గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 మంది విద్యార్థులు వేర్వేరు పరిస్థితిల్లో అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా యావత్ భారత్ తీవ్ర భయాదోళనలు వ్యక్తం చేసింది. నిజానికి మన దేశం నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకై అమెరికా వైపుకే మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు ఆ దేశం సురక్షితమేనే అనే సందేహాలు అందరిలోనూ మెదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా మరణాలపై దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయులకు సంబంధించిన ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్(ఎఫ్‌ఐఐడీఎస్) చాలా షాకింగ్ విషయాలు వెల్లడించింది.
ఈ ఘటనలు పునారావృత్తం కాకుండా యూఎస్ అధికారులు, విశ్వవిద్యాలయాలు సంస్థలు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేగాదు అమెరికాలో ఉండే భద్రతపై పరిజ్ఞానం లేకపోవడం వల్ల పర్యావరణ మరణాలు(మోనాక్సైడ్ విషప్రయోగం, అల్పోష్ణస్థితి), ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరిపించే మానసిక సమస్యలు వల్ల అనుమానాస్పద మరణాలు, హింసాత్మక నేరాలు జరిగినట్లు సర్వేలో వెల్లడించింది. ఆయా కారణాల వల్ల బాధిత విద్యార్థులు మరణాలకు కారణమని ఎఫ్‌ఐఐడీఎస్ సర్వేలో తేలింది.
యూఎస్‌లో విద్య అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల అని పేర్కొంది. ఈ భయానక ఘటనలు ఒక్కసారిగా భారత సంతతి విద్యార్థులు, వారి కుటంబాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయని వెల్లడించింది. ప్రస్తుతం యూఎస్‌లో దాదాపుగా రెండు లక్షలకు పైగా భారత సంతతి విద్యార్థులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం విదేశీ విద్యార్థులలలో సుమారు 25% మంది విద్యార్థుల నుంచి ఫీజులు, ఖర్చులు రూపంలో అమెరికా దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తోందని ఎఫ్‌ఐఐడీఎస్ చీఫ్ ఖండేరావ్ కాండే అన్నారు. ఈ మరణాలు పెరిగినట్లయితే ఆ ఆదాయానికి గండి పడే అకాశాలు ఉండటమే గాక యూఎస్ విశ్వవిద్యాలయాల భద్రతపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అయ్యే ప్రమాదం లేకపోలేదని ఎఫ్‌ఐఐడీఎస్ హెచ్చరించింది.
అంతేగాదు దీన్నే అదనుగా చూసుకుని కొందరూ అమెరికా సమాజంపై ద్వేషపూరిత నేరాలకు ఆజ్యం పోసి భారతీయ అమెరికా కమ్యూనిటీ చుట్టూ పుకార్లు వ్యాపించేలా చేస్తున్నట్లు ఎఫ్‌ఐఐడీఎస్ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌ఐఐడీఎస్ భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆందోళనలు, భద్రతకు సంబంధించిన సర్వేను ప్రారంభించింది. ఆసక్తిగల భారత సంతతి విద్యార్థులు ఈ ఎప్‌ఐఐడీఎస్ వెబ్‌సైట్‌లోని సర్వేలో పాల్గొని తామ ఎదుర్కొంటున్న భయాందోళనలు గురించి వెల్లడించాలని పిలుపునిచ్చింది.అంతేగాదు అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న భద్రత, శ్రేయస్సుకి సంబంధించిన ఆందోళనలు పరిష్కరించేలా యూఎస్ అధికారులు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరింది ఎఫ్‌ఐఐడీఎస్
►సురక్షిత విద్యను పెంపొందించడం: చాలామంది విదేశీ విద్యార్థులుకు తాము ఉన్న నిర్థిష్ట ప్రాంతాల్లో జరిగే నేరాలు, ప్రమాదాల పట్ల అవగాహన ఉండకపోడచ్చు . అందువల్ల విద్యాపరంగా సురక్షితంగా ఉండే ప్రాంతాల్లో ఉండేలా నిర్ణయాలు తీసుకునేలా సమాచారం అందించడం లేదా శక్తిమంతంగా ఎలా ఎదుర్కొవాలే అవగాహన కల్పించడం వంటివి చేయాలి.
►రెస్క్యూ విధానాలు మెరుగుపరచడం: అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రమాదంలో ఉన్న విద్యార్థుల భద్రత లేదా వారి క్షేమం నిర్థారించేలా తక్షణ ప్రతిస్పందన, సమర్థవంతమైన రెస్క్యూ విధానాలు చాలా ముఖ్యమైనవి. దీని వల్ల అంతర్జాతీయ విద్యార్థుల ప్రమాదాలను నియంత్రించగలుగుతాం. తద్వార విద్యారుల జీవితాలను కాపాడగలం కూడా.
►ర్యాగింగ్‌కి అడ్డుకట్టవేయడం: ర్యాగింగ్ వంటివి విద్యార్థుల శారీరీక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. అటువంటి వాటికి వ్యతిరేకంగా కఠిన నియమాలు, నిబంధనల అమలు చేయడం వల్ల ఎలాంటి నేర పూరిత సంఘటనలు ఎదురవ్వకుండా నియంత్రించగలుగుతాం. తద్వారా విదేశీ విద్యార్థులకు సమగ్రమైన క్యాంపస్ వాతావరణాన్ని అందించగలుగుతాం.
►ప్రమాదాలు భద్రతపై అవగాహన: విదేశీ విద్యార్థుకు కొత్త ప్రదేశాల్లోని క్యాంపస్ లోపల, వెలుపల ఎదురయ్యే ప్రమాదాలు, నష్టాలు గురించి అవగాహన కల్పించాలి. అక్కడ తమ తోటి విద్యార్థుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వారికి అవగాహన కల్పించాలి.
►మానసిక ధైర్యం అందిచటం: విదేశీ విద్యార్థులు తమ వాళ్లను దేశాన్ని అన్నింటిని వదిలేసి ఇంత దూరం చాలా ప్రయాస పడి వస్తారు. వారికి ఇక్కడ ముందుగా ఎదరయ్యేది ఒంటిరితనం. ఇది వారిలో కలగుకుండా ఉండేలా మానసిక స్థైర్యాన్ని అందించేలా తోడ్పాటు అందించటం వల్ల కూడా అనుమానస్పద మరణాలకు అడ్డుకట్ట వేయగలుగుతాం.
చివరిగా జాతి లేదా మతం ఆధారంగా భారత సంతతి విద్యార్థుల పట్ల ద్వేషపూరిత నేరాలు లేదా కుట్రలు జరుగుతున్నాయా అనేదానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం. సత్వరమే వారికి న్యాయం అందేలా చేయడం. ముఖ్యంగా మైనారిటి వర్గాలపై జరిగిన వివక్ష లేదా హింస గురించి పూర్తి స్థాయిలో విచారించడం ముఖ్యం. ఈ చర్యలన్ని తీసుకుంటే తమ సొంత గడ్డను వదిలి ఎందో ప్రయాస పడి ఇంత దూరం వచ్చిని విదేశీ విద్యార్థులుకు సురక్షితమైన వాతావరణాన్ని, ధైర్యంగా విశ్వవిద్యాలయంలో చేరి మంచి చదువును పొందగలమనే భరోసాను వారికి అందించగలుగుతామని ఎఫ్‌ఐఐడీఎస్ పేర్కొంది.
(చదవండి: కెనడాలో భారతీయ విద్యార్థి మృతి)
Comments
Please login to add a commentAdd a comment