రాజ్యసభలో ప్రభుత్వంపై విపక్షాల ధ్వజం
న్యూఢిల్లీ: జాతీయ అమరవీరుల జాబితాలో భగత్‌సింగ్ పేరు లేకపోవడంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే ఆయన పేరు ను చేర్చాలని డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా.. ప్రభుత్వం భగత్‌ను అమరవీరుడిగా పరిగణిస్తోందని, త్వరలోనే అమరుల జాబితాలో చేరుస్తామన్నారు.
అమరవీరుల జాబితాలో భగత్‌సింగ్ పేరు లేదన్న విషయాన్ని ఒక ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని జీరో అవర్‌లో జేడీయూ సభ్యుడు కేసీ త్యాగి లేవనెత్తారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు, బీఎస్పీ నేత ఎస్‌సీ మిశ్రా, జేడీయూ నేత శివానంద తివారీ డిమాండ్ చేశారు. దీంతో రాజీవ్ శుక్లా సమాధానమిస్తూ.. ‘భగత్ జ్ఞాపకార్థం ప్రభుత్వం ప్రత్యేక నాణాలను విడుదల చేసింది. ఆయన జన్మించిన నవాన్‌షహర్‌కు ‘షహీద్ భగత్‌సింగ్ నగర్’గా నామకరణంచేశాం.అమరవీరుల జాబితాలోనూ చేరుస్తాం’అని చెప్పారు.
భగత్‌సింగ్ అమరవీరుడు కాదా?
Published Tue, Aug 20 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement
Advertisement