అమెరికాలో తెలుగు విద్యార్థి రాజేష్‌ మృతి | NRI Erukonda Rajesh Died In USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి రాజేష్‌ మృతి

Published Fri, Aug 16 2024 6:38 PM | Last Updated on Fri, Aug 16 2024 7:12 PM

NRI Erukonda Rajesh Died In USA

సాక్షి, హన్మకొండ: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్‌.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి పేరెంట్స్‌.. కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.

వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో విషాదం నెలకొంది. ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల క్రితం  మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు అతని స్నేహితులు సమాచారం ఇచ్చారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

అయితే, రాజేష్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, రాజేష్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కన్నీరు పెట్టుకుంటూ కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, తొమ్మిది నెలల క్రితమే రాజేష్‌ తండ్రి మరణించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement