ పార్లమెంట్లో బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాక ఆ తర్వాతగాని అతడే సాండర్స్ హత్యలో ఉన్నాడన్న సంగతి పోలీసులకు తెలియలేదు. ఆ కేసు వాదనలను బ్రిటిష్ ప్రభుత్వం హడావిడిగా ముగించి అక్టోబర్ 7, 1930న తీర్పు వెలువరించి భగత్‌సింగ్‌కు మరణశిక్ష విధించింది. అయితే లాహోర్‌లో ఈ విచారణ జరుగుతున్నప్పుడు భగత్‌సింగ్‌ను తీసుకెళ్లే వ్యానుపై బాంబుదాడి చేసి అతణ్ణి కాపాడాలని ప్లాన్ చేసింది దుర్గావతి. వీలు కాలేదు.భర్తను కోల్పోయిభగత్సింగ్ను జైలు నుంచి రక్షించడానికి స్వదేశీ జ్ఞానంతో బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు భగవతి చరణ్ ఓహ్రా మరణించాడు. అంత కష్టాన్ని తట్టుకుని దేశం కోసం పోరాడాలనుకుంది దుర్గావతి. భగత్‌సింగ్ మరణశిక్ష విధించాక ఆగ్రహంతో బొంబాయి వెళ్లి బ్రిటిష్ గవర్నర్‌ను చంపాలనుకుంది. అయితే గవర్నర్ దొరకలేదు. మరో బ్రిటిష్ అధికారి మీద స్వయంగా గుళ్ల వర్షం కురిపించి పగ చల్లార్చుకుంది. భగత్ సింగ్ ఉరి (1931 మార్చి 23) తర్వాత తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడం, పోలీసుల వెతుకులాట ఎక్కువ కావడంతో తనే వెళ్లి లొంగిపోయింది. మూడేళ్ల జైలు శిక్ష అనంతరం మొదట లక్నో ఆ తర్వాత ఘజియాబాద్‌లో పెద్దగా పబ్లిక్‌లో ఉండటానికి ఇష్టపడక స్కూల్ నడుపుతూ 1999లో తన 92వ ఏట మరణించిందా గొప్ప దేశభక్తురాలు, భారత తొలి సాయుధ పోరాట సమరయోధురాలు దుర్గాభాభీ. -
సినిమాకు అవార్డులు.. కానీ ఏం లాభం? రూ.22 కోట్ల నష్టం!
'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్'.. 2002లో వచ్చిన ఈ మూవీ జాతీయ అవార్డులు గెలుచుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్ జాబితాలో నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించాడు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించాడు.భగత్ సింగ్‌పై ఏకంగా ఐదు సినిమాలుతాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి నిర్మాత రమేశ్ తరణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మా సినిమా సరిగా ఆడలేదు. ఎందుకంటే అప్పుడు భగత్ సింగ్ మీదే ఐదు సినిమాలు తెరకెక్కాయి. అందులో ఒకటి మా సినిమా కంటే వారం ముందు రిలీజైంది. సరిగ్గా అప్పుడే '23 మార్చి 1931: షాహీద్' సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలతో మాకు పోటీ ఏర్పడింది. భగత్ సింగ్‌పై తెరకెక్కిన మరో చిత్రం ఎందుకనో ఆగిపోయింది. రామానంద్ సాగర్ తెరకెక్కించిన మరో మూవీ ఏడాది తర్వాత నేరుగా దూరదర్శన్‌లో విడుదల చేశారు.రూ.27 కోట్లు ఖర్చు పెట్టాంభగత్ సింగ్ సినిమా రిజల్ట్‌తో మా కంపెనీ మొత్తం వణికిపోయింది. ఎందుకంటే రూ.27 కోట్లు పెడితే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. రూ.22 కోట్లు నష్టపోయాం. సినిమాకు మంచి గౌరవం దక్కినా నష్టం మాత్రం తీవ్ర స్థాయిలో వాటిల్లింది. రిస్క్ చేసింది మేము కాబట్టి ఆ నష్టాన్ని మేమే భరించాం. ఈ మూవీకోసం పని చేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాం' అని పేర్కొన్నాడు. కాగా ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీలో రెండు జాతీయ పురస్కారాలు అందుకుంది.చదవండి: భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్ -
వివాదంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మధ్యలో ఆమె భర్త, మద్యం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఫోటో పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఫోటోపై భగత్ సింగ్ మునిమనవడు యాదవేంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘నేటి రాజకీయాలు వ్యక్తిగతంగా మారుతున్నాయి. ప్రజలకన్న వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాలు జరుగుతున్నాయి. ఏ నాయకుడిని ఆయనతో (భగత్‌సింగ్) పోల్చకూడదు. ఆయన దేశం, సమాజం కోసం కృషి చేశారు. సొంత ప్రయోజనాలు చూసుకోలేదు’ అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాటున ఇలా చేసి ఉంటే, దానిని సరిదిద్దాలని, అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాల మధ్య ఉంచిన కేజ్రీవాల్ ఫోటోను తొలగించాలని యాదవేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. అంతకుముందు, ఈ చిత్రంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. కేజ్రీవాల్ నిందితుడని, భగత్ సింగ్ డాక్టర్ అంబేద్కర్ లాంటి దేశభక్తుల మధ్య అతని ఫోటోను ఉంచడం ఆప్ వారి గౌరవాన్ని కించపరిచిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. -
భగత్‌సింగ్‌ను గుర్తుచేసుకుంటూ మారథాన్.. విజేతకు రూ. 4 లక్షల బహుమానం!
అమర వీరుడు భగత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ మార్చి 24న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మారథాన్ నిర్వహించనున్నారు. తాత్యా తోపే నగర్ స్టేడియంలో ‘షహీద్-ఏ-అజం’ పేరిట మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారి కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అన్ని వయసుల వారు ఈ మారథాన్‌లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌లో పాల్గొనేవారికి టీ-షర్ట్, అల్పాహారం, సర్టిఫికేట్ అందించనున్నారు. మారధాన్ విజేతకు రూ.4 లక్షల నగదు బహుమానం అందించనున్నారు. 24న ఉదయం 6 గంటలకు మారథాన్ ప్రారంభం కానుంది. ఈ ఈ మారథాన్‌ను సిక్స్త్ సెన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆరోజు భగత్ సింగ్‌కు నివాళులు అర్పించనున్నారు. -
పవన్ కు హిందీ మూవీ ఎఫెక్ట్.. గుక్కపట్టి ఏడుస్తున్న ఫ్యాన్స్
-
భగత్ సింగ్ అపూర్వమైన దేశభక్తుడు- కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే
న్యూఢిల్లీ: షహీద్ భగత్ సింగ్ ఒక అపూర్వమైన దేశ భక్తుడని, ఆయన అందరివాడని, రాబోయే తరాలవారికి ఒక స్ఫూర్తి జ్యోతి అని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే భగత్ సింగ్ సేవలను కొనియాడారు. భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా రాజ్ త్రిపాఠీ, రాహుల్ ఇంక్విలాబ్ రచించిన " క్రాంతీ కి దరోహర్" (హిందీ) గ్రంధాన్ని ముఖ్య అతిధి కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే అంబేద్కర్ ఆడిటోరియం, ఆంధ్ర భవన్ , ఢిల్లీలో 28 సెప్టెంబర్ 2023 న సాయంత్రం 5 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. సభకు ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చెసిన శాంభవి మఠాధిపతి స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ మాట్లాడుతూ పటిష్ట భారత దేశం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళ్ పాండే, భగత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాల వారు పాల్గొన్నారు. -
షాకింగ్ ఘటన: ఉరి సీన్ రిహార్సల్లో విషాదం
సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఒక నాటకాన్ని రిహర్సల్ చేస్తూ బాలుడు మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కోలార్‌లోని ఎస్ఎల్వీ స్కూల్లో 12 ఏళ్ల సంజయ్ గౌడ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి వచ్చేవారం స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భగత్ సింగ్ బయోగ్రఫీకి సంబంధించిన నాటకాన్ని వేయనున్నాడు. అందులో భాగంగానే ఇంట్లో రిహార్సల్ చేస్తున్నాడు సంజయ్. ఈ మేరకు సంజయ్ భగత్ సింగ్‌ని ఆంగ్లేయులు ఉరితీసే ఘట్టాన్ని రిహర్స్ల్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఉరి పడిపోయింది. దీంతో సంజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. దురదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అతడి కుటుంబికులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా సంజయ్ మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగానే ఈ నాటకాన్ని ప్రతిరోజు సంజయ్ రిహార్సల్ చేస్తున్నాడని కుటుంబికులు చెబుతున్నారు. అందులో భాగంగానే శనివారం రాత్రి కూడా రిహార్సల్ చేసి ఇలా విగత జీవిగా మారాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం సదరు సాంస్కృతిక కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడమే గాక సంజయ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. (చదవండి: ఇంట్లోకి మొసలి ఎంట్రీ... బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఆ కుటుంబం....) -
ఆ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు.. మోదీ కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో వెల్లడించారు. ‘గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా.. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం.’ అని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సెప్టెంబర్ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మన్ కీ బాత్‌లో భాగంగా వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మాట్లాడారు మోదీ. వాతావరణ మార్పు అనేది జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పించారు మోదీ. ఆయన దేశ మహోన్నతమైన కుమారుడిగా పేర్కొన్నారు. ఇటీవలే భారత్‌కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమన్నారు. టాస్క్‌ఫోర్స్ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. మరోవైపు.. అమరవీరుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న చూపు చూస్తోందని చెప్పేందుకే బీజేపీ పేరు మార్పునకు పూనకుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం భగత్ సింగ్ గ్రామం ఖట్కార్ కలాన్‌లోనే నిర్వహించారు. భగత్‌సింగ్ ఉపయోగించిన పసుపు టర్బన్స్‌ను సూచిస్తూ ప్రాంగణం మొత్తం పసువు రంగులతో నింపేశారు. అలాగే.. మార్చి 23న భగత్ సింగ్ వీరమరణం పొందిన రోజును సెలవుదినంగా ప్రకటించారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్ ఓకే -
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్రలోని గుజరాత్, రాజస్థాన్ ప్రజలను ఉద్ధేశిస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గవర్నర్‌పై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ మాటలు మరాఠీలను అవమానపరచేలా, హిందువులను విభజించేలా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. కోశ్యారీ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆయన మాటలతో ఏకీభవించమని షిండే స్పష్టం చేశారు. ‘కోశ్యారీ వ్యాఖ్యలతో ఏకీభవించం. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అతను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ముంబైవాసులను మేము ఎప్పుడూ మర్చిపోము. ముంబై అభివృద్ధి కోసం మరాఠీ ప్రజలు ఎంతో కృషి చేశారు. ముంబై ఎంతో ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైన నగరం. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజలు ముంబైని సొంత ఇంటిగా భావిస్తున్నప్పటికీ మరాఠీ ప్రజలు తమ గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకున్నారు. వారిని అవమానించకూడదు’ అని అన్నారు. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు: ఉద్ధవ్ థాక్రే ఇదిలా ఉండగా శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముఖ్యంగా పుణె, ముంబై వంటి ప్రాంతాల్లో డబ్బే ఉండదనిని వ్యాఖ్యానించారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధానిగా కొనసాగలేదని అన్నారు. ఇక గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సైతం స్పందిస్తూ.. మరాఠీ బిడ్డలను అవమానించేలా భగత్ సింగ్ కోశ్యారి మాట్లాడారని మండిపడ్డారు. ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు. -
Maharashtra Governor: ‘గుజరాతీలతోనే ముంబైకి ఆర్థిక రాజధాని పేరు’
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే రాష్ట్రంలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. ముంబైలోని అంధేరీలో ఓ చౌక్‌కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గవర్నర్. రాజీనామాకు శివసేన డిమాండ్.. గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరారు. ‘బీజేపీ ప్రతిపాదిత ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే మరాఠీలకు అవమానం ఎదురైంది. గవర్నర్ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించాలి. ఇది కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలకు అవమానం. సీఎం షిండే మీరు వింటున్నారా? నీపై నీకు ఆత్మగౌరవం ఉంటే.. గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలి.’ అంటూ ట్వీట్ చేశారు రౌత్. మరోవైపు.. కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించటం చాలా బాధాకరం. ఆయన పదవీ కాలంలో గవర్నర్ అధికారాలు, మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయాలు దెబ్బతినటమే కాదు.. రాష్ట్రాన్ని తరుచుగా అగౌరవపరుస్తున్నారు.’ అని పేర్కొన్నారు సచిన్ సావంత్. గవర్నర్ వెంటనే మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది. లేదంటే ఆయనను తొలగించాలని కేంద్రాన్ని కోరతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు ఇది సరైనదేనా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? హో.. వారి కెబినెట్ మంత్రులకు ఆమోదం లభించనందుకేమో.. అంటూ ఎద్దేవ చేశారు ప్రియాంక. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
భగత్ సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీగఢ్: భగత్ సింగ్‌పై వివాదాస్పద కామెంట్ చేశాడు పంజాబ్ ఎంపీ ఒకరు. సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీ స్థానానికి ఈమధ్యే ఎన్నికైన సిమ్రన్‌జిత్ సింగ్ మాన్(77) భగత్ సింగ్‌ను ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. సిమ్రన్‌జిత్ సింగ్ మాన్.. శిరోమణి అకాళీ దళ్(అమృత్సర్) చీఫ్ కూడా. ‘‘భగత్ సింగ్ యువకుడైన ఓ ఇంగ్లీష్ అధికారిని చంపాడు.సిక్కు కానిస్టేబుల్ ఛన్నన్ సింగ్‌నూ హతమార్చాడు. జాతీయ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఇప్పుడు చెప్పండి.. భగత్ సింగ్ ఉగ్రవాదా? కాదా?’’ అంటూ కామెంట్లు చేశాడు. ఖలిస్థానీ అనుకూల వ్యాఖ్యలు చేసే క్రమంలో.. ఇలా కామెంట్లు చేశాడు ఆయన. అయితే భగత్ సింగ్‌పై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేం కాదు. స్వాతంత్ర్య సమరయోధుడు, వీరుడైన భగత్‌సింగ్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని ఆప్ ప్రభుత్వం తప్పుబట్టింది. ఎంపీ వ్యాఖ్యలను హేయనీయమైన, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. మనోభావాలు దెబ్బతీసేలా, ఒక వీరుడ్ని అగౌరవపరిచేలా మాట్లాడినందుకు సిమ్రన్‌జిత్ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. పంజాబ్ రాజకీయాల్లో ఈయన వివాదాలకు కేరాఫ్. తాజాగా ఎంపీగా గెలిచిన వెంటనే ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు తన విజయాన్ని అంకితం చేస్తున్నానని, కశ్మీర్లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్లో వినిపిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. Shameful that some call him a terrorist. Shaheed-e-Azam Bhagat Singh is a hero, a patriot, a revolutionary and a true son of the soil. INQUILAB ZINDABAD! pic.twitter.com/7mpTalt3g1 — Raghav Chadha (@raghav_chadha) July 15, 2022 -
మహోజ్వల భారతి: భగత్‌సింగ్‌కి నచ్చిన కవి
రామ్ ప్రసాద్ బిస్మిల్ విప్లవకారుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర కేసులలో నిందితుడు. స్వాతంత్య్ర సమరయోధుడు కావడంతో పాటుగా రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలంపేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాశారు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం ఆయనకు స్ఫూర్తినిచ్చింది. అలాగే ఆర్య సమాజ్ సంస్థతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. ఆర్య సమాజ్ బోధకులు స్వామి సోమ్ దేవ్ ఆయన గురువు. హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ కూడా ఒకరు. భగత్ సింగ్ ఆయనను ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. కవిత్వ రచనతో పాటుగా ఆయన ఆంగ్లం నుంచి కేథరీన్, బెంగాలీ నుంచి బోల్షెవికోం కీ కర్తూత్ పుస్తకాలను హిందీలోకి అనువదించారు. ‘సర్ఫరోషీ కీ తమన్నా’తో సహా అనేక స్ఫూర్తిదాయ కమైన దేశభక్తి గీతాలు రచించారు. రాం ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11లో బ్రిటిష్ ఇండియాలో వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని షాజహాన్ పూర్లో జన్మించారు. ఇంట్లో తండ్రి నుండి హిందీ నేర్చుకొని ఒక మౌల్వీ నుండి ఉర్దూ అభ్యసించారు. రామ్ ప్రసాద్ తండ్రికి ఇంగ్లిష్ అంటే ఇష్టం లేకున్నా తన కుమారుడిని ఆంగ్ల భాష పాఠశాలలో చేర్పించారు. విప్లవ యోధుడిగా మారాక, ముప్పై ఏళ్ల వయసులో ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1927 డిసెంబర్ 19న ఉరి తీసింది. -
చైతన్య భారతి: భగత్‌సింగ్ / 1907–1931
‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ సినిమాకు స్క్రిప్టు రాయడానికి నేను పరిశోధన చేపట్టినప్పుడు నన్ను నిరంతరం తొలిచిన ప్రశ్న– అసలు ఆయన ఎందుకు ప్రాణాలను బలిపెట్టాలను కున్నారు? రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న కుటుంబంలో జన్మించిన భగత్‌సింగ్‌కు బాలుడిగా ఉన్నప్పుడే భారతదేశం పరాయి దేశ పాలనలో ఉందనే సంగతి తెలుసు. అయితే, జలియన్‌వాలా బాగ్ ఊచకోత తరువాతనే విదేశీ పాలన ఘోరమైన పరిణామాలను ఆయన ఆర్థం చేసుకోగలిగారు. అక్కడి దృశ్యాలు ఆయనను ఎంతగా కదలించాయంటే, అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలోకి నింపి, ఆనాటి ఘోరకలికి గుర్తుగా భద్రపరచుకున్నారు. పరాయి పాలనలో మగ్గుతున్నప్పుడు ఇలాంటి దారుణాలు అనివార్యమనే సంగతిని తనకు ఆ సీసా జీవితాంతం గుర్తు చేయాలని భగత్ భావించారు. బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడి లాలా లజపతి రాయ్ మరణించినప్పుడు భగత్ ఆగ్రహంతో రగిలిపోయారు. అణచివేతదారుల హింసను విప్లవాత్మక ప్రతి హింసతో ఎదుర్కోవాలని ఆయన భావించారు. లాలాపై లాఠీ ప్రయోగించిన అధికారి మీద తన స్నేహితులతో కలిసి నాలుగు తూటాలు పేల్చారు. అది భగత్ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన. చదవండి: స్వతంత్ర భారతి: డియర్ గెస్ట్.. నేను మీ కెప్టెన్ బ్రిటిష్ అధికారిని చంపినందుకు ప్రభుత్వం తనను ఉరి తీస్తుంది. దాని గురించి భగత్‌సింగ్‌కు భయం లేదు. ఆయనకు ముఖ్యమైనది భారతదేశానికి స్వాతంత్య్రం సాధించాలన్న ఆశయమే. ఆ లక్ష్య సాధనకు తన జీవితం లేక మరణమనేవి సాధనాలు మాత్రమే. అలా 23 ఏళ్లకే భగత్ సింగ్ పరిపూర్ణ ఆదర్శవాదిగా మారిపోయారు. ఆయన లక్ష్యం ఆయన ప్రాణాలకంటే మించినది. ప్రేమించిన వారి కోసం కాకుండా ఒక లక్ష్యం కోసం ఆనందంగా ప్రాణాలను బలిపెట్టాలనుకునే మనఃస్థితి ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే అదెలా ఉంటుందో నాకు ఇప్పటికీ తెలియదు. నేడు ప్రతి ఒక్కరూ భగత్‌సింగ్‌ను తమవాడంటున్నారు. చివరకు సంఘ్ పరివార్ కూడా. సంఘ్ రాజకీయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుంచుకోవాలి. ఆయన విశిష్టతను నిజంగా తెలుసుకోవడమంటే, శౌర్య సారాన్ని అవగాహన చేసుకోవడమే. భగత్‌సింగ్ శౌర్యం తుపాకీ పేల్చడంలో లేదు. ఆయన ఆదర్శాలు, ఆచరణల మేళవింపులోనే ఉంది. – అంజుం రాజాబాలి (రాజాబలి మాటలు రాసిన బాలీవుడ్ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ విడుదలై నేటికి ఇరవైఏళ్లు) -
అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: అమరవీరుల దినోత్సవం(మార్చి 23న) సందర్భంగా బుధవారం శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం–గవర్నర్ మధ్య పెరిగిన దూరం?
సాక్షి, ముంబై: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు, ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికి మధ్య ఉండాల్సిన సత్సంబంధాలు అంత సహృద్భావంగా లేవని, వారిద్దరి మధ్య దూరం పెరిగిందని గతంలో జరిగిన పలు సంఘటనల వల్ల తెలుస్తోంది. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి.. అంటే గత రెండు సంవత్సరాల నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య కేవలం రెండంటే రెండుసార్లు మాత్రమే పరస్పర మర్యాదపూర్వకమైన భేటీ జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శాసన మండలికి ఎంపిక కావడం, 12 మంది శాసన మండలి సభ్యులను నియమించడం, ప్రభుత్వ విమానాన్ని వాడుకోవడం, శాసన సభ అధ్యక్షుడి ఎన్నిక లాంటి కొన్ని అంశాల పట్ల గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వ్యవహరించిన తీరుపట్ల ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోందని తెలుస్తోంది. పలు సందర్భాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నాయకుడు సంజయ్ రావుత్‌తో పాటు, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ కూడా గవర్నర్ వ్యవహార శైలిని అక్షేపించా రు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా, గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు, చర్చలు, సత్సం బంధాలు ఉంటాయి. పరస్పరం మర్యాదçపూర్వకం గా కలుసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. కానీ, గత రెండు సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లుగా కనిపిస్తోంది. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ 2019 నవంబర్ 28వ తేదీన ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. వారిద్దరి మధ్య అదే మొదటి కలయిక. చదవండి: ముఖ్యమంత్రి బావమరిదిపై ఈడీ కేసు.. రూ. 6.45 కోట్ల ఆస్తులు సీజ్ ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మహాపరినిర్వాణ రోజైన 2019 డిసెంబర్ ఆరవ తేదీన దాదర్‌లోని చైత్యభూమిలో రెండవసారి కలుసుకున్నారు. ఆ తరువాత 1 జనవరి, 2020న శాసన సభ మొదటి సమావేశాల్లో శాసన సభ ప్రాంగణంలో మూడవసారి కలుసుకున్నారు. 3 జనవరి 2020న ఠాక్రేల నివాసస్థానమైన మాతోశ్రీ భవనంలో జరిగిన ఒక విందుభోజనంలో గవర్నర్ కోశ్యారీ పాల్గొన్నారు. అది ఠాక్రేతో నాలుగవ కలయిక. 20 జనవరి, 2020న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజ్‌భవన్ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది ఆ ఇద్దరి మధ్య జరిగిన మొదటి మర్యాదపూర్వకమైన సమావేశం. దాని తర్వాత 9 ఫిబ్రవరి రోజు మరోసారి ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లోనే రెండవసారి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ సమావేశం తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగి ఇంతవరకు మూడవ మర్యాదపూర్వకమైన భేటీ, సమావేశం ఇంతవరకు జరగలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే సంకేతాలు రాజకీయవర్గంలో చర్చనీయాంశమయ్యా యి. గత రెండుంపావు సంవత్సరాల కాలంలో రెండుసార్లు తప్ప ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య నేరుగా మర్యాదపూర్వకమైన భేటీ జరగలేదు. అనధికారికంగా 30సార్లు భేటీ.. వీరిద్దరు ప్రజావేదికలపైన, ప్రభుత్వ కార్యక్రమాల్లో దాదాపు 30 సార్లు కలుసుకున్నారు. ఇందులో ప్రముఖంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు, మహారాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాలు, శాసన మండలి సమావేశాల ప్రారంభంలో, మంత్రివర్గ ప్రమాణస్వీకారం సమయంలో, లోకాయుక్త ప్రమాణ సందర్భంలో, ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్వాగత సమయంలో, ఇలాంటి పలు సందర్భాల్లో కలుసుకున్నప్పటికీ మర్యాదపూర్వకంగా మాత్రం రెండుసార్లు మాత్రమే కలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే తండ్రి మాధవరావ్ పాటన్కర్ చనిపోయినప్పుడు గవర్నర్ కోశ్యారీ మర్యాదపూర్వకంగా మాతోశ్రీ భవనానికి వెళ్ళి రశ్మి ఠాక్రేను ఓదార్చి వచ్చారు. 17 జూన్ 2021 నాడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజ్‌భవన్ వెళ్ళి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఇలాంటి కొన్ని సందర్భాలు తప్ప అధికారికంగా సహద్భావ వాతావరణంలో వారిద్దరి మధ్య ఎలాంటి సమావేశాలు జరగడం లేదు. -
భగత్‌సింగ్ సదా స్ఫూర్తి ప్రదాత
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సంగ్రామంలో భగత్‌సింగ్ చేసిన త్యాగం మహోన్నతమైనదని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఆయన నిరుపమాన పోరాటం, త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. విప్లవ వీరుడు భగత్‌సింగ్ దేశ ప్రజలకు సదా స్ఫూర్తి ప్రదాత అని గవర్నర్ అన్నారు. భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గవర్నర్ నివాళులు అర్పించారని రాజ్‌భవన్ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
భగత్ సింగ్ ఉరి సన్నివేశం రిహార్సల్ విషాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బుడౌన్లోని బాబాత్ గ్రామంలో భగత్ సింగ్ ఉరి వేసే సన్నివేశాన్ని రిహార్సల్ చేస్తుండగా.. 9 ఏళ్ల బాలుడు మరణించాడు. వివరాల్లోకి వేళితే.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్వాతంత్ర్య సమరయోధుల జీవితం ఆధారంగా ఒక నాటకం కోసం యూపీలోని పాఠశాల విద్యార్థులు రిహార్సల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శివమ్(9) అనే బాలుడు భగత్ సింగ్ పాత్రను పోషించాలనుకున్నాడు. బాలుడు స్నేహితులతో కలిసి అతని ఇంటి ప్రాంగణంలో రిహార్సల్ చేయడం మొదలు పెట్టారు. నాటకం చివరి సన్నివేశం కోసం శివమ్ ఒక తాడును తీసుకొని ఓ ఉచ్చును రూపొందించాడు. దాన్ని అతని మెడ చుట్టూ తగిలించుకున్నాడు. కానీ ప్రమాదావశాత్తు అతని పాదాలు స్టూల్ నుంచి జారిపోవడంతో ఉరి బిగుసుకుంది. ఆ సమయంలో అతడు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అతడి స్నేహితులు ఇదంతా యాక్టింగ్ అనుకున్నారు. ఇంతలో శరీరంలో కదలికలు లేకపోయే సరికి పిల్లలు భయపడి అరిచారు. దీంతో స్థానికులు వచ్చి శివమ్‌ను కిందికి దించారు. కానీ అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కాగా గత సంవత్సరం కూడా మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో భగత్ సింగ్ ఉరిశిక్ష రిహార్సల్ చేస్తూ ఓ బాలుడు మరణించాడు. -
ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కాంగ్రెస్ నేత, ఆనంద్‌పుర్ సాహెబ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మనీశ్ తివారీ కోరారు. అంతకన్నా ముందు వారిని ‘షహీద్ ఎ ఆజమ్’బిరుదుతో సత్కరించాలని, మొహాలిలోని చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరు పెట్టాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా ఈ ముగ్గురు వారి కాలంలో ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించారని, ఆ క్రమంలోనే 1931 మార్చి 23వ తేదీన దేశంకోసం ప్రాణాలు అర్పించారని మనీశ్ తివారీ తెలిపారు. -
ఘనంగా జాషువా జయంతి
-
ఏపీ సీఎంవోలో గుర్రం జాషువా జయంతి వేడుకలు
సాక్షి, విజయవాడ : గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరై గుర్రం జాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాహితివేత్తలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావులకు పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. జాషువా రచనలను వారు ప్రస్తుతించారు. ఆయన సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆదర్శప్రాయంగా నిలిచారని వక్తలు ప్రశంసించారు. దళిత సాహిత్యం, చైతన్య వంతమైన సాహిత్యానికి జాషువా పెట్టింది పేరని వారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. భగత్‌సింగ్‌కు నివాళుర్పించిన జగన్.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘నేడు నిజమైన హీరో జన్మించిన రోజు.. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటీకి మరవలేనివి, అలోచనలకు మరణం లేదని నిరుపించిన వ్యక్తి భగత్ సింగ్ ఆయనకు నా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘షహీద్’ అనాలా, ‘మార్టైర్’ అనాలా!?
సాక్షివెబ్ ప్రత్యేకం: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికులకు షహీద్ లేదా మార్టైర్ హోదాను కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విశయం తెల్సిందే. సైన్యంలో అలాంటి హోదా లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ పుల్వామా దాడిలో మరణించిన సైనికుల గురించి మోదీ ప్రస్తావించినప్పుడల్లా వారిని ‘షహీద్’ అని అంటున్నారు. గతంతో భారత సైనికులు మరణించినప్పుడు ‘మార్టైర్’ అని వ్యవహరించారుగానీ ‘షహీద్’ అని వ్యవహరించలేదు. అయితే బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారిని ‘షహీద్’గా వ్యవరించారు. అందుకు ఉదాహరణ భారత స్వాతంత్య్ర సమర యోధుడు ‘షహీద్ భగత్ సింగ్’. ఆయన గురించి 1965లో ‘షహీద్’ పేరిట మనోజ్ కుమార్ నటించిన, 2002లో బాబీ డియోల్ నటించిన ‘షహీద్’ సినిమాలు వచ్చాయి. షహీద్ అనే పదం హిందీ పదంగా, మార్టైర్ పదం ఇంగ్లీషు పదంగా నేడు చెలామణి అవుతోంది. తెలుగులో ఈ పదాలకు ‘అమర వీరుడు’గా వ్యవహరిస్తున్నారు. తెలుగు వ్యవహారంలో ఇది మంచి పదమేగానీ సమానార్థం కాదు. ‘షహీద్’ పదం అరబిక్ నుంచి రాగా, ‘మార్టైర్ అనే పదం గ్రీకు మూలం నుంచి వచ్చింది. ఈ రెండు పదాలకు సమానార్థం సాక్షి. ఆది నుంచి ఇస్లాం మతంతో షాహిద్, క్రైస్తవ మతంతో మార్టైర్ అనే పదాలు అల్లుకు పోయాయి. ‘మార్టైర్’ పరిణామ క్రమం ‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చి’ ప్రకారం మార్టైర్ అంటే ‘సాక్షి’ అని అర్థం. క్రైస్తవంలో ప్రధాన మత బోధకుడిని, ఏసు క్రీస్తు ప్రధాన అనుచరులను మార్టైర్ గా పేర్కొనే వారు. అంటే మత బోధనల్లో ఉన్న అంశాలకు సంబంధించి ఆయన ప్రత్యక్ష సాక్షి అనే అర్థంలోనే అలా పిలిచేవారు. మత ప్రచారం కోసం ఎవరైనా మరణిస్తే లేదా ప్రాణాలర్పిస్తే వారి మార్టైర్ గా వ్యవహరించడం కాలక్రమంలో వచ్చింది. క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించే నాటి రోమన్లు క్రైస్తవ ప్రచారకులపైకి సింహాలను వదిలేవారు. వాటి చేతుల్లో మరణించిన వారిని మారై్టర్స్గా పిలిచేవారు. ‘బైబిల్’ రెండో భాగమైన ‘న్యూ టెస్టామెంట్’లో మార్టైర్ గురించి ఎక్కువగా ఉంది. మార్టైర్ అంటే మరణించిన వారికన్నా, ప్రధాన మత బోధకులనే అలా ఎక్కువగా వ్యవహించడం అందులో కనిపిస్తుంది. షహీద్ పరిణామ క్రమం అరబిక్ మూలం నుంచి వచ్చిన ‘షహీద్’ సమానార్థం ‘సాక్షి’యే అయినప్పటికీ మత ప్రచారంలో భాగంగా ప్రాణాలను కోల్పోయిన వారినే ‘షహీద్’లుగా ఎక్కువగా పేర్కొంటున్నారు. ‘ఖురాన్’లో సాక్షి అనే అర్థంలోనే షహీద్ పదాలను వాడారు. ముస్లింలలో ముఖ్యంగా షియా తెగవారు మరణించిన వారిని ‘షహీద్’లుగా పేర్కొంటున్నారు. ఖలీఫా రాజ్య స్థాపన కోసం మరణించే వారంతా వారి దృష్టిలో షహీద్లే. ‘హుతాత్మా’ అంటే ఏమిటీ ? షాహిద్, మార్టైర్ అనే రెండు పదాలు కూడా రెండు మతాలకు సంబంధించినవి కావడం వల్ల దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికులను ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పదాలతో పిలవరాదని ‘హిందూత్వ’ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమర వీరుడు అనే అర్థంలో మరాఠీ మూలం నుంచి ‘హుతాత్మ’ అనే సంస్కృత పదాన్ని కాయిన్ చేశారు. దక్షిణ ముంబైలో అమర వీరుల స్మారక స్థూపానికి ‘హుతాత్మ చౌక్’ అని పేరు పెట్టారు. ప్రపంచ చరిత్రలో కోకొల్లలు భారత దేశం సెక్యులర్ దేశమని, సెక్కులర్ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు మరణిస్తే ‘మార్టైర్’ పదాన్ని ఉపయోగించరాదని 2017లో సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ వాదించారు. కానీ ప్రపంచ చరిత్రలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారిని మార్టైర్స్గా పేర్కొనడం ఉంది. 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియా రాజ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన హంగేరియన్లను, 20వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్రం కోసం పోరాడిన ఐరిష్ అమర వీరులను మార్టైర్స్గా వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అభ్రహాం లింకన్ హత్య తర్వాత పది రోజులకు ఆయన నిజమైన దేశభక్తుడైనందున ఆయనకు మార్టైర్ హోదా కల్పించాలంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ డిమాండ్ చేసింది. మార్టిన్ లూథర్ కింగ్‌ను ‘అహింసా మార్టైర్’గా వాషింఘ్టన్ పోస్ట్ వ్యవహరించింది. మన సైన్యం ఏమంటుంది ? మన భారత దేశ సైనిక పరిభాషలో దేశం కోసం మరణించిన సైనికులను ‘బాటిల్ క్యాజువాలిటీ లేదా ఆపరేషన్స్ క్యాజువాలిటీ’ అని వ్యవహరిస్తున్నారు. అంతకుమించి ఎలాంటి విశేషణాలు వాడడం లేదు. (గమనిక: అమర వీరులను సావర్కర్ సూచించినట్లు ‘హుతాత్మలు’గా వ్యవహరించాలంటూ హిందూత్వ వాదులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరింత స్పష్టత కోసం ఈ వ్యాసం) -
పవన్ కల్యాణ్.. భగత్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్నారా?
సాక్షి, హైదరాబాద్ : భగత్ సింగ్.. మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 23 ఏళ్ల వయసులోనే... దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి... ఉరికొయ్యను ముద్దాడిన ఈ స్వాతంత్ర్య సమరయోధుడు ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. డల్లాస్ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జనలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోధులను ఉదహరిస్తూ భగత్ సింగ్ పేరును ప్రస్తావించారు. భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను చదవాలని సూచించారు. అయితే భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి.. వారి చేతిలో ఉరితీయబడ్డారని అందరికీ తెలిసిందే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం పొరపాటుగా భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ అజాద్ పేరు బదులు భగత్ సింగ్ పేరును పొరపాటుగా ప్రస్తావించారని ఆయన అభిమానులు సమర్ధించుకుంటున్నారు. బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టడంతో ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్నప్పుడు చేసిన శపథం నిజం చేస్తూ ఆజాద్ తన తుపాకీతో కాల్చుకుని వీరమరణం పొందిన విషయం తెలిసిందే. -
అమరుల త్యాగానికి గుర్తింపేది?
సర్దార్ భగత్ సింగ్, భారత్ గర్వించదగిన సమరయోధుడు. జాతిపిత గాంధీజీ శాంతి ఉద్యమం ఎంత సమున్నతమైనదో, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి యువకుల ప్రాణ త్యాగం కూడా అంతే కీలకమైంది. నేతాజీ నడిపిన ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. వారిని గుర్తిస్తున్నామా? అధికారికంగా మన దేశం వారికి ఏ స్థాయి కల్పిస్తున్నది? భగత్‌సింగ్‌ను షహీద్ అని ప్రభుత్వం గుర్తించిందా లేదా, గుర్తించడానికి చట్టపరంగా ఏవైనా ఇబ్బందులు, పరిమితులు, ఆంక్షలు ఉన్నాయా, కనీసం ఆయనను స్వతంత్ర సేనానిగా ప్రభుత్వం అంగీకరిస్తుందా అని సమాచారం అడిగారు అమిత్. ఆయన అడిగింది రాష్ట్రపతి భవన్ అధికారులను. వారు ఆయన ఆర్టీఐ దరఖాస్తును హోం శాఖకు పంపించారు. హోం శాఖ దాన్ని అదే వేగంతో పురావస్తుశాఖకు తరలించింది. భగత్‌సింగ్ జీవితానికి, పోరాటానికి సంబంధించిన పత్రాలను ఎవరైనా వచ్చి చదువు కోవచ్చునని, భగత్ సింగ్ గుర్తింపుపై సమాచారం తమదగ్గర ఉన్న దస్తావేజులలో లేదని పురావస్తు శాఖ తెలిపింది. సంతృప్తి చెందని అమిత్ కుమార్ సమాచార కమిషన్ తలుపు తట్టారు. ఈ సమాచార అభ్యర్థన నిజానికి ప్రభుత్వం భగత్ సింగ్ వంటి వీర పుత్రుల గురించి ఏదైనా విధాన నిర్ణయం తీసుకుందా, తీసుకుంటే ఆ విధానం గురించి సమాచారం ఇస్తుందా అనేవి అసలు ప్రశ్నలు. ఈ వీరులు తమ యవ్వనాన్ని లెక్క చేయకుండా దేశానికి అర్పించారని ప్రధాని నివాళులర్పించారు. ఆ ముగ్గురు వీరులు ఉరికంబానికి వేలాడిన మార్చి 23న దేశ భక్తులంతా నివాళులర్పిస్తారు. వారు అమరులై 81 ఏళ్లు దాటింది. ఈ సంవత్సరం మార్చి 25న ఆరోరా అనే న్యాయవాది, భగత్ సింగ్ విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటని అడిగారు. దానికి హోం మంత్రిత్వ శాఖ ‘జీవించి ఉన్న వారినైనా మరణించిన వారినైనా అమర వీరులుగా అధికారికంగా గుర్తించలేదు’ అంటూ ఈ దరఖాస్తును జాతీయ పురావస్తు విభాగానికి బదిలీ చేశారు. ఇలా అయితే రాబోయే తరాలు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, ఉద్ధంసింగ్, కర్తార్‌సింగ్ వంటి అమరుల త్యాగాలను మరిచిపోతాయని ఆరోరా అన్నారు. భారత ప్రభుత్వం లేదా పంజాబ్, హరియాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమరవీరులకు షహీద్ గౌరవాన్ని ఇవ్వాలి. అధికారికంగా ప్రకటన జారీచేయాలని ఆరోరా కోరారు. అమర వీరులు, స్వాతంత్య్ర పోరాట వీరుల జాబితాలను ముందు తరాలవారి కోసం అధికారికంగా విడుదల చేయాలని కోరారు. ప్రతి ఏడాదీ ఇటువంటి డిమాండ్ వస్తూనే ఉంది. హోం శాఖ మాదగ్గర ఏ అధికారిక పత్రం లేదు. కనుక మేం చెప్పేది ఏమీ లేదని జవాబు ఇస్తూనే ఉంది. పంజాబ్ ప్రభుత్వం సరబ్జిత్ సింగ్‌ను జాతీయ అమర వీరుడుగా ప్రకటించింది. మరి భగత్‌సింగ్‌ను ఎందుకు వదిలేశారు అని వీరు అడుగుతు న్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టు మార్చి 20 (2018) నాటి తీర్పులో ఈ ముగ్గురు వీరులను షహీద్ అని ప్రకటించాలని ఆదేశించడానికి ఏ చట్టమూ లేదని వివరించింది. ఆర్టికల్ 18 ప్రకారం బిరుదులు ఇవ్వడానికి వీల్లేదని పంజాబ్ ప్రభుత్వం వాదించింది. బీరేంద్ర సంగ్వాన్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి న్యాయమూర్తులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, సి.హరిశంకర్ డిసెంబర్ 12, 2017న ఈ విధమైన తీర్పు ఇచ్చిందని పంజాబ్ హరియాణా కోర్టు ఉటంకించింది. 2015లో ఆర్టీఐ దరఖాస్తుకు కూడా హోం శాఖ ఇదే సమాచారం ఇచ్చింది. ఆనాటి ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ ‘భగత్‌సింగ్ గురించి అధికారిక పత్రాలు ఉన్నా, లేకపోయినా, వారు ఈ దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అవిభాజ్యమైన భాగస్వాములుగా ఉంటారు. వారి వారసత్వాన్ని జాతి గర్వంగా స్వీకరిస్తుంద’ని అన్నారు. భగత్ సింగ్ మనవడు అధికారికంగా వారికి షహీద్ హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విభిన్న రంగాలలో పేరెన్నిక గన్న వారికి భారతరత్న, పద్మ అవార్డులు ఇవ్వడానికి, సైన్యంలోని వారికి వీరచక్ర బిరుదులు ఇవ్వడానికి, క్రీడాకారులకు ఖేల్ రత్న బిరుదులు ఇవ్వడానికి అడ్డురాని ఆర్టి కల్ 18 భగత్ సింగ్‌ను అమరవీరుడని అధికారికంగా పిలవడానికి అడ్డొస్తుందా? భగత్ సింగ్ వంటి వీరులను, ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను అధికారికంగా గుర్తించడానికి ఏమైనా ఆలో చిస్తున్నారో లేదా అనే విషయమై ఇప్పటి ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు వీలుగా హోంమంత్రి ముందు ఈ దరఖాస్తును ఉంచాలని సీఐసీ ఆదేశించింది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్