'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్'.. 2002లో వచ్చిన ఈ మూవీ జాతీయ అవార్డులు గెలుచుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్ జాబితాలో నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించాడు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించాడు.
భగత్ సింగ్‌పై ఏకంగా ఐదు సినిమాలు
తాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి నిర్మాత రమేశ్ తరణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మా సినిమా సరిగా ఆడలేదు. ఎందుకంటే అప్పుడు భగత్ సింగ్ మీదే ఐదు సినిమాలు తెరకెక్కాయి. అందులో ఒకటి మా సినిమా కంటే వారం ముందు రిలీజైంది. సరిగ్గా అప్పుడే '23 మార్చి 1931: షాహీద్' సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలతో మాకు పోటీ ఏర్పడింది. భగత్ సింగ్‌పై తెరకెక్కిన మరో చిత్రం ఎందుకనో ఆగిపోయింది. రామానంద్ సాగర్ తెరకెక్కించిన మరో మూవీ ఏడాది తర్వాత నేరుగా దూరదర్శన్‌లో విడుదల చేశారు.
రూ.27 కోట్లు ఖర్చు పెట్టాం
భగత్ సింగ్ సినిమా రిజల్ట్‌తో మా కంపెనీ మొత్తం వణికిపోయింది. ఎందుకంటే రూ.27 కోట్లు పెడితే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. రూ.22 కోట్లు నష్టపోయాం. సినిమాకు మంచి గౌరవం దక్కినా నష్టం మాత్రం తీవ్ర స్థాయిలో వాటిల్లింది. రిస్క్ చేసింది మేము కాబట్టి ఆ నష్టాన్ని మేమే భరించాం. ఈ మూవీకోసం పని చేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాం' అని పేర్కొన్నాడు. కాగా ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీలో రెండు జాతీయ పురస్కారాలు అందుకుంది.
చదవండి: భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment