
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించే ఒక్క రోజు ముందు తనతో ఫోన్ కాల్‌లో మాట్లాడినట్లు నిర్మాత రమేష్ తౌరాని తెలిపారు. ఓ సినిమా గురించి చర్చించేందుకు మరో నిర్మాత నిఖిల్ అద్వానితో కలిసి జూన్ 13న మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సుశాంత్‌తో కన్ఫరెన్స్ కాల్‌లో సంభాషించినట్లు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రేస్, అజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ వంటి చిత్రాలకు రమేష్ తరౌరీ నిర్మాతగా వ్యవహరించారు. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. (సుశాంత్ అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం)
‘జూన్ 13న మధ్యాహ్నం నేను నిఖిల్ కలిసి సుశాంత్‌కు ఒక స్టోరీ గురించి వివరించాము. సుశాంత్‌తో పాటు అతని మేనేజర్ ఉదయ్ కూడా మాతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడాడు. అయితే వృతిపరంగా చేసిన కాల్ ద్వారా సుశాంత్ భావాలను అర్థం చేసుకోవలేకపోయాను’ అని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. తమ మధ్య సంభాషణ సుమారు 15 నిమిషాలు కొనసాగిందని తౌరాని పేర్కొన్నారు. అయితే కేవలం సినిమా చర్చల గురించే సంభాషించినట్లు ఆయన స్పష్టం చేశారు. సుశాంత్ మరణంపై వాస్తవాలు వెలువడే దాకా అందరూ ఓపికతో ఉండాలని, అంతేగాని ఇండస్ట్రీ గురించి తప్పుగా ప్రచారం చేయోద్దని విజ్ఞప్తి చేశారు. (ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?)
Comments
Please login to add a commentAdd a comment