‘నెహ్రూ, పటేల్‌లను ఉరితీశారు’
న్యూఢిల్లీ : ‘సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిట్ నెహ్రూ, భగత్ సింగ్, రాజ్‌గురు.. సబీ ఫాంసీ పర్ చఢె(అందర్నీ ఉరి తీశారు)’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా బహిర్గతమవడంతో వివాదమైంది. వివాదం రేగడంతో వివరణ ఇచ్చారు.
‘ఈ వార్త విని నవ్వుకున్నాను. స్వాతంత్య్రోద్యమంలో ప్రాణాలర్పించిన వారిని గౌరవిస్తూ మాట్లాడాను. గాంధీ, నెహ్రూ, నేతాజీలాంటి నేతలపేర్లను ప్రస్తావించాను. అక్కడితో ఆ వాక్యం పూర్తి చేసి, తర్వాత బ్రిటిష్ వారు ఉరితీసిన వీరుల పేర్లు చెప్పాను. కానీ ఈ రెంటినీ కలిపి చెప్పాననుకుంటున్నారు’ అని అన్నారు.