విద్యార్థులపై దేశద్రోహం కేసులు సిగ్గుచేటు
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
తెనాలిక్రైమ్: భగత్‌సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైతన్య యాత్రలు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమయ్యాయి. రివల్యూషనరీ యూత్ అసోసియేషన్(ఆర్‌వైఏ), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ట్రేడ్ యూనియన్(ఏఐసీసీటీయూ), ఏఐఎస్‌ఏ స్టూడెంట్స్ అసోసియేషన్‌లతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
మాజీ కౌన్సిలర్ మోపిదేవి ఫణిరాందేవ్ మాట్లాడుతూ విశ్యవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం తగ్గాలన్నారు. విద్యార్థులపై దేశద్రోహం కేసులు బనాయించటం సిగ్గుచేటన్నారు. సెక్షన్ 120 చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆర్.నాగలక్ష్మి మాట్లాడుతూ చైతన్యయాత్రలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకూ కొనసాగుతాయన్నారు.