హర్యానాలో పోలీసులకు సైతం రక్షణ కరువయ్యింది. దీనికి కర్నాల్‌లో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలిచింది. యమునానగర్‌లోని స్టేట్ క్రైమ్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ సంజీవ్‌పై బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సంజీవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన సంజీవ్ కుటుంబంతోపాటు స్థానికంగా విషాదాన్ని నింపింది.
కర్నాల్‌లో నేరపూరిత ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఓంగాడ్ గ్రామంలో ఒక దుకాణం వెలుపల దుండగులు కాల్పులు జరిపిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటన కర్నాల్‌లోని కుటేల్ గ్రామ సమీపంలో జరిగింది.
సంజీవ్ ఇటీవలే యమునానగర్‌లోని స్టేట్ క్రైమ్ బ్రాంచ్‌లో ఏఎస్‌ఐగా నియమితులయ్యారు. ఆయన తన ఇంటి బయట వాకింగ్ చేస్తుంగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ సంజీవ్ నుదిటిపై తగలగా, మరొకటి నడుములోనికి దూసుకెళ్లింది. సంజీవ్ సోదరుడు, తండ్రి ఇటీవలే మృతి చెందారు. సంజీవ్ ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment