
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మూగజీవాల్ని కబేళాలకు తరలిస్తున్నారనే నెపంతో గోసంరక్షకులు ఇంటర్ విద్యార్థి అర్యన్ మిశ్రాను కాల్చి చంపారు. ఈ ఘటనలో విద్యార్ధి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్, సౌరబ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
మూగజీవాల్ని కళేబరాలకు తరలిస్తున్న స్మగ్లర్లు రెనాల్ట్ డస్టర్, టయోటా ఫార్చూనర్ కార్లలో తిరుగుతున్నారంటూ నిందితులకు సమాచారరం అందింది. దీంతో వెంటనే అనిల్ కౌశిక్, అతని స్నేహితులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సరిగ్గా అదే సమయంలో బాధితుడు ఆర్యన్ మిశ్రా,అతని స్నేహితులు శాంకీ,హర్షిత్‌లు ప్రయాణిస్తున్న డస్టర్ కారు పటేల్ చౌక్ వద్ద కనిపించింది. ఆ కారును 30కిలోమీటర్లు వెంబడించిన నిందితులు విద్యార్థిని కారు ఆపాలని బెదిరించారు. కారు ఆపకపోవడంతో నిందితులు కాల్పులు జరపగా బాధితుడు మృతి చెందాడు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment