జాబ్‌ వచ్చిందన్న ఆనందం ఆవిరైంది.. గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి! | Btech Student Dies Of Heart Attack Kamareddy | Sakshi
Sakshi News home page

జాబ్‌ వచ్చిందన్న ఆనందం ఆవిరైంది.. గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి!

Published Sat, Jun 10 2023 11:47 AM | Last Updated on Sat, Jun 10 2023 2:39 PM

Btech Student Dies Of Heart Attack Kamareddy - Sakshi

సాక్షి,కామారెడ్డి: ఇటీవల గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా టీనేజర్లు, యువకులు సైతం హార్ట్ ఎటాక్తో మృతి చెందుతున్నారు. ఆ క్షణం వరకు మనముందే బాగున్నప్పటికీ మరుక్షణం గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా మరో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. 

ఈ విషాద ఘటన లింగంపేట మండలం సురాయిపల్లి జగదంబా తండాలో చోటు చేసుకుంది. ఎంతో కష్టపడి బీటెక్‌ చదువు పూర్తి చేసి.. ఇటీవల బెంగళూరులో ప్రశాంత్‌కు ఉద్యోగం సాధించింది. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న కలలు నిజం కాబోతన్నాయని ఎంతో ఆనంద పడ్డాడు. ఈ వార్త విన్న ప్రశాంత్‌ తల్లిదండ్రులు నిన్న ఇరుగుపొరుగువారికి స్వీట్లు కూడా పంచారు. జాబ్‌ వచ్చిందన్న ఆనందంతో రాత్రి పడుకున్న ప్రశాంత్‌ నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. అకస్మాత్తుగా కొడుకు మృతితో ఆ తల్లదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement