12 Year Old Student Died While Practicing Bhagat Singh Hanging Scene In Kolar - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ఘటన: ఉరి సీన్‌ రిహార్సల్‌లో విషాదం.. పిలగాడు మృతి

Published Mon, Oct 31 2022 5:18 PM | Last Updated on Mon, Oct 31 2022 7:24 PM

12 Year Old Student Died While Rehearsal Bhagat Singh Hanging Scene - Sakshi

సాంస్కృతిక  కార్యక్రమంలో భాగంగా ఒక నాటకాన్ని రిహర్సల్‌ చేస్తూ బాలుడు మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కోలార్‌లోని ఎస్‌ఎల్వీ స్కూల్‌లో 12 ఏళ్ల సంజయ్‌ గౌడ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి వచ్చేవారం స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భగత్‌ సింగ్‌ బయోగ్రఫీకి సంబంధించిన నాటకాన్ని వేయనున్నాడు.

అందులో భాగంగానే ఇంట్లో రిహార్సల్‌ చేస్తున్నాడు సంజయ్‌. ఈ మేరకు సంజయ్‌ భగత్‌ సింగ్‌ని ఆంగ్లేయులు ఉరితీసే ఘట్టాన్ని రిహర్స్‌ల్‌ చేస్తుండగా..  ప్రమాదవశాత్తు ఉరి పడిపోయింది. దీంతో సంజయ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. దురదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అతడి కుటుంబికులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా సంజయ్‌ మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు  మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగానే ఈ నాటకాన్ని ప్రతిరోజు  సంజయ్‌ రిహార్సల్‌ చేస్తున్నాడని కుటుంబికులు చెబుతున్నారు. అందులో భాగంగానే శనివారం రాత్రి కూడా రిహార్సల్‌ చేసి ఇలా విగత జీవిగా మారాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్‌ యాజమాన్యం సదరు సాంస్కృతిక కార్యక్రమాన్ని క్యాన్సిల్‌ చేయడమే గాక సంజయ్‌ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

(చదవండి: ఇంట్లోకి మొసలి ఎంట్రీ... బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఆ కుటుంబం....)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement