Parvinder Awana
-
పర్వీందర్ అవానా రిటైర్మెంట్
టీమిండియా తరఫున రెండు టి20 మ్యాచ్‌లు ఆడిన పర్వీందర్ అవానా కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. భారత జాతీయ జట్టు తరఫున ఇంగ్లండ్‌పై 2012లో అరంగేట్రం చేసిన అతను... ఆడిన రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ వికెట్ తీయలేకపోయాడు. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల అవానా రంజీ జట్టుకు తొమ్మిదేళ్లు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 2012–14 సీజన్ల మధ్య కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడాడు. కెరీర్లో 62 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్డాడు. ఏడాదిన్నరగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. -
ఢిల్లీ పేస్ బౌలర్ పై దాడి
గ్రేటర్ నోయిడా:ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానాపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాలో పర్వీందర్ అవానా కారులో ప్రయాణిస్తుండగా అతనిపై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హరిద్వార్ నుంచి పర్వీందర్ కారులో తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. గ్రేటర్ నోయిడాలోని కాస్నా ఏరియాలో పర్వీందర్ కారును వెనుకనుంచి వస్తున్న మరొక వాహనం ఢీకొట్టింది. ఆ ఘటనలో పర్వీందర్ కారు మహీంద్ర ఎక్స్‌యూవీ ధ్వంసమైంది. దాంతో ఇరు వర్గాల మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్తా దాడికి దారితీసినట్లు కాస్నా స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో) జితేందర్ కుమార్ తెలిపారు. పర్వీందర్ పై వారు మూకుమ్ముడిగా దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఆ ఐదుగురిలో ఒక మహిళా కూడా ఉన్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
వికెట్లు తీస్తా.. విమాన టికెట్ పట్టేస్తా!
కోల్ కతా: వేగవంతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్న పర్వందీర్ సింగ్ అవానా... త్వరలో టీం ఇండియా బయల్దేరనున్న ఇంగ్లండ్ టూర్ పై ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు జట్టుకు అవానా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికి గాను అతను కోచ్ జో డావ్స్ వద్ద సరదాగా ఓ జోక్ ను కూడా పేల్చాడు. ఇంకా మిగిలి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ ల్లో నన్ను ఆడనివ్వండి. ప్రతి మ్యాచ్ లో ఐదేసి వికెట్లు తీస్తా. ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతా ' అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు. స్పీడ్‌స్టార్ పోటీల ద్వారా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పర్వీందర్ అవానా తొలి సారి వెలుగులోకి వచ్చాడు. సీనియర్ స్థాయిలో కూడా అతను అదే వేగాన్ని నమ్ముకున్నాడు. ఒక వేగాన్ని మాత్రమే నమ్ముకుంటే సరిపోదని భావించిన ఈ పేసర్.. తన బౌలింగ్ లోపాల్నిపంజాబ్ కోచ్, అతని సహచరుడు మిచెల్ జాన్సన్ ల వద్ద సరిదిద్దుకునే పనిలో పడ్డాడు. తనకు ఖాలీగా ఉన్న సమయంలో వారితోనే ఎక్కువ సమయం గడుపుతూ బౌలింగ్ కు పదునుపెట్టేందుకు యత్నిస్తున్నానని అవానా తెలిపాడు. -
అవానాకు పోలీస్ పంచ్!
క్రికెటర్‌ను కొట్టిన కానిస్టేబుల్ న్యూఢిల్లీ: సాధారణంగా క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎక్కడో ఒక చోట నిబంధనలు అతిక్రమించడం...ఈ క్రమంలో అవసరమైతే సదరు అధికారులతో గొడవకు దిగడమో, చేయి చేసుకోవడమో చూస్తుంటాం. కానీ గురువారం ఇక్కడి నోయిడాలో దీనికి పూర్తిగా రివర్స్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్‌కు సంబంధించి జరిగిన ఒక గొడవలో క్రికెటర్ పర్వీందర్ అవానాపై స్థానిక పోలీస్ ఒకరు తన బలాన్ని ప్రదర్శించాడు. తనకో ఫోన్ రావడంతో మాట్లాడేందుకు అవానా కారును రోడ్డు పక్కన ఆపాడు. దీనిపై హెడ్ కానిస్టేబుల్ భగత్ సింగ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చలానా విధించాల్సి ఉంటుందంటూ హెచ్చరించాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత తాను వెళ్లిపోతానని అవానా చెప్పబోయాడు. దీనిపై మాటా మాటా పెరిగింది. పట్టలేని కోపంతో ఆ పోలీస్, అవానా మెడపై రెండు బలమైన పంచ్‌లు కొట్టాడు. ఆ వెంటనే ఈ ఢిల్లీ క్రికెటర్ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడటంతో భగత్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది!