పుట్టిన రోజే.. ఆఖరి రోజు.. అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి | hyderabad student dies in us | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజే.. ఆఖరి రోజు.. అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

Nov 21 2024 9:23 PM | Updated on Nov 21 2024 9:23 PM

hyderabad student dies in us

వాషింగ్టన్‌ డీసీ : పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఓ సరదా అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటనలో  విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముందే స్నేహితుడు ప్రాణ కోల్పోవడంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేని స్థితిలో గుండెలవిసేలా రోదించారు. దీంతో ఉప్పల్ కళ్యాణ్‌ పురిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికా పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఉప్పల్ కళ్యాణ్ పురికి చెందిన ఆర్యన్ రెడ్డి(23) అమెరికాలోని జోర్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలో ఎమ్మెస్ చదువుతున్నాడు. అయితే ఈ క్రమంలో నవంబర్‌ 13న అతని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే అదే రోజు తన వద్ద ఉన్న తుపాకీని క్లీన్‌ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తుపాకీ మిస్‌ఫైర్‌ అయి ఆర్యన్‌ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇవాళ రాత్రి ఆర్యన్‌ రెడ్డి మృతదేహాన్ని తరలించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement