
మోనో, మెట్రో, లోకల్ రైళ్లతో దశలవారీగా అభివృద్ధి
అత్యాధునిక వందేభారత్, బుల్లెట్ రైళ్లతో మరింత ముందుకు...
ముంబై, థానే రైల్వే స్టేషన్లలో ఘనంగా 172వ వార్షికోత్సవ సంబరాలు హాజరైన ఎంపీ నరేష్ మస్కే...
రైల్వే అధికారులు, ప్రయాణికుల అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక సన్మానం
153లో ముంబై నుంచి తొలి రైలు పరుగులు..బుధవారంతో 172ఏళ్లు పూర్తి
దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ రైల్వే విజయ వంతంగా 172 సంవత్సరాలు (Indian railways marks 172nd anniversary) పూర్తిచేసుకుని 173వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టరి్మనస్, థానేలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రయాణికుల అసోసియేషన్స్ సభ్యులు కేకులు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎంపీ నరేష్ మస్కే థానే స్టేషన్ మాస్టర్ కేశవ్‌తావడేతోపాటు రైల్వే అధికారులు, ప్రయాణికుల సంఘటన పదాధికారులను ప్రత్యేకంగా సన్మానించారు.
బ్రిటిష్ ఇంజనీర్ జార్జ్ క్లార్క్ ఆలోచనతో...
దేశ ఆరి్థక రాజధానిగా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగర అభివృద్ధికి అనేక కారణాలున్నప్పటికీ వాటిలో రైల్వేవ్యవస్థది ప్రధానపాత్ర. 1843లో మొదలై నేటి వరకూ రైల్వే దేశవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా మోనో, మెట్రో రైళ్ల ప్రవేశం రైల్వే విస్తరణలో కీలక ముందడుగు. వీటితో పాటు ఇటీవలే ప్రారంభించిన అత్యాధునిక వందేభారత్ రైలు, త్వరలో ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్‌రైలు రైల్వే కిరీటంలో కలికితురాళ్లు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ముంబై రవాణా వ్యవస్థలో కీలకమైన లోకల్ రైళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అది 1843వ సంవత్సరం. ఏదో పని నిమిత్తం సైన్–భాండూప్ రోడ్డుపై వెళ్తున్న బ్రిటీష్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్‌కు హఠాత్తుగా ముంబైలోని ద్వీపాలన్నింటిని కలుపుతూ ఒక రైల్వే లైన్‌ను వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మనసులోకి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఉన్నతాధికారులతో చర్చించి పనులు ప్రారంభించారు. కేవలం పదేళ్లలో పనులు పూర్తిచేశారు.
పట్టాలెక్కిన తొలి రైలు...
1853 ఏప్రిల్ 16వ తేదీ మొట్టమొదటి రైలు ముంబై నుంచి ఠాణేకి మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవంతంగా బయలుదేరింది. అప్పటినుంచి రైల్వే ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముంబై రవాణాలో బెస్ట్ బస్సులతో పాటు సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇవి ‘ముంబై లైఫ్‌లైన్’లుగా పేరుపొందాయి. ఇక్కడ ప్రజలు నిరంతరం ఉరుకులు పరుగులతో బిజీగా ఉంటారు. వారి జీవన విధానానికి తగ్గట్లుగా లోకల్ రైళ్ల వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి అయిదు నిమిషాల తేడాతో నడిచే ఈ లోకల్ రైళ్లలో ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ప్రతి రోజు సుమారు 65 లక్షలమందికిపైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
నాలుగింటికి అదనంగా మరో 2 ట్రాక్‌లు..
నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, ట్రాన్స్ హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్‌తోపాటు మోనో, మెట్రో రైల్వే మార్గాలలో రైళ్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో లోకల్ రైల్వేస్టేషన్లను ఆనుకని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఇతర నగరాలలో మామూలుగా ఒకటి వెళ్లేందుకు, మరోటి వచ్చేందుకు ఇలా అప్, డౌన్ మార్గాలు (రైల్వేట్రాకులు) ఉంటాయి.

కానీ లోకల్ రైలు సేవల కోసం మాత్రం ప్రత్యేకంగా నాలుగు ట్రాక్‌లు ఉన్నాయి. దీంతో స్లో, ఫాస్ట్ ఇలా రెండు రకాల లోకల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు పెద్ద అంతరాయం లేకుండా పోయింది. అదే విధంగా లోకల్ రైళ్ల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు అయిదు, ఆరో ట్రాక్‌లు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. సాధారణంగా లోకల్ రైళ్లన్నీ డైరెక్ట్ కరెంట్ (డిసి)పై నడుస్తాయి. తరువాతి కాలంలోనుంచి ఆల్టర్‌నేట్ కరెంట్ (ఎసి)కి మార్చారు.
ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
చారిత్రక ఘట్టాలు...
ప్రారంభంలో ముంబై ప్రజలు రైళ్లను ‘బకరా గాడీ’లని పిలిచేవారు. 1853లో మొదటి రైలు ప్రారంభం తర్వాత 1856లో మొట్టమొదటి రైల్వే టైంటేబుల్ రూపొందించారు. 1886 నుంచి ఫ్లాట్‌ఫారం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. 1874లో సైన్ రైల్వేస్టేషన్ నిర్మాణం, 1880లో ముంబై–కళ్యాణ్ రెండు వైపుల రైల్వే సేవలను ప్రారంభించారు. దేశంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన నాటి విక్టోరియా టరి్మనస్ ‘నేటి ఛత్రపతి శివాజీ టరి్మనస్)ను 1889లో, 1890లో డోంబివలి రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. సరీ్వసులను మరింత వేగవంతం చేసేందుకు 1929లో ముంబై–కళ్యాణ్‌ల మధ్య రైల్వేలైన్లను విద్యుదీకరించారు.

చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్‌లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన