
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సంగ్రామంలో భగత్‌సింగ్ చేసిన త్యాగం మహోన్నతమైనదని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఆయన నిరుపమాన పోరాటం, త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. విప్లవ వీరుడు భగత్‌సింగ్ దేశ ప్రజలకు సదా స్ఫూర్తి ప్రదాత అని గవర్నర్ అన్నారు. భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గవర్నర్ నివాళులు అర్పించారని రాజ్‌భవన్ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి.