Ramesh Taurani
-
సినిమాకు అవార్డులు.. కానీ ఏం లాభం? రూ.22 కోట్ల నష్టం!
'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్'.. 2002లో వచ్చిన ఈ మూవీ జాతీయ అవార్డులు గెలుచుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్ జాబితాలో నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించాడు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించాడు.భగత్ సింగ్‌పై ఏకంగా ఐదు సినిమాలుతాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి నిర్మాత రమేశ్ తరణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మా సినిమా సరిగా ఆడలేదు. ఎందుకంటే అప్పుడు భగత్ సింగ్ మీదే ఐదు సినిమాలు తెరకెక్కాయి. అందులో ఒకటి మా సినిమా కంటే వారం ముందు రిలీజైంది. సరిగ్గా అప్పుడే '23 మార్చి 1931: షాహీద్' సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలతో మాకు పోటీ ఏర్పడింది. భగత్ సింగ్‌పై తెరకెక్కిన మరో చిత్రం ఎందుకనో ఆగిపోయింది. రామానంద్ సాగర్ తెరకెక్కించిన మరో మూవీ ఏడాది తర్వాత నేరుగా దూరదర్శన్‌లో విడుదల చేశారు.రూ.27 కోట్లు ఖర్చు పెట్టాంభగత్ సింగ్ సినిమా రిజల్ట్‌తో మా కంపెనీ మొత్తం వణికిపోయింది. ఎందుకంటే రూ.27 కోట్లు పెడితే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. రూ.22 కోట్లు నష్టపోయాం. సినిమాకు మంచి గౌరవం దక్కినా నష్టం మాత్రం తీవ్ర స్థాయిలో వాటిల్లింది. రిస్క్ చేసింది మేము కాబట్టి ఆ నష్టాన్ని మేమే భరించాం. ఈ మూవీకోసం పని చేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాం' అని పేర్కొన్నాడు. కాగా ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీలో రెండు జాతీయ పురస్కారాలు అందుకుంది.చదవండి: భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్ -
నిర్మాత రమేష్ తరుణి కూతురు పెళ్లిలో సినీ తారల సందడి (ఫోటోలు)
-
గుల్షన్ కుమార్ హత్య కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య హిందీ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 1997 గుల్షన్ కుమార్ హత్య కేసులో నిర్మాత రమేష్ తౌరానిని నిర్దోషిగా ప్రకటించడాన్ని బొంబాయి హైకోర్టు ఏకీభవించింది. అలాగే అబ్దుల్ రషీద్ మర్చంట్ శిక్షను కోర్టు ధృవీకరించింది. జస్టిస్ ఎస్ ఎస్ జాదవ్, ఎన్ ఆర్ బోర్కర్ డివిజన్ బెంచ్ కూడా రౌఫ్ సోదరుడు, ఈ కేసులో మరొక నిందితుడు అబ్దుల్ రషీద్ మర్చంట్‌ను దోషులగా తేల్చింది. కుమార్ పై కాల్పులు జరిపిన వ్యక్తులలో రషీద్ ఒకరు అని పేర్కొంటూ అతనికి జీవిత ఖైదు విధించారు. గుల్షన్ కుమార్ హత్య కేసులో అనేక మందిని విచారించిన తర్వాత రావుఫ్ మర్చంట్, చంచ్యా పిన్నమ్, రాకేశ్ కావోకర్లను ప్రధాన నిందితులుగా కోర్టు నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును జూలై 1న బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. ‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే గుల్షన్ కుమార్‌ను 1997 ఆగస్టు 12న సబర్బన్ అంధేరిలోని ఓ ఆలయం వెలుపల దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. కాగా, ఈ కేసులోని నిందితులు నదీమ్ సైఫీ, గ్యాంగ్ స్టర్ అబూ సలేం పరారీ ఉన్నారు. ఇక కుమార్‌ను హత్య చేయడానికి నదీమ్ సైఫీ, తౌరాని అబూ సలేంకు డబ్బు చెల్లించినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. అబ్దుల్ వ్యాపారి సెషన్స్ కోర్టు ముందు లేదా డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు వెంటనే లొంగిపోవాలనీ.. అతను తన పాస్ పోర్ట్‌ను పోలీసులకు అప్పగించాలని తెలిపింది. ఒకవేళ అతను లొంగిపోకపోతే సెషన్స్ కోర్టు బెయిల్ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ, చేసి అతన్ని అదుపులోకి తీసుకుంటుంది, ’’ అని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బాంబే హైకోర్టు పేర్కొంది. ఇక ఏప్రిల్ 2002, 29న, 19 మంది నిందితుల్లో 18 మందిని సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు రౌఫ్‌ను భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం), 120 (బి) (క్రిమినల్ కుట్ర), 392 (దోపిడీ), 397 (దోపిడీలో తీవ్ర గాయాలు కలిగించేది), సెక్షన్ 27 (స్వాధీనం) భారత ఆయుధ చట్టం) కింద శిక్ష విధించింది. అయితే ఈ శిక్షకు వ్యతిరేకంగా రౌఫ్ అప్పీల్ చేయగా.. రౌఫ్ శిక్షను, అతనిపై విధించిన జీవిత ఖైదును కూడా ధర్మాసనం ఏకీభవించింది. చదవండి: వైరల్: కిక్ ఇచ్చాడు.. కుప్పకూలి పడ్డాడు! -
‘సుశాంత్ మరణించే ముందు రోజు మాట్లాడినా’
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించే ఒక్క రోజు ముందు తనతో ఫోన్ కాల్లో మాట్లాడినట్లు నిర్మాత రమేష్ తౌరాని తెలిపారు. ఓ సినిమా గురించి చర్చించేందుకు మరో నిర్మాత నిఖిల్ అద్వానితో కలిసి జూన్ 13న మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సుశాంత్‌తో కన్ఫరెన్స్ కాల్లో సంభాషించినట్లు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రేస్, అజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ వంటి చిత్రాలకు రమేష్ తరౌరీ నిర్మాతగా వ్యవహరించారు. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. (సుశాంత్ అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం) ‘జూన్ 13న మధ్యాహ్నం నేను నిఖిల్ కలిసి సుశాంత్‌కు ఒక స్టోరీ గురించి వివరించాము. సుశాంత్‌తో పాటు అతని మేనేజర్ ఉదయ్ కూడా మాతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడాడు. అయితే వృతిపరంగా చేసిన కాల్ ద్వారా సుశాంత్ భావాలను అర్థం చేసుకోవలేకపోయాను’ అని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. తమ మధ్య సంభాషణ సుమారు 15 నిమిషాలు కొనసాగిందని తౌరాని పేర్కొన్నారు. అయితే కేవలం సినిమా చర్చల గురించే సంభాషించినట్లు ఆయన స్పష్టం చేశారు. సుశాంత్ మరణంపై వాస్తవాలు వెలువడే దాకా అందరూ ఓపికతో ఉండాలని, అంతేగాని ఇండస్ట్రీ గురించి తప్పుగా ప్రచారం చేయోద్దని విజ్ఞప్తి చేశారు. (ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?) View this post on Instagram I have been getting numerous calls from various journalists over the past few days and want to set the record straight about a few facts. 1. A journalist from @timesnow called me asking about a call on 13th June at about 2.15pm that I had with Sushant. I confirmed the same but did not want to comment on anything else. He recorded the call without informing me and therefore it is essential that I talk about what happened. After exchanging pleasantries, Nikhil Advani and I had narrated a story idea to Sushant. And yes we were on a conference call with him and his manager Uday. 2. This journalist also asked me how he sounded on the phone and I’m not aware as to how you can deduce anything about a persons feeling over a professional phone call. Our call was brief for approximately 15 minutes and he liked the idea and we were in preliminary talks. That’s about it. 3. Instead of encouraging wrongful theories about the industry and about his associations, I am requesting everyone to have faith in the system and let the authorities do the needful. And I request everyone to stop calling as we need to refrain from commenting any further on this unbelievable and tragic loss. I sincerely hope he’s resting in peace. Thank you. A post shared by Ramesh Taurani (@rameshtaurani) on Aug 10, 2020 at 9:29pm PDT