అవానాకు పోలీస్ పంచ్! | India pacer Parvinder Awana punched by Noida policeman over parking row | Sakshi
Sakshi News home page

అవానాకు పోలీస్ పంచ్!

Published Sat, Mar 8 2014 1:41 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

అవానాకు పోలీస్ పంచ్! - Sakshi

అవానాకు పోలీస్ పంచ్!

 క్రికెటర్‌ను కొట్టిన కానిస్టేబుల్
 న్యూఢిల్లీ: సాధారణంగా క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎక్కడో ఒక చోట నిబంధనలు అతిక్రమించడం...ఈ క్రమంలో అవసరమైతే సదరు అధికారులతో గొడవకు దిగడమో, చేయి చేసుకోవడమో చూస్తుంటాం. కానీ గురువారం ఇక్కడి నోయిడాలో దీనికి పూర్తిగా రివర్స్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్‌కు సంబంధించి జరిగిన ఒక గొడవలో క్రికెటర్ పర్వీందర్ అవానాపై స్థానిక పోలీస్ ఒకరు తన బలాన్ని ప్రదర్శించాడు.

 తనకో ఫోన్ రావడంతో మాట్లాడేందుకు అవానా కారును రోడ్డు పక్కన ఆపాడు. దీనిపై హెడ్ కానిస్టేబుల్ భగత్ సింగ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చలానా విధించాల్సి ఉంటుందంటూ హెచ్చరించాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత తాను వెళ్లిపోతానని అవానా చెప్పబోయాడు. దీనిపై మాటా మాటా పెరిగింది. పట్టలేని కోపంతో ఆ పోలీస్, అవానా మెడపై రెండు బలమైన పంచ్‌లు కొట్టాడు. ఆ వెంటనే ఈ ఢిల్లీ క్రికెటర్ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడటంతో భగత్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement