అచ్ఛేదిన్ కాదు.. ఇవి బురే దిన్
- పెద్దనోట్ల రద్దుతో దేశంలో తీవ్ర గందరగోళం
- సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో ఆ పార్టీ అగ్రనేత సురవరం
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ హయాంలో ప్రజలకు అచ్ఛేదిన్ బదులు బురే దిన్ వచ్చాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ పార్టీ జాతీయ సమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సంద ర్భంగా సురవరం మాట్లాడుతూ మోదీని, కేంద్ర ప్రభుత్వతీరును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల పై దేశ వ్యతిరేకశక్తులుగా ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలకు మంచిరోజులు తీసుకొస్తామని అధికా రంలోకి వచ్చిన మోదీ హయాంలో కనీవినీ ఎరగని రీతిలో నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. తదనంతర పరిణామాలను అంచనా వేయకుండా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల జీవనం అతలాకు తలమైందని విచారం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయంతో ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర గందరగోళంలోకి నెట్టివేశారని విమర్శించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైన కేంద్రం జాతీయ బ్యాంకుల పైకి నెపం నెట్టి చేతులుదులుపుకునే ప్ర యత్నం చేస్తోందని, మరోవైపు ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. కొన్ని సందర్భాల్లో న్యాయవ్యవస్థ సైతం మోదీపై వచ్చిన అవినీతి ఆరోపణలను పట్టించుకోనట్లుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న ప్పుడు ఆయనకు రూ.70 కోట్లు చెల్లించి నట్లుగా సహారా పేపర్స్, బిర్లా అకౌంట్లలో వెల్లడి అయినా దానిని ఖండించలేదని అన్నారు. దీనిపై స్పందించేందుకు కోర్టులు కూడా నిరాకరించాయని పేర్కొన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం...
వామపక్షాలు, ప్రజాస్వామ్యశక్తులు కలసి ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని సురవరం అన్నారు. వామపక్షాలు, ప్రజాస్వామ్యశక్తులు మరింత మెరుగైన అవగాహనను సాధించి మోదీ ప్రభుత్వ తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని, మతతత్వ బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కీలకమైన యూపీలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించాలని అన్నారు. గోరక్ష దళాలు, ఇతర స్వయం ప్రకటిత సంస్థల ద్వారా యూపీ, తదితర రాష్ట్రాల్లో దళితులు, మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తు న్నారని, వీటి వెనుక ఎవరున్నారనేది బహి రంగ రహస్యమేనని పేర్కొన్నారు.
వీటికి వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని ఆర్‌పీఐతో కలసి ఢిల్లీలో పెద్ద ప్రదర్శనను నిర్వహించాయని, ఈ నిరసనలను దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. క్యూబా కమ్యూనిస్టు యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో, ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి, తమిళ నాడు సీఎం జయలలిత, ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు, పార్టీ సీనియర్ నాయ కులు సత్యపాల్‌రెడ్డి, సంగప్ప, వేమూరి నాగే శ్వరరావు, జీవీ కృష్ణారావుల మృతికి సీపీఐ జాతీయ సమితి నివాళులు అర్పించింది.