కరీంనగర్: అడంగల్, పహణీల పరిశీలన కోసం సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న దరాఖాస్తును చించివేసిన అధికారులపై చర్య తీసుకోవాలని కె. మహేందర్ అనే వ్యక్తి తహసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధ్యులైన అధికారులపై చర్యతీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
(కమలాపూర్)