లాహోర్: బ్రిటిష్ అధికారి హత్య కేసులో భారత స్వాతం త్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఓ ఆధారం బయటకొచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో భగత్‌సింగ్ పేరు లేదని వెల్లడైంది. 1928లో బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి సాండర్స్ హత్యకు గురికాగా, ఈ కేసులో భగత్‌సింగ్‌ను 1931లో లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్‌లో ఉరితీశారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్ కాపీని భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్‌ఖురేషీ కోర్టు ద్వారా సంపాదించారు.
సాండర్స్ హత్యపై లాహోర్‌లోని అనార్కలి పోలీస్ స్టేషన్‌లో 1928 డిసెంబర్ 17న గుర్తు తెలియని ఇద్దరు సాయుధులపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తేలింది. ఈ కేసును తిరిగి తెరవాలని కోరుతూ ఖురేషీ ఇప్పటికే లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.