'భారత్ మాతాకి జై అని ఎందుకనాలి..?'అంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇష్టం ఉన్నవాళ్లు అంటారు లేదంటే లేదు.. అని స్పష్టం చేశారు. దేశభక్తికి కొలబద్ద పెట్టడానికి బీజేపీ నేతలు ఎవరని ప్రశ్నించారు. కార్పోరేట్ శక్తులకు అంటకాగి.. గాంధీని చంపిన హంతకులను పొగిడే వారు దేశభక్తులా అంటూ ఎద్దేవా చేశారు.
భగత్ సింగ్ చివరి నినాధం 'ఇంక్విలాబ్ జిందాబాద్' అని తెలిపారు. ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలను ప్రధాని ఎందుకు ఖండింటం లేదని ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్ననల్ల ధనాన్ని తీసుకు వస్తాం అంటూ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాంబ్ చేశారు.