ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం | punjab kings beats delhi dare devils | Sakshi
Sakshi News home page

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

Published Sun, May 25 2014 7:33 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

మొహాలీ: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తన చివరి లీగ్ మ్యాచ్ ను విజయం ముగించింది. ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విసిరిన 116 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఆటగాళ్లు కేవలం 13.5 ఓవర్లలో ఛేదించారు. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(9) పరుగులు చేసి విఫలమైనప్పటికీ, వాహ్రా (47) పరుగుల చేసి జట్టు గెలుపుకు చక్కటి పునాది వేశాడు.అనంతరం మ్యాక్స్ వెల్ (0)కే పెవిలియన్ చేరినా, మిల్లర్ (47) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.

 

దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోని అగర్వాల్ వికెట్టును కోల్పోయింది. కాగా మరో ఓపెనర్, కెప్టెన్ పీటర్ సన్(58) బాధ్యాతయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. అనంతరం దినేష్ కార్తీక్(13), నిషామ్ (12) పరుగుల మినహా ఎవరూ రెండెంకల స్కోరును దాటకపోవడంతో ఢి్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో అవానా, మన్వీర్ సింగ్, జాన్సన్, పటేల్ కు తలో రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement