RTI application
-
మరోసారి ఇక ఎవ్వరూ దరఖాస్తు చేయరు సార్!
-
ఒకే ఉత్తర్వుతో 545 ఆర్టీఐ దరఖాస్తులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి దాఖలు చేసిన 545 దరఖాస్తులకు సంబంధించి ఒకే ఉత్తర్వుతో వాటికి మోక్షం కల్పించింది. శ్రీనివాస్‌రెడ్డి అనే న్యాయవాది రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి బడ్జెట్లో వివిధ పద్దుల కింద ఎంతెంత బడ్జెట్ కేటాయించారు..ఎంత ఖర్చు చేశా రో వివరాలు ఇవ్వాలంటూ ఒక్కో అంశంపై పది పేజీలతో కూడిన మొత్తం 545 దరఖాస్తులను ఆర్టీఐ చట్టం కింద దాఖలు చేశారు. సమాచారంకోసం ఒక వ్యక్తి పరి మిత సంఖ్యలోనే దరఖాస్తులు ఇవ్వాలన్న నిబంధనేదీ లేకపోవడంతో న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి వాటిని దాఖలు చేశా రు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ బు ద్దా మురళి ఏడాది కాలంగా ఆ న్యాయవాది ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి.. వాటన్నిటికీ ఒకే ఉత్తర్వునిస్తూ ఆయన కోరిన సమాచారం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులను ఆర్టీఐ కార్యాలయానికి పిలిపించి ఆ దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వివరాలు బడ్జెట్ పుస్తకాల్లో ఉంటాయని అధికారులు సమాచారం ఇవ్వగా.. వ్యయం వివరాలు కూడా ఇవ్వాలని చీఫ్ కమిషనర్ ఆదేశించారు. కాగా, ఒకే వ్యక్తి వందల సంఖ్యలో దరఖాస్తులు ఇవ్వడం వల్ల అధికారుల సమయం వృథా అవడమేకాక, కమిషన్‌పై భారం పడుతుందని ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి పురపాలక శాఖలో వివరాలు కావాలంటూ రెండు వందలకు పైగా దరఖాస్తులు సమర్పించారని చీఫ్ కమిషనర్ తెలిపారు. వాటికి కూడా ఒకే ఉత్తర్వు జారీ చేశామని చెప్పారు. -
ఆర్టీఐ సమాచారానికి జీఎస్టీ వసూలు
భోపాల్: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వివరాలను కోరిన ఓ వ్యక్తికి మధ్యప్రదేశ్ అధికారులు షాకిచ్చారు. సమాచారాన్ని ఇచ్చేందుకు ఖర్చయిన మొత్తంపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను కూడా విధించారు. మధ్యప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ(రెరా) కార్యాలయం ఆధునీకరణకు ఎంత ఖర్చయిందో చెప్పాలని సామాజిక కార్యకర్త అజయ్ దూబే ఆర్టీఐ కింద పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మధ్యప్రదేశ్ గృహ, మౌలిక వసతుల కల్పన బోర్డు 18 పేజీల సమాచారానికి రూ.43 వసూలు చేసింది. వాస్తవంగా సమాచారాన్ని ఇచ్చేందుకు రూ.36 ఖర్చుకాగా, కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ కింద చెరో రూ.3.5ను వసూలు చేశారు. ఈ విషయమై పిటిషన్ దూబే స్పందిస్తూ.. ఆర్టీఐ చట్టం–2005 ప్రకారం ఇచ్చే సమాచారం సేవ కాదనీ, దీనిపై జీఎస్టీ వసూలు చేయకూడదని తెలిపారు. ఆర్టీఐ చట్టం ప్రకారం కేంద్ర ప్రజా సమాచార అధికారి (సీపీఐవో) కేవలం సమాచారాన్ని కాపీ చేసేందుకు ఖర్చయ్యే మొత్తాన్ని మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందనీ, వీటిపై అదనంగా జీఎస్టీని విధించరాదని కేంద్ర సమాచార కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. -
'సహ'దరఖాస్తు చించినందుకు ఆందోళన
కరీంనగర్: అడంగల్, పహణీల పరిశీలన కోసం సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న దరాఖాస్తును చించివేసిన అధికారులపై చర్య తీసుకోవాలని కె. మహేందర్ అనే వ్యక్తి తహసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధ్యులైన అధికారులపై చర్యతీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. (కమలాపూర్) -
భగత్‌సింగ్ అమరవీరుడు కాదా?
రాజ్యసభలో ప్రభుత్వంపై విపక్షాల ధ్వజం న్యూఢిల్లీ: జాతీయ అమరవీరుల జాబితాలో భగత్‌సింగ్ పేరు లేకపోవడంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే ఆయన పేరు ను చేర్చాలని డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా.. ప్రభుత్వం భగత్‌ను అమరవీరుడిగా పరిగణిస్తోందని, త్వరలోనే అమరుల జాబితాలో చేరుస్తామన్నారు. అమరవీరుల జాబితాలో భగత్‌సింగ్ పేరు లేదన్న విషయాన్ని ఒక ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని జీరో అవర్‌లో జేడీయూ సభ్యుడు కేసీ త్యాగి లేవనెత్తారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, జేడీయూ నేత శివానంద తివారీ డిమాండ్ చేశారు. దీంతో రాజీవ్ శుక్లా సమాధానమిస్తూ.. ‘భగత్ జ్ఞాపకార్థం ప్రభుత్వం ప్రత్యేక నాణాలను విడుదల చేసింది. ఆయన జన్మించిన నవాన్‌షహర్‌కు ‘షహీద్ భగత్‌సింగ్ నగర్’గా నామకరణంచేశాం.అమరవీరుల జాబితాలోనూ చేరుస్తాం’అని చెప్పారు.