వికెట్లు తీస్తా.. విమాన టికెట్ పట్టేస్తా! | I am very much eyeing the England tour, says Parvinder Awana | Sakshi
Sakshi News home page

వికెట్లు తీస్తా.. విమాన టికెట్ పట్టేస్తా!

Published Tue, May 27 2014 4:40 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

వికెట్లు తీస్తా.. విమాన టికెట్ పట్టేస్తా!

వికెట్లు తీస్తా.. విమాన టికెట్ పట్టేస్తా!

కోల్ కతా: వేగవంతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్న పర్వందీర్ సింగ్ అవానా... త్వరలో టీం ఇండియా బయల్దేరనున్న ఇంగ్లండ్ టూర్ పై ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు జట్టుకు అవానా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికి గాను అతను కోచ్ జో డావ్స్  వద్ద సరదాగా ఓ జోక్ ను కూడా పేల్చాడు. ఇంకా మిగిలి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ ల్లో నన్ను ఆడనివ్వండి. ప్రతి మ్యాచ్ లో ఐదేసి వికెట్లు తీస్తా.  ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతా ' అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు.

 

స్పీడ్‌స్టార్ పోటీల ద్వారా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పర్వీందర్ అవానా తొలి సారి వెలుగులోకి వచ్చాడు. సీనియర్ స్థాయిలో కూడా అతను అదే వేగాన్ని నమ్ముకున్నాడు. ఒక వేగాన్ని మాత్రమే నమ్ముకుంటే సరిపోదని భావించిన ఈ పేసర్.. తన బౌలింగ్ లోపాల్నిపంజాబ్ కోచ్, అతని సహచరుడు మిచెల్ జాన్సన్ ల వద్ద సరిదిద్దుకునే పనిలో పడ్డాడు. తనకు ఖాలీగా ఉన్న సమయంలో వారితోనే ఎక్కువ సమయం గడుపుతూ బౌలింగ్ కు పదునుపెట్టేందుకు యత్నిస్తున్నానని అవానా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement