హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ తన సొంత దేశమైన సెర్బియాకు వెళ్లినట్లు సమాచారం. 2013 బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన నటాషా.. బిగ్ బాస్ 8 ద్వారా మరింత పాపులర్ అయింది. దీంతో ఆమెకు భారీగా సినిమా ఛాన్స్‌లు దక్కాయి. అలా సుమారు 15 పైగా చిత్రాల్లో నటించింది. 2020లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ సమయం నుంచి సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. అయితే, గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేడు తెల్లవారుజామున భారత్ వదిలి తన కుమారుడితో సహా నటాషా వెళ్లిపోయింది.
హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు వస్తున్న సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన లగేజ్‌ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. వారిద్దరూ సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన పలు చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటాసా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా ఫోటోలను పంచుకుంది.
మొదటి ఫోటోలో.. నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్‌కేస్‌ను చూపింది. ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ పలు ఎమోజీలను పంచుకుంది. కన్నీళ్లతో ఉన్న ఎమోజీతో పాటు విమానం, ఇల్లు, లవ్ సింబల్‌ను ఆమె షేర్ చేసింది. మరో ఫోటోలో, ఆమె తన పెంపుడు కుక్క ఇమేజ్‌ను పంచుకుంది.
నటాషా, హార్దిక్‌ల మధ్య విడాకుల పుకార్లు కొన్ని వారాల క్రితం నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ రూమర్స్‌పై వీరిద్దరూ ఇంకా స్పందించలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొంతమంది వ్యక్తులు టి 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా విడిపోయారని చెప్పారు. హార్దిక్ లేదా భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన తర్వాత వారికి అభినందనలు తెలుపుతూ నటాషా ఎలాంటి పోస్ట్‌లను పంచుకోలేదు.
హార్దిక్ గెలుపు, ఓటమిల వెంట ఎప్పుడూ ఉండే నటాషా.. టి 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆమె కనిపించలేదు. రీసెంట్‌గా అంబానీ ఇంటి పెళ్లి వేడుకలకు కూడా హార్తిక్ ఒక్కడే హాజరయ్యాడు. తాజాగా తన లగేజ్‌తో ఆమె ఇండియా వదిలి వెళ్లిపోవడంతో వారిద్దరూ ఇక విడిపోయినట్లే అని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. 2020 ఉదయపూర్‌లో క్రైస్తవ, హిందూ ఆచారాలతో హార్తిక్, నటాషా వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment