కుంభకోణాలు, స్కాంల ప్రధాని మోదీ
సురవరం సుధాకర్‌రెడ్డి
సాక్షి, గద్వాల: కుంభ కోణాల, స్కాంల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడులో మీడియా తో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నియంత మోదీ అన్నారు. ఆయన్ను ప్రశ్నిస్తే తమ పదవులు పోతా యని కేంద్రమంత్రులు నోరు మెదపడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజావ్యతిరేకమైందని, కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఉందని సురవరం ఆక్షేపించారు.
అలాగే, మోదీ పెద్దనోట్ల రద్దు వల్ల పేద ప్రజలకు ఒరిగిం దేమీ లేదని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆయన విమర్శించడం కూడా సరికాదన్నారు. చౌకబారు జోకులతో ప్రజలను పక్కదారిపట్టించేలా మోదీ వ్యవహరించారన్నారు. ప్రజాసమస్యలను వినడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే బీజేపీకి మనుగడ ఉంటుం దన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు సరికావన్నారు. వామపక్ష పార్టీలు విభిన్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు.