Delhi dare devils
-
పుణేలో కాదు.. ముంబైలో ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్
ముంబై: కోవిడ్ కేసులతో తల్లడిల్లుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు పంజాబ్ కింగ్స్‌తో పుణేలో ఆడాల్సిన మ్యాచ్‌ను ముంబైకి తరలించారు. అయితే ముందుగా బుధవారం ఉదయం ఢిల్లీ ఆటగాళ్లందరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్టులన్నీ నెగెటివ్‌గా వస్తే ఏ సమస్యా ఉండదు. ఏ ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా... మ్యాచ్‌ను వాయిదా వేసి ఆటగాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచేస్తారు. తద్వారా ఢిల్లీ ఫ్రాంచైజీకి సోకిన వైరస్‌ను అక్కడితోనే అంతం చేస్తారు. క్యాపిటల్స్ బృందంలోని ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష, డాక్టర్ అభిజిత్ సాల్వి, మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్‌లకు వైరస్ సోకగా... తాజాగా సోషల్ మీడియా కంటెంట్ సభ్యుడు ఆకాశ్ మనే కోవిడ్ బారిన పడ్డారు. దీంతో కరోనా పేషెంట్ల సంఖ్య ఐదుగురికి చేరడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. మ్యాచ్ కోసం పుణేకు వెళ్లకుండా జట్టు ప్రస్తుతం బస చేసిన చోటే (ముంబై) ఉంచి వైరస్ సంక్రమణ నిరోధక చర్యలు చేపట్టింది. మంగళవారం చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలన్నీ నెగెటివ్‌గా వచ్చినా.. బుధవారం నాటి టెస్టులే కీలకమని బీసీసీఐ వైద్య బృందం భావిస్తోంది. -
నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త
ముంబై: సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం సజావుగా సాగదు. క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, ఇప్పుడు మనం చూపబోయే ఈ టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. ఈ శతాబ్దపు ఆరంభంలో(2003) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆవిష్కార్ సాల్వి.. తాజాగా ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తూ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు. ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేయాలంటే అసాధారణమైన తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి. అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో తాను ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశానని సాల్వి చెప్పుకొచ్చాడు. కాగా, సాల్వి.. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు పడగొట్టాడు. అయితే కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి.. తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో కూడా పాల్గొన్నారు. 39 ఏళ్ల సాల్వి పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్‌గా కూడా మారాడు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా పని చేశారు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సాల్వి.. 50 ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్లలో కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. అయితే వారందరికంటే అత్యున్నత విద్యను అభ్యసించిన సాల్వి 'ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..? -
ఎందుకు ఆగిపోయావు అశ్విన్..?
ఢిల్లీ: 'మన్కడింగ్' అని వినగానే మనకు గుర్తొచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకు ముందు మన్కడింగ్ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. క్రికెట్ లవర్స్‌కు దీన్ని పరిచయం చేసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 197 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్‌లోని మూడో ఓవర్ వేసేందుకు వచ్చిన అశ్విన్ తన నాలుగో బంతి వేస్తుండగా ఆరోన్ ఫించ్ క్రీజు దాటి బయటకు వెళ్లాడు. అశ్విన్ బంతి వేయకుండా అలాగే ఆగిపోయి ఫించ్‌వైపు కోపంగా చూశాడు. అక్కడ మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా అశ్విన్ ఆ పని చేయలేదు. దీంతో ఒక్కసారిగా అందరికీ గతేడాది బట్లర్‌ను మన్కడింగ్ చేసింది గుర్తొచ్చింది. ఐతే ఈ సారి మన్కడింగ్ ఎందుకు చేయలేదని క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. అప్పుడు చేశాడని... ఇప్పుడు చేయలేదని! గత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తరుపున ఆడిన అశ్విన్... రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేశాడు. అప్పట్లో ఈ అంశం వివాదంగా మారింది. ఐతే మన్కడింగ్ అనేది క్రికెట్ రూల్స్‌లో భాగమైనప్పటికీ ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్ ఫాన్స్‌తో పాటు పలువురు ఆటగాలు అశ్విన్ తీరుపై మండిపడ్డారు. రూల్ ఉన్నప్పుడు మన్కడింగ్ చేస్తే తప్పేంటని అశ్విన్ సమర్థించుకున్నాడు. ఏదైమైనా మన్కడింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అది కూడా అశ్విన్ వల్లనే సాధ్యం అయ్యింది. గతేడాది బట్లర్‌ను మన్కడింగ్ చేశాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేయగా ఈసారి అవకాశం ఉన్నా ఫించ్‌ను ఎందుకు చేయలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బట్లర్‌కు మద్దతుగా కొన్ని ఫన్నీ ఫోటోలు విడుదల చేయగా ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మాన్కడింగ్ చరిత్ర ఏంటంటే... అసలు మన్కడింగ్ అనేది కొత్తగా వచ్చింది కాదు. 1947-48లో భారత్, ఆస్ర్టేలియా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మొదటిసారి మన్కడింగ్ జరిగింది. భారత స్పిన్నర్ 'విన్నూ మన్కడ్' బౌలింగ్ చేస్తుండగా నాన్స్ర్టైక్లో ఉన్న బిల్ బ్రౌన్ క్రీజు దాటి బయటికి వెళ్లాడు. అప్పుడు విన్నూ మన్కడ్ వికెట్లు పడగొట్టి అతడిని అవుట్ చేశాడు. అలా మాన్కడ్ అనే పదం వెలుగులోని వచ్చింది. అప్పట్లో ఆసిస్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా మన్కడ్ క్రికెట్ రూల్స్‌లో ఉన్నప్పటికీ ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని ఆటగాలు భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అశ్విన్ వదిలేశాడు.. కెమెరాలన్నీ పాంటింగ్‌వైపే!) Jos butter be like😂 #Ashwin pic.twitter.com/TgOxTGLazw — Mizan (@Mizan98726466) October 5, 2020 #RCBvDC Ashwin didn't Mankad Finch Meanwhile Buttler: pic.twitter.com/vfRnIQ8Trb — Shivani (@meme_ki_diwani) October 5, 2020 Jos Buttler To Ashwin pic.twitter.com/woRH6Q0TW3 — 🇮🇳 A M A R 🕊️ (@imShinde777) October 5, 2020 -
టెక్నిక్ మార్చిన పృథ్వీ షా
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. కేవలం 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సికర్లు బాదాడు. పృథ్వీ షా ఇచ్చిన మెరుపు ఆరంభంతో ఢిల్లీ జట్టుకు భారీ స్కోరు చేయగలిగే అవకాశం లభించింది. ఐతే గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే అతడి బ్యాటింగ్ వైఖరిలో కొంత మార్పు కనపించింది. ఈ విషయమై ఇంగ్లాడ్ క్రికెటర్ కెవిన్ పీటర్స్సెన్ కమెంట్రీ చేస్తూ ఢిల్లీ టీమ్ కోచ్ రికీ పాంటింగ్‌ను పృథ్వీ షా బ్యాటింగ్ గురించి అడిగాడు. అతడు మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మెన్ అని.. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని పాంటింగ్ మెచ్చుకున్నాడు. గత రెండేళ్లుగా పృథ్వీ తన బ్యాటింగ్ స్కిల్స్‌ను అనలైస్ చేసుకున్నాడని, ఎక్కువగా ఆఫ్ సైడ్ షాట్లు ఆడుతున్నాడని పాంటింగ్ అన్నాడు. 'ఒక కోచ్‌గా నేను అతడితో కొన్నిసార్లు మాట్లాడాను. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాడు. అలాంటి ప్లేయర్‌కు ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఫార్మాట్లో వారి ఆటను ఆడనివ్వాలి. పృథ్వీ మంచి టచ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మా జట్టులో ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు' పాంటింగ్ పేర్కొన్నారు. -
బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాలి!
షార్జా: ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అనుసరించిన బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత్ జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డారు. 229 భారీ లక్ష్య ఛేదనలో ఇయాన్ మోర్గాన్ వంటి ఆటగాడిని 6వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడమేంటని కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తిక్, కోల్‌కతా జట్టు మానేజ్మెంట్ను ఆయన ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా చూసుకుంటే మోర్గాన్ 170 స్ర్టైక్‌రేట్‌తో ఆడుతున్నాడని, ఐపీఎల్లో గత రెండు మ్యాచుల్లో కూడా అద్భుతంగా ఆడాడని ఆయన అన్నాడు. మోర్గాన్ ఈ మ్యాచ్‌లో 44 (18) పరుగులు చేయగా అందులో ఐదు సిక్సులు బాదాడు. షార్జాలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతులో 18 పరుగుల తేడాతో కోల్‌కతా ఓడిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో మోర్గాన్‌ను ముందు పంపించి ఉంటే ఆ జట్టు గెలిచి ఉండేదని ఆకాశ్ చోప్రా అన్నారు. కుల్దీప్ స్థానంలో వచ్చిన రాహుల్ త్రిపాఠిని 8వ స్థానంలో పంపడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. సునిల్ నరైన్ ఓపనర్‌గా రాణించనప్పుడు రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని సూచించాడు. రాహుల్ మంచి ఓపనింగ్ బ్యాట్స్‌మెన్ అని... శుభమన్ గిల్‌తో పాటు ఓపనింగ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆకాశ్ చోప్రా గతంలో కోలకతా జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. (ఇదీ చదవండి: చెన్నై చిందేసింది) -
ప్లే ఆఫ్ నుంచి ముంబై నిష్క్రమణ
-
చెన్నైపై ఢిల్లీ ఘనవిజయం
-
ఐపీఎల్లో మారని డేర్‌డేవిల్స్ పరిస్థితి
-
ఢిల్లీపై 5 వికెట్లతో బెంగళూరు విజయం
-
కోహ్లి, డివిలియర్స్ గెలిపించారు
న్యూఢిల్లీ: బెంగళూరు గెలిచింది కానీ... ప్లే ఆఫ్ ఆశలకు ఇంకా దూరంగానే ఉంది. 11 మ్యాచ్‌లాడిన కోహ్లి సేనకిది నాలుగో విజయం మాత్రమే! శనివారం జరిగిన ఐపీఎల్ లీగ్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (34 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అభిషేక్ శర్మ (19 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయారు. చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన బెంగళూరు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (37 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కోహ్లి (40 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. నేపాల్ ఆటగాడు సందీప్ లమిచానే, పంజాబ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ అరంగేట్రం చేశారు. పంత్ పవర్ మళ్లీ... ఢిల్లీ 16 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. పృథ్వీ షా (2), జాసన్ రాయ్ (12) ఇద్దర్నీ చహలే బౌల్డ్ చేశాడు. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 32; 3 ఫోర్లు), రిషభ్ పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 8వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులు దాటగా... పంత్ సిక్సర్ల ధాటికి 12వ ఓవర్లోనే స్కోరు వందకు చేరింది. 27 బంతుల్లోనే ఫిఫ్టీ (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసుకున్న రిషభ్... మొయిన్ అలీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. దీంతో 93 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే అయ్యర్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. చివర్లో శంకర్ (21 నాటౌట్)తో కలిసిన అభిషేక్ శర్మ విరుచుకుపడటంతో భారీస్కోరు సాధ్యమైంది. కోహ్లి, ఏబీ... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఢిల్లీలాగే బెంగళూరు ఓపెనర్లు మొయిన్ అలీ (1), పార్థివ్ (6) విఫలమయ్యారు. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా... కెప్టెన్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగుపెట్టించారు. ఈ క్రమంలో ఆరో ఓవర్లోనే జట్టు 50 పరుగులు, 11వ ఓవర్లోనే 100 పరుగులు చేసింది. కోహ్లి 26 బంతుల్లో అర్ధసెంచరీ (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. తర్వాత భారీ షాట్లతో డివిలియర్స్ (28 బంతుల్లో; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఈ జోడీ చెలరేగుతున్న దశలో కోహ్లిని మిశ్రా ఔట్ చేయడంతో 118 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత మన్దీప్ (13), సర్ఫరాజ్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా మిగతా లాంఛనాన్ని డివిలియర్స్ పూర్తి చేశాడు. -
రిషభ్ సూపర్బ్.. గంభీర్‌పై సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రికార్డుల మోత మోగించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, ప్రముఖులు అతడిని పొగడ్తల్లో ముంచెత్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రిషభ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదాడు. అతడి ఇన్నింగ్స్ సూపర్బ్, అన్బిలీవబుల్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇది కూడా ఒకటని పేర్కొంటున్నారు. రిషభ్ ‘సౌ’రభాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదని ప్రశంసిస్తున్నారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాతీయ జట్టులో రిషభ్‌కు స్థానం కల్పించివుంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు. భవిష్యత్తులో అతడు కచ్చితంగా మళ్లీ టీమిండియాకు ఆడతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు భారంగా మారిన గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. Really special innings from Rishabh. Those were not bad balls from Bhuvi in the last over barring the last full toss, but Rishabh Pant is really special and I hope he is nurtured well. #DDvSRH — Virender Sehwag (@virendersehwag) 10 May 2018 Can't believe what I just saw! Still remember the 97 he scored against GL last year. Unbelievable hitting from @RishabPant777. Great going my boy. Keep it up. #DDvSRH #IPL2018 pic.twitter.com/AK3mpC29Bx — Suresh Raina (@ImRaina) May 10, 2018 Unbelievable innings from @RishabPant777 tonight! Continues to play with amazing skill and power. Unfortunately Hyderabad were too good for us tonight. Hopefully finish the season with 3 good wins for our amazing home fans. — Glenn Maxwell (@Gmaxi_32) 10 May 2018 What an amazing innings from such a talent @RishabPant777 absolutely on fire!!!! — Mike Hussey (@mhussey393) May 10, 2018 Superb! An outstanding 💯 from @RishabPant777 @DelhiDaredevils. The knock is a special one as it came against a quality bowling side of @SunRisers @IPL #DDvSRH #DELHI https://t.co/gW3nH4V9i9 — Anjum Chopra (@chopraanjum) 10 May 2018 Gambhir after watching Rishab pant's batting. pic.twitter.com/xH31P5N3Xy — Mask ishan (@Mr_LoLwa) May 10, 2018 -
సొంతగడ్డపై సన్‌రైజర్స్ గర్జించింది
-
రైజర్స్ ‘టాప్’ గేర్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ గర్జించింది. ఉప్పల్ మైదానంలో నాలుగో విజయంతో, ఓవరాల్‌గా ఏడో గెలుపుతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. శనివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలుపొందింది. మొదట బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జోరును కట్టడి చేసిన సన్‌రైజర్స్... ఓపెనర్లు హేల్స్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ధావన్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)ల శుభారంభంతో విజ యం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. పృథ్వీ షా (36 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్ 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి గెలిచింది. చివర్లో పఠాన్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి. మెరిసిన పృథ్వీషా అద్భుత బౌలింగ్ దళమున్న సన్‌రైజర్స్‌తో ఛేదన కష్టమనుకున్న డేర్‌డెవిల్స్ కెప్టెన్ అయ్యర్ టాస్ నెగ్గిన వెంటనే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన యువ బ్యాట్స్‌మన్ పృథ్వీషా ధాటైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కానీ రెండో ఓవర్లోనే దురదృష్టంకొద్దీ మ్యాక్స్‌వెల్ (2) రనౌటయ్యాడు. సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్ మూడో బంతికి పృథ్వీ లాంగాన్‌లో సిక్సర్ బాదాడు. అదే ఊపుతో స్ట్రయిట్ డ్రైవ్‌కు ప్రయత్నించగా... బౌలర్ సందీప్ చేతిని తాకుతూ వెళ్లిన బంతి నేరుగా వికెట్లను తగిలింది. దీంతో నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో గీతదాటిన మ్యాక్స్‌వెల్ నిరాశగా రనౌటై వెనుదిరిగాడు. తర్వాత పృథ్వీకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జతయ్యాడు. సిద్ధార్థ్ కౌల్ వేసిన తొలి ఓవర్లో పృథ్వీషా చెలరేగాడు. మూడో బంతిని సిక్స్ కొట్టిన ఢిల్లీ ఓపెనర్ తర్వాత మూడు బంతుల్ని బౌండరీలకు తరలించాడు. దీంతో ఆ ఓవర్లో ఢిల్లీకి 20 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ 7వ ఓవర్లోనే పృథ్వీ 25 బంతుల్లోనే (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తిచేశాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఢిల్లీ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. కానీ తర్వాతి ఓవర్ తొలి బంతికే పృథ్వీషాను రషీద్‌ఖాన్ ఔట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 86 పరుగుల‡భాగస్వామ్యానికి తెరపడింది. ఢిల్లీ జోరు కూడా మందగించింది. సిద్ధార్థ్, భువీలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న శ్రేయస్‌ను సిద్ధార్థ్ ఔట్ చేయగా... రిషభ్ పంత్ (19 బంతుల్లో 18; 1 ఫోర్) రషీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన నమన్ ఓజా (1) రనౌటయ్యాడు. దీంతో 9 పరుగుల వ్యవధిలోనే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. చివర్లో విజయ్ శంకర్ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝళిపించడంతో ఢిల్లీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఓపెనర్ల శుభారంభం కష్టసాధ్యం కానీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, శిఖర్ ధావన్ చక్కని ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ మ్యాచ్‌కే హైలైట్. అవేశ్‌ఖాన్ వేసిన ఈ ఓవర్లో ధావన్ ఒక సిక్స్ కొట్టగా, హేల్స్ మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో 27 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు 34/0గా ఉన్న స్కోరు కాస్త 6 బంతుల వ్యవధిలోనే 61/0 కి చేరింది. తొలి వికెట్‌కు 76 పరుగులు జతయ్యాక తొమ్మిదో ఓవర్ చివరి బంతికి అమిత్ మిశ్రా తన గింగిర్లు తిప్పే బంతితో హేల్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అలాగే ధావన్‌ను కూడా మిశ్రా తన తర్వాతి ఓవర్ (ఇన్నింగ్స్ 11వ)లోనూ చివరి బంతికే బౌల్డ్ చేశాడు. 86 పరుగులకు 2 వికెట్లు కోల్పోగా... మనీశ్ పాండే (17 బంతుల్లో 21; 2 ఫోర్లు) కెప్టెన్ విలియమ్సన్తో కలిసి వేగంగా పరుగులు జోడించాడు. వీళ్లిద్దరు కలిసి మూడో వికెట్‌కు 46 జోడించాక పాండేను ప్లంకెట్ ఔట్ చేశాడు. అనంతరం విలియమ్సన్ (30 బంతుల్లో 32 నాటౌట్; 1 సిక్స్)కు జతకలిసిన యూసుఫ్ పఠాన్ జట్టు విజయంలో మెరుపుపాత్ర పోషించాడు. ఖాతా తెరవకముందే యూసుఫ్ పఠాన్ ఇచ్చిన క్యాచ్‌ను విజయ్ శంకర్ జారవిడువడంతో బతికిపోయిన అతను భారీ సిక్సర్లతో జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా... పఠాన్ వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టడంతో విజయం ఖాయమైంది. -
ఎప్పుడు ఆడిస్తారో!
సాక్షి క్రీడా విభాగం : జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి తదనంతరం భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో కొందరు. మరికాస్త వెనక్కి వెళ్తే మనీశ్ పాండే, మోహిత్ శర్మ, సంజు శామ్సన్ తదితరులతో ఈ జాబితా ఇంకా పెద్దదే. రంజీ ట్రోఫీ సహా దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనే భారత జట్టులో చోటుకు ప్రామాణికమని సెలెక్టర్లు చెబుతున్నా... ఐపీఎల్ ‘ఇన్స్టంట్’ గుర్తింపు తెస్తుందనడంలో సందేహం లేదు. ఇందుకు తగ్గట్లే లీగ్ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. తాజా సీజన్లోనూ కొందరు కుర్రాళ్లు అవకాశం దక్కితే ఆకట్టుకోగలరని భావించినా... కృష్ణప్ప గౌతమ్, శుబ్‌మన్ గిల్ మినహా మిగతా వారంతా అవకాశం కోసం చూస్తునే ఉన్నారు. మరి వారెవరో చూద్దాం... ఖలీల్ అహ్మద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 2016లో భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ప్రదర్శన చూసి రాజస్తాన్‌కు చెందిన ఈ పేస్ బౌలర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులోకి తీసుకుంది. కానీ, రెండు సీజన్లలోనూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అద్భుత ప్రతిభావంతుడిగా రాహుల్ దవ్రిడ్ నుంచి ప్రశంసలు అందుకున్న ఖలీల్‌కు ఈ సారీ ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రస్తుత సన్‌రైజర్స్ లైనప్ ప్రకారం ఎడమ చేతివాటం ఖలీల్ తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. గాయంతో ప్రధాన పేసర్ భువనేశ్వర్ దూరమైనా... సిద్ధార్థ్ కౌల్, సందీప్‌శర్మ, బాసిల్ థంపి వంటి బౌలర్లపైనే జట్టు నమ్మకం ఉంచడంతో ఖలీల్ అరంగేట్రానికి మరికొంత కాలం వేచి ఉండాల్సి రావొచ్చు. రికార్డు: 11 టి20 మ్యాచ్‌ల్లో 17.41 సగటు, 6.88 ఎకానమీతో 17 వికెట్లు నవ్‌దీప్ సైని (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉన్న నవదీప్ సైనికి ఇది మొదటి ఐపీఎల్ కాదు. గతంలో డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. ఆ సమయంలో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆట తీరు ఎంతో మెరుగుపర్చుకున్న తర్వాత కోహ్లి దృష్టిలో పడిన ఈ ఢిల్లీ కుర్రాడిని అతడి నాయకత్వంలోని బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ బౌలర్లలో క్రమం తప్పకుండా ఉండే సైని పేరు ఒక దశలో జట్టు ఎంపికలోనూ వినిపించింది. కానీ, అనూహ్యంగా ఆర్సీబీ అతడిని ఇంతవరకు ఆడించనే లేదు. బెంగళూరు బౌలింగ్ పరిమితుల రీత్యా చూసినా సైనిని పరీక్షించి చూడొచ్చు. అయితే... హైదరాబాదీ సిరాజ్‌పై కోహ్లి నమ్మకం ఉంచడం, అతడు కుదురుకుంటుండటంతో మరో ఆలోచన చేస్తున్నట్లు లేదు. రికార్డు: 14 టి20 మ్యాచ్‌లలో 25.30 సగటు, 6.03 ఎకానమీతో 13 వికెట్లు మన్జోత్ కల్రా (ఢిల్లీ డేర్ డెవిల్స్) ఇటీవలి అండర్–19 ప్రపంచకప్ విజయంతో కల్రా పేరు వెలుగులోకి వచ్చింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ అతడిని ప్రత్యేకంగా నిలిపింది. ఎడమ చేతివాటం ఓపెనర్ కావడం, జాతీయ జట్టుకు ఇలాంటి శైలి ఆటగాడు అవసరం ఉండటంతో తనపై అంచనాలు పెరిగాయి. ఢిల్లీకే చెందిన ఈ కుర్రాడిపై ఎంపిక సమయంలో నాటి కెప్టెన్ గంభీర్ అపార నమ్మకం ఉంచాడు. దేశవాళీ ఆటగాడిగా తుది జట్టులో ఉంటాడని కూడా అనుకున్నారు. కానీ, ఢిల్లీ జట్టులో తన పేరే కనిపించడం లేదు. వైఫల్యాలతో సతమతం అవుతున్న ఢిల్లీ... కల్రా కంటే మరో యువ సంచలనం పృథ్వీ షాకే అవకాశం ఇచ్చింది. దీంతో కల్రా బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. సందీప్ లమ్చానే (ఢిల్లీ డేర్‌డెవిల్స్) లెగ్ స్పిన్ నైపుణ్యంతో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ను అమితంగా ఆకట్టుకున్నాడు లమ్చానే. అతడి సిఫార్సుతోనే ఢిల్లీ మెంటార్ పాంటింగ్... లమ్చానేను జట్టులోకి తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఆడనున్న తొలి నేపాలీగా రికార్డుల్లోకి ఎక్కుతాడని అనుకున్నారు. అయితే, జట్టులో అమిత్ మిశ్రా, తేవటియా రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటంతో సందీప్‌కు చోటివ్వడం కష్టమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైవిధ్యం కోసం ప్రయత్నిస్తే... లమ్చానే అరంగేట్రం ఎంతో దూరంలో ఉండకపోవచ్చు. మంజూర్ దార్ (పంజాబ్ కింగ్స్ ఎలెవెన్) భారీ హిట్టర్, టి20 స్ట్రైక్ రేట్ 140, కష్టాలకోర్చి ఎదిగిన నేపథ్యం... ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన కశ్మీరీ మంజూర్ దార్‌ను పంజాబ్ ఎప్పుడు బరిలోకి దింపినా అది ఆసక్తికర అంశమే. మంజూర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. దీంతో కరుణ్నాయర్, యువరాజ్ సింగ్, మనోజ్ తివారిలలో ఏ ఇద్దరినైనా పక్కకుపెడితే తప్ప... జట్టు ఇప్పుడున్న విజయాల ఊపులో అతడికి చోటు ఆశించడం కష్టమే. రసూల్ తర్వాత ఐపీఎల్ ఆడిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న మంజూర్ తన అవకాశం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. -
ఢిల్లీ విక్టరీ.. అదరగొట్టిన యువ బ్యాట్స్‌మెన్స్
-
ఢిల్లీ ధమాకా
తొలుత వాన అడ్డుకుంది... తర్వాత ఢిల్లీ విరుచుకుపడింది. మరోసారి వర్షం అవాంతరం కలిగించింది... ఈసారి రాజస్తాన్ జూలు విదిల్చింది. చివరకు పరుగుల పోరులో డేర్ డెవిల్స్దే పైచేయి అయింది. చివరి ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఢిల్లీ స్వల్ప తేడాతో నెగ్గి ఉపశమనం పొందింది. ఢిల్లీ: బలహీనమైన ఢిల్లీ, రాజస్తాన్ మధ్య మ్యాచేగా? అంటూ నిర్వేదంలో ఉన్న అభిమానులకు వారి అభిప్రాయం తప్పని చెప్పేలా ఈ రెండు జట్లు చక్కని టి20 క్రికెట్ విందు అందించాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఢిల్లీ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్ వేశాక వర్షం కారణంగా ఆట దాదాపు గంటన్నర ఆలస్యం కావడంతో 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... ఓపెనర్ పృథ్వీ షా (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (29 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల విధ్వంసక ఆటతో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ 17.1 ఓవర్ వద్ద ఉండగా మళ్లీ వాన పడటంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో రాజస్తాన్ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151గా నిర్దేశించారు. ఓపెనర్లు జాస్ బట్లర్ (26 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), షార్ట్ (25 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు)ల మెరుపులతో రాజస్తాన్ ఓ దశలో గెలిచేలా కనిపించింది. అయితే వీరు వెనుదిరిగాక హిట్టింగ్ చేసేవారు లేక వెనుకబడిపోయింది. బౌల్ట్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... కృష్ణప్ప గౌతమ్ (6 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఈసారి దానిని సాధించడంలో విఫలమయ్యాడు. విధ్వంసానికి చిరునామాలా... ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఓపెనర్ మున్రో (0) వికెట్ కోల్పోయినప్పటికీ... షా, అయ్యర్, పంత్ ధాటైన ఆటతో ఢిల్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తొలి రెండు ఓవర్లలో అయిదే పరుగులిచ్చిన రాజస్తాన్ బౌలర్లకు తర్వాత నుంచి వీరు చుక్కలు చూపించారు. కులకర్ణి వేసిన 3వ ఓవర్లో పృథ్వీ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో మొదలైన విధ్వంసం ఆరో ఓవర్ వరకు సాగింది. ఈ క్రమంలో వరుసగా 16, 11, 15, 14 పరుగులు వచ్చాయి. భారీ స్కోరు చేసే ఊపులో కనిపించిన షా... శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓ ఎండ్‌లో అయ్యర్ తనదైన శైలిలో పరుగులు సాధిస్తుండగా, పంత్ మరింత దూకుడు చూపడంతో పదో ఓవర్ నుంచి వరద మొదలైంది. 13వ ఓవర్లో కులకర్ణి మూడు వైడ్లు సహా 20 పరుగులు ఇచ్చుకోవడంతో ఢిల్లీ స్కోరు అమాంతం పెరిగిపోయింది. అర్ధ శతకాలు పూర్తయ్యాక వీరిద్దరినీ ఉనాద్కట్ ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపి జట్టుకు ఊరటనిచ్చాడు. బట్లర్ విరుచుకుపడినా... మామూలుగానే రాజస్తాన్‌ది నెమ్మదైన బ్యాటింగ్. అలాంటిది ఓవర్‌కు దాదాపు 13 పరుగుల రన్ రేట్‌తో పరుగులు చేయాలంటే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. అయితే మరో ఓపెనర్ షార్ట్ ఇబ్బంది పడుతున్నా... బట్లర్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. అవేశ్ ఖాన్ వేసిన మూడో ఓవర్లో మూడు సిక్స్‌లు సహా 23 పరుగులు చేశాడు. 18 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. అతడున్నంత సేపు మ్యాచ్ రాజస్తాన్ వైపే కనిపిచింది. కానీ 33 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉండగా మిశ్రా బౌలింగ్‌లో బట్లర్ స్టంపౌట్ కావడంతో పరిస్థితి క్లిష్టమైంది. బౌల్ట్ ఒకే ఓవర్లో శామ్సన్ (3), స్టోక్స్ (1)లను అవుట్ చేసి మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్స్‌లు బాదిన షార్ట్ ఫలితాన్ని మార్చేలా కనిపించినా తర్వాతి బంతికే అవుటయ్యాడు. కృష్ణప్ప గౌతమ్, రాహుల్ త్రిపాఠి (9) పోరాడినా రాయల్స్ విజయానికి నాలుగు అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. -
ఢిల్లీ ప్రతీకార విజయం..
న్యూఢిల్లీ : జోస్ బట్లర్ 67(26 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), డీఆర్కీషార్ట్ 44(26 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్స్‌లు)లు వీరోచితంగా ఆడినా రాజస్తాన్ రాయల్స్ ఓటమిని చవిచూసింది. ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ రిషబ్ పంత్ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ 50(35 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లు), పృథ్వీషా 47(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు చెలరేగడంతో 17.1 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రాజస్తాన్ లక్ష్యాన్ని 12 ఓవర్లకు 151 పరుగులుగా నిర్ధేశించింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్తాన్ అనూహ్యంగా జోస్ బట్లర్‌ను ఓపెనర్‌గా పంపింది. బట్లర్, డీఆర్కీషార్ట్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడే క్రమంలో వరుసగా పెవిలియన్ బాట పట్టారు. నిర్ణీత ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 5వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు.. అమిత్ మిశ్రా, మ్యాక్స్‌వెల్‌లకు చెరో వికెట్ దక్కాయి. -
వర్షం అడ్డంకితో రాజస్తాన్ ఆటగాళ్లు ఏం చేసారంటే!
-
ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం
-
వాట్సన్, ధోని మెరుపు బ్యాటింగ్
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తమ స్థాయిని ప్రదర్శించింది. గత మ్యాచ్ పరాజయం నుంచి వెంటనే కోలుకొని ఢిల్లీని పడగొట్టింది. ముందుగా వాట్సన్ మెరుపు బ్యాటింగ్, చివర్లో ధోని, రాయుడు ధమాకా వెరసి భారీ స్కోరుతో సవాల్ విసరగా... లక్ష్యాన్ని ఛేదించడం డేర్‌డెవిల్స్ వల్ల కాలేదు. రిషభ్ పంత్, విజయ్ శంకర్ పోరాడినా... ఢిల్లీది మళ్లీ పాత కథే అయింది. కెప్టెన్సీ కష్టం శ్రేయస్ అయ్యర్‌కు రెండో మ్యాచ్‌లోనే తెలిసొచ్చింది. పుణే: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై 13 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షేన్ వాట్సన్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), ధోని (22 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీలకు తోడు అంబటి రాయుడు (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులే చేయగలిగింది. రిషభ్ పంత్ (45 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్ శంకర్ (31 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేసినా లాభం లేకపోయింది. భారీ భాగస్వామ్యాలు... అద్భుత ఫామ్‌లో ఉన్న రాయుడును బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపి వాట్సన్‌కు జతగా డు ప్లెసిస్ (33 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్)తో చెన్నై ఓపెనింగ్ చేయించింది. బౌల్ట్ వేసిన తొలి బంతికే వాట్సన్ వికెట్ల ముందు దొరికిపోయినా... రీప్లేలో స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడటంతో తొలి 4 ఓవర్లలో చెన్నై 9 పరుగులే చేయగలిగింది. అయితే ప్లంకెట్ వేసిన ఐదో ఓవర్లో వీరిద్దరు కలిసి మూడు భారీ సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ప్లంకెట్ తర్వాతి ఓవర్లో కూడా వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన వాట్సన్, తేవటియా ఓవర్లో కూడా ఇలాగే బాది 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు 102 పరుగులు (65 బంతుల్లో) జోడించిన తర్వాత డు ప్లెసిస్‌ను అవుట్ చేసి విజయ్ శంకర్ ఢిల్లీకి తొలి వికెట్ అందించాడు. ఈ భాగస్వామ్యంలో వాట్సన్, ప్లెసిస్ చెరో 33 బంతులు ఎదుర్కోగా... ప్లెసిస్ 33 పరుగులు చేస్తే, వాట్సన్ 66 పరుగులు సాధించడం అతని జోరుకు నిదర్శనం. మ్యాక్స్‌వెల్ తొలి బంతికే రైనా (1)ను బౌల్డ్ చేయడంతో రాయుడు నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. మరోవైపు సీజన్లో రెండో సెంచరీ దిశగా దూసుకుపోతున్న వాట్సన్‌ను మిశ్రా అవుట్ చేయడంతో ఢిల్లీ సంబరం చేసుకుంది. అయితే ఆ ఆనందం డేర్‌డెవిల్స్‌కు ఎంతో సేపు నిలవలేదు. ధోని, రాయుుడు కలిసి బౌలర్లను చితక్కొట్టారు. వీరి ధాటికి చివరి 5 ఓవర్లలో చెన్నై 74 పరుగులు రాబట్టడం విశేషం. మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో దూకుడు మొదలు పెట్టిన ధోని... బౌల్ట్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టాడు. అదే ఓవర్లో రాయుడు కూడా ఫోర్ బాదడంతో మొత్తం 21 పరుగులు లభించాయి. ప్లంకెట్ వేసిన మరుసటి ఓవర్లో కూడా చెలరేగిన రాయుడు 3 ఫోర్లు కొట్టాడు. 31 పరుగుల వద్ద మున్రో సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ధోని, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 7 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. గత మూడు మ్యాచ్‌లలో రెండు సార్లు రనౌటైన రాయుడు, ఈ మ్యాచ్‌లోనూ రనౌట్‌గా వెనుదిరిగాడు. రాయుడు, ధోని జోడి 36 బంతుల్లోనే 79 పరుగులు జత చేసింది. రాణించిన పంత్, శంకర్... భారీ ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. ఐపీఎల్లో తొలిసారి ఆడుతున్న ఆసిఫ్... ముందుగా పృథ్వీ షా (9)ను, ఆ తర్వాత మున్రో (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను పెవిలియన్ పంపించాడు. ఆసిఫ్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టిన మున్రో తర్వాతి బంతికి చిక్కాడు. గత మ్యాచ్ హీరో శ్రేయస్ అయ్యర్ (13) ఎక్కువ సేపు నిలవలేదు. పంత్‌తో సమన్వయ లోపంతో అతను రనౌట్ కాగా... మ్యాక్స్‌వెల్ (6) కూడా విఫలం కావడంతో ఢిల్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో పంత్, శంకర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు 53 బంతుల్లో 88 పరుగులు జోడించారు. అయితే చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్న దశలో పంత్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో ఢిల్లీ ఆశలు కోల్పోయింది. బ్రేవో వేసిన 19వ ఓవర్లో మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో పాటు చివరి వరకు క్రీజ్‌లో నిలిచినా గెలిపించడం విజయ్ శంకర్‌కు సాధ్యం కాలేదు. -
ఇండియాకు ఫ్యూచర్ సచిన్ దొరికేశాడోచ్!
-
ఢిల్లీని గెలిపించిన కొత్త కెప్టెన్
-
ఢిల్లీ కెప్టెన్సీకి గంభీర్ గుడ్‌బై
-
ఎందరు మారినా ఢిల్లీ రాత మాత్రం మారలేదు
-
ఢిల్లీ వల్ల కాలేదు
ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, వేదిక... ఎన్ని మారినా ఐపీఎల్లో ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు. పంజాబ్‌తో 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్ డెవిల్స్ ఓడింది. ముజీబ్ వేసిన ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ఢిల్లీ 12 పరుగులే చేయగలిగింది. చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సిన స్థితిలో శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ చేసి ముజీబ్ తమ జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ఐదో పరాజయం... సోమవారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ముందుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (32 బంతుల్లో 34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న ప్లంకెట్ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. అనంతరం ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించినా అప్పటికే ఆలస్యమైపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్, ఆండ్రూ టై తలా 2 వికెట్లు పడగొట్టారు. ప్లంకెట్ జోరు: వరుసగా మూడు మ్యాచ్‌లలో జట్టును గెలిపించిన క్రిస్ గేల్ గాయంతో దూరం కావడంతో పంజాబ్ ఓపెనింగ్ జోడి మారింది. ఈ సీజన్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అవేశ్ ఖాన్ 149 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతిని ఆడలేక ఫించ్ (2) వెనుదిరగడంతో ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడారు. అయితే ఇది ఎక్కువసేపు సాగలేదు. పేసర్ ప్లంకెట్ తన వరుస ఓవర్లలో రాహుల్, మయాంక్‌లను ఔట్ చేయడంతో పంజాబ్ కష్టాలు పెరిగాయి. యువరాజ్ సింగ్ (17 బంతుల్లో 14; 1 ఫోర్) వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. అయితే మరో ఎండ్‌లో మెరుగ్గా ఆడుతున్న నాయర్ ఆటను ప్లంకెట్ ముగించగా... మరుసటి ఓవర్లోనే ప్లంకెట్ చక్కటి క్యాచ్‌కు మిల్లర్ (19 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా వెనుదిరిగాడు. తొలి 10 ఓవర్లలో 68 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్... తర్వాతి 10 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్‌ప్లేను మినహాయిస్తే మిగిలిన 14 ఓవర్లలో ఆ జట్టు కేవలం 5 ఫోర్లు, 1 సిక్సర్ మాత్రమే కొట్టడం పరిస్థితిని సూచిస్తోంది. అయ్యర్ మినహా: ఐపీఎల్లో తొలిసారి ఆడే అవకాశం దక్కించుకున్న భారత అండర్–19 కెప్టెన్ పృథ్వీ షా (10 బంతుల్లో 22; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు చక్కటి షాట్లు ఆడాడు. అయితే శరణ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన తర్వాత అదే జోరులో రాజ్‌పుత్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో మ్యాక్స్‌వెల్ (12), గంభీర్ (4)లను ఔట్ చేసి పంజాబ్ పట్టు బిగించే ప్రయత్నం చేసింది. ముజీబ్ తన తొలి బంతికే పంత్ (4)ను క్లీన్ బౌల్డ్ చేయగా, రెండో పరుగు కోసం ప్రయత్నించి క్రిస్టియాన్ (6) రనౌట్ కావడంతో ఢిల్లీ పరిస్థితి దిగజారింది. -
చిన్నారులతో పోటెత్తిన వాంఖేడే స్టేడియం
-
జాసన్ దూకుడు,డేర్ డెవిల్స్ విక్టరీ
-
టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్
మొహాలీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా ఇక్కడ ఆదివారం ఐఎస్ బింద్రా స్టేడియంలో ఢిల్లీడేర్ డేవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్‌గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరు జట్లు తొలి విజయం కోసం ఉవ్విళ్లురుతున్నాయి. అశ్విన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌కాగా.. సొంత గూటి చేరిన గంభీర్ ఎలాగైన విజయాన్నందించాలని భావిస్తున్నాడు. మేటి ఆటగాళ్లతో ఇరు జట్లు సమిష్టిగా ఉన్నాయి. తుది జట్లు: పంజాబ్ : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, యువరాజ్ సింగ్, డేవిడ్ మిల్లర్, మార్కస్ స్టోయినీస్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), ఆండ్రూ టై, మోహిత్ శర్మ, రెహ్మాన్ ఢిల్లీ: గౌతం గంభీర్ (కెప్టెన్), కోలిన్ మున్రో, రిషబ్‌పంత్, శ్రేయస్ అయ్యర్, క్రిస్ మొర్రిస్, విజయ్ శంకర్, డానియల్ క్రిస్టియన్, అమిత్ మిశ్రా, రాహుల్ తెవాటియా, ట్రెంట్ బోల్ట్, మహ్మద్ షమీ -
డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన ఆటగాళ్లు
-
‘కొత్త’ ఢిల్లీ గెలిచేదెప్పుడు?
ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్... తొలి ఐదు సీజన్లలో మూడు సార్లు సెమీఫైనల్ (2012 ప్లేఆఫ్స్‌తో కలిపి) వరకు చేరి సత్తా ఉన్న టీమ్‌గా కనిపించింది. అయితే 2013 నుంచి జట్టు పరిస్థితి మరీ దీనంగా తయారైంది. రెండు సార్లు చివరి స్థానంలో నిలిస్తే... మరోసారి చివరి నుంచి రెండో స్థానం, మరో రెండు సార్లు చివరి నుంచి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి కొత్త కెప్టెన్ గంభీర్, కొత్త కోచ్ రికీ పాంటింగ్ డేర్‌డెవిల్స్ రాత మార్చగలరా చూడాలి. సాక్షి క్రీడా విభాగం :ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లాలో అభిమానులు తమ విజయం కోసం ఎదురు చూసి చూసి విసుగెత్తిపోయారు. ఐపీఎల్లో ఎన్నడూ లేని విధంగా యాజమాన్య హక్కులను రెండు సంస్థలు పంచుకోవడంతో కూడా డేర్‌డెవిల్స్ జట్టు వార్తల్లో నిలిచింది. ‘విఫల జట్టు’గా ముద్ర పడటం కూడా అందుకు ఒక కారణమని వినిపించింది. ఈసారి ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచాల్సిన బాధ్యత జట్టుపై ఉంది. ఐపీఎల్–11లో ఢిల్లీకి ఇప్పుడు గంభీర్ రూపంలో మంచి నాయకుడు దొరికాడు. కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండు సార్లు విజేతగా నిలిపిన అతను తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. భారత జట్టుకు దూరమై చాలా కాలమైనా... ఇంకా టి20ల్లో గంభీర్ నమ్మదగిన బ్యాట్స్‌మన్ కావడం జట్టుకు అదనపు బలం. జట్టులో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి గంభీర్ మిడిలార్డర్‌కు మారే అవకాశమూ ఉంది. కోచ్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యూహాలు ఆ జట్టును కనీసం ప్లే ఆఫ్‌కు చేర్చగలవు. ఆ నలుగురు... ఢిల్లీ తుది జట్టులో కచ్చితంగా ఉండే నలుగురు విదేశీయుల్లో విధ్వంసకర ఓపెనర్ మున్రో, మ్యాక్స్‌వెల్ ఒక్క ఓవర్‌తో జట్టు రాత మార్చేయగలరు. వీరిద్దరితో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌కు కూడా చోటు ఖాయం. నాలుగో ఆటగాడిగా పేస్ బౌలర్ రూపంలో బౌల్ట్, రబడ అందుబాటులో ఉన్నారు. తాజా ఫామ్ ప్రకారం ఇద్దరూ ప్రమాదకరమైనవారే. ఒక వేళ మున్రో విఫలమైతే మరో భారీ హిట్టర్ జేసన్ రాయ్ కూడా ఎలాగూ ఉన్నాడు. కాబట్టి విదేశీ ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో సమస్య లేదు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే మేనేజ్మెంట్ అనుభవంపై ఆధార పడుతుందా లేక కుర్రాళ్లకు అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరం. శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ల స్థానాలకు తిరుగు లేదు. ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్‌కు కూడా చోటు ఖాయం. నేపాల్ స్పిన్నర్ సందీప్ లిమిచానే ఐపీఎల్‌లోకి వచ్చినా అతను తన అవకాశం కోసం కొంత సమయం ఎదురు చూడక తప్పదు. జట్టు వివరాలు: గంభీర్ (కెప్టెన్), మన్‌జ్యోత్ కల్రా, పృథ్వీ షా, అయ్యర్, అభిషేక్ శర్మ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, షమీ, సయన్ ఘోష్, నదీమ్, గుర్కీరత్ సింగ్ మాన్, జయంత్ యాదవ్, రాహుల్ తేవాటియా, విజయ్ శంకర్, నమన్ ఓజా, రిషభ్ పంత్ (భారత ఆటగాళ్లు). జేసన్ రాయ్, రబడ, సందీప్ లమిచానే, బౌల్ట్, క్రిస్ మోరిస్, మున్రో, క్రిస్టియాన్, మ్యాక్స్‌వెల్ (విదేశీ ఆటగాళ్లు). -
రబాడా, మోరిస్ పోరాటం వృథా
ముంబై: ఐపీఎల్-10లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 14 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో తడబడిన ముంబై.. ఆపై బౌలింగ్‌లో రాణించడంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆపై లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరమితమైంది. ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించిన ముంబైకి తొలి మ్యాచ్ ఆడుతున్న రబడా బ్రేక్ వేశాడు. పార్థీవ్(8) ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు. ఆ వెంటనే బట్లర్ ను శాంసన్ రనౌట్ చేశాడు, అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా, రోహిత్ శర్మలు త్వరగా ఔటయ్యారు. బట్లర్ (28) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. కృనాల్ పాండ్యా(17) ను పెవిలియన్ కు పంపించడంతో ముంబై 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత హార్ధీక్ పాండ్యాతో ఆచితూచి ఆడిన పోలార్డ్ (26) ను కమిన్స్ అవుట్ చేయగా.. హర్భజన్(2)ను రబడా రనౌట్ చేశాడు. ఆ వెంటనే హార్ధీక్ పాండ్యా (24) కరుణ్ నాయర్ రనౌట్ చేశాడు. దీంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మిశ్రా, కమిన్స్ లు చెరో రెండు వికెట్లు తీయగా, రబడాకు ఓ వికెట్ దక్కింది. 143 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ముంబై బౌలర్లు కట్టడిచేశారు. ముగ్గురు టాపార్డర్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మరో ముగ్గురు బ్యాట్స్ మెన్స్ డకౌట్ కావడం గమనార్హం. రిషబ్ పంత్, ఆదిత్యా తారే, అండర్సన్ లు ఖాతా తెరవకుండానే సున్నా పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. సంజూ శాంసన్ (9), కరణ్ నాయర్ (5), శ్రేయస్ అయ్యర్ లు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. మెక్‌క్లీనగన్ చెలరేగడంతో 24 పరుగులకే ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రబాడా(44), మోరిస్(52 నాటౌట్) ఏడో వికెట్‌కు 91 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. కావాల్సిన రన్ రేట్ ఎక్కువ ఉండటంతో జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరమితమై ఓటమి పాలైంది. -
మూగబోయిన ముంబై బ్యాట్
► రాణించి బౌలర్లు, ఢిల్లీ లక్ష్యం 143 ముంబై: ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ లో ముంబై టాప్ ఆర్డర్ విఫలమవడంతో వాంఖడే స్టేడియం మూగబోయింది. కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన ముంబై టాప్ ఆర్డర్ ఢిల్లీ బౌలర్లకు తలవంచింది. టాస్ గెలిచి ఫిల్డీంగ్ ఎంచుకున్న ఢిల్లీ ,బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు పార్దీవ్ పటేల్, జోస్ బట్లర్ ల జంటకు తొలి మ్యాచ్ ఆడుతున్న రబడా బ్రేక్ వేశాడు. పార్థీవ్(8) ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు. ఆ వెంటనే బట్లర్ ను శాంసన్ రనౌట్ చేశాడు, అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా, రోహిత్ శర్మలు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. రాణా కమిన్స్ బౌలింగ్ లో అవుటవ్వగా, రోహిత్ అమిత్ మిశ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. వీరిలో బట్లర్ (28) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. ఈ తరుణంలో పోలార్డ్, కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా, మిశ్రా మరోసారి దెబ్బకొట్టాడు. కృనాల్ పాండ్యా (17) ను పెవిలియన్ కు పంపించడంతో ముంబై 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత హార్ధీక్ పాండ్యాతో ఆచితూచి ఆడిన పోలార్డ్ (26) ను కమిన్స్ అవుట్ చేయగా తర్వాత క్రీజులోకి వచ్చిన హర్భజన్(2)ను రబడా రనౌట్ చేశాడు. ఆ వెంటనే హార్ధీక్ పాండ్యా (24) కేకే నాయర్ రనౌట్ చేశాడు. దీంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మిశ్రా, కమిన్స్ లకు చెరో రెండు వికెట్లు తీయగా, రబడా ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ మూడు రనౌట్ లు అవ్వడం విశేషం. -
ఉమేశ్ ను చితక్కొట్టేశాడు!
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి శుభారంభం లభించింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (39; 25 బంతుల్లో 7 ఫోర్లు), శ్యామ్ బిల్లింగ్స్(21;17బంతుల్లో 2 ఫోర్లు) లు చక్కటి ఆరంభాన్నిఅందించారు. ఆ తరువాత కరుణ్ నాయర్(21;27 బంతుల్లో1 ఫోర్),శ్రేయస్ అయ్యర్(26;17 బంతుల్లో4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఈ జోడి నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరిన తరువాత ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను రిషబ్ పంత్ తీసుకున్నాడు. తొలుత కుదురుగా ఆడిన రిషబ్ పంత్..ఉమేశ్ యాదవ్ వేసిన 17 ఓవర్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్ లో ఉమేశ్ చితక్కొట్టిన రిషబ్ మొత్తంగా 26 పరుగులు రాబట్టాడు. రిషబ్ పంత్ సాధించిన 38 పరుగుల్లో 26 పరుగులు ఒకే ఓవర్ లో వచ్చేయంటే అది అతని బ్యాటింగ్ లో దూకుడుకు అద్దం పడుతోంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆరో వికెట్ గా అవుటైన తరువాత ఢిల్లీ స్కోరు బోర్డులో వేగంగా తగ్గింది. చివరి వరుస ఆటగాళ్లలో క్రిస్ మోరిస్(16;9 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి168 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో కౌల్టర్ నైల్ మూడు వికెట్లు సాధించగా, వోక్స్, యాదవ్, నరైన్ లకు తలో వికెట్ దక్కింది. ఉమేశ్ యాదవ్ నాలుగు ఓవర్లలో అత్యధికంగా 53 పరుగులివ్వడం గమనార్హం. -
ధోని గుర్తించాడు.. జహీర్ విస్మరించాడు!
చెన్నై:ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 వ సీజన్ లో రికార్డు ధర పలికిన ఆటగాళ్లలో పవన్ నేగీ ఒకడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పవన్ నేగీకి 8.5 కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డేవిల్స్ కొనుగోలు చేసింది. ఆర్సీబీ ఆటగాడు షేన్ వాట్సన్ 9.5 కోట్ల అత్యధిక ధర తరువాత పవన్ నేగీదే ఎక్కువ మొత్తం కావడం విశేషం . దీంతో పవన్ నేగీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన మరుసటి రోజే టీమిండియా జట్టులో అవకాశం దక్కింది. ఆసియాకప్, వరల్డ్ టీ 20 టోర్నీలకు చోటు దక్కడంతో తన అదృష్టాన్ని నేగీనే నమ్మలేకపోయాడు. కాగా, ఐపీఎల్లో నేగీ ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై తాజాగా స్పందించిన నేగీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిభను ఢిల్లీ డేర్ డెవిల్స్ సరిగా గుర్త్తించలేదంటూ విమర్శించాడు. తనకు ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా ఢిల్లీ ఎందుకు పక్కను పెట్టిందో ఇప్పటికీ అంతుపట్టడం లేదని వ్యాఖ్యానించాడు. తనకు సాధ్యమైనన్ని అవకాశాలు ఇవ్వడంలో ఢిల్లీ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. తనను తప్పించిన విషయాన్నిజట్టు యాజమాన్యం కూడా ఏనాడో చెప్పలేదని స్పష్టం చేశాడు. ' గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడినప్పుడు ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని తన ప్రతిభను గుర్తించాడు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ మాత్రం తాను జట్టులో ఉన్నా పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. జహీర్ దగ్గరకు వెళ్లి బౌలింగ్ ఇమ్మని అడగలేను కదా. అతనొక సీనియర్ ప్లేయర్ అయ్యుండి కూడా తన ప్రతిభను గుర్తించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది' అని జహీర్ పై అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్‌లాడిన పవన్ నేగీ తొమ్మిది ఓవర్లు పాటు బౌలింగ్ వేసి ఒక వికెట్ తీస్తే, మొత్తంగా 57 పరుగులు చేశాడు. అందులో అతని బెస్ట్ 19 పరుగులు. -
కోహ్లి(సేన)ని ఆపతరమా!
► ప్లే ఆఫ్‌లో చోటు ► ఢిల్లీకి తప్పని నిరాశ ► కోహ్లి అజేయ అర్ధ సెంచరీ పోరాటమంటే బెంగళూరుదే... వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో అనుకున్నది సాధించింది. అత్యద్భుత ప్రదర్శనతో సగర్వంగా ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు కాస్త ఇబ్బంది పెట్టినా పరిస్థితులకు తగ్గట్టు ఆడిన కోహ్లి మరోసారి అండగా నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అటు పేలవ బ్యాటింగ్‌తో ఢిల్లీ మూల్యం చెల్లించుకుని ఐపీఎల్ నుంచి నిష్ర్కమించింది. రాయ్‌పూర్: ఇరు జట్లకిదే చివరి లీగ్ మ్యాచ్.. గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్‌లో చోటు.. కానీ ఒత్తిడిని అధిగమించలేకపోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కీలక మ్యాచ్‌లో చతికిలపడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం తమ లక్ష్యాన్ని అందుకుంది. తొలి మూడు ఓవర్లలోనే గేల్, డివిలియర్స్‌ను కోల్పోయినా విరాట్ కోహ్లి (45 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు) మరోసారి జట్టుకు మూలస్తంభంలా నిలిచాడు. ఫలితంగా ఆదివారం షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ బౌలర్లు చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ (52 బంతుల్లో 60; 5 ఫోర్లు; 1 సిక్స్) ఒంటరి పోరుకు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. యజువేంద్ర చాహల్‌కు మూడు, గేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 139 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. డి కాక్ ఒంటరి పోరు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డి కాక్ అద్భుత ఇన్నింగ్స్ మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండో ఓవర్లోనే జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రిషబ్ (1)ను శ్రీనాథ్ అవుట్ చేశాడు. అటువైపు డి కాక్ మాత్రం వేగంగా ఆడేందుకు ప్రాధాన్యమిస్తూ నాలుగో ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. కానీ ఆరో ఓవర్లో ఢిల్లీకి మరో ఝలక్ తగిలింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చివరికంటా నిలబడి జట్టుకు కీలక విజయాన్ని అందించిన కరుణ్ నాయర్ (10 బంతుల్లో 11; 1 సిక్స్)ను చాహల్ వెనక్కి పంపాడు. మిడాఫ్‌లో కొట్టిన భారీ షాట్‌ను కోహ్లి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకున్న ఈ సూపర్బ్ క్యాచ్ టోర్నీలో హైలైట్ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలుస్తుంది. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 48/2 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ (12 బంతుల్లో 17; 1 ఫోర్; 1 సిక్స్) ఉన్న కొద్దిసేపు వేగంగా ఆడినా చాహల్ అతణ్ని కూడా దెబ్బతీశాడు. డి కాక్‌ను 17వ ఓవర్లో చాహల్ అవుట్ చేయడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. కోహ్లి.. అదే జోరు స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును ఆరంభంలోనే ఢిల్లీ వణికించినా నిలకడైన బ్యాటింగ్‌తో కోహ్లి తుది కంటా క్రీజులో నిలిచి ఆదుకున్నాడు. రెండో ఓవర్లో మోరిస్ బంతికి క్రిస్ గేల్ (1) బౌల్డ్ కాగా మూడో ఓవర్లో డివిలియర్స్ (6)ను జహీర్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి స్కోరు 17 పరుగులు మాత్రమే. ఈ సమయంలో కోహ్లికి జతగా రాహుల్ కలిశాడు. ఇద్దరూ కాసేపు దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో బెంగళూరు జట్టు స్కోరు 49/2కి చేరింది. సమన్వయంతో ముందుకెళుతున్న ఈ జోడిని బ్రాత్‌వైట్ విడదీశాడు. రాహుల్‌ను బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు సహకరించడంతో వాట్సన్ (18 బంతుల్లో 14; 1 సిక్స్), కోహ్లి ఆచితూచి ఆడారు. 14వ ఓవర్లో ఓ సిక్స్ బాదిన వాట్సన్‌ను మరుసటి ఓవర్లోనే నేగి అవుట్ చేశాడు. చివరి 30 బంతుల్లో 28 పరుగులు రావాల్సి ఉండగా బిన్నీ (11 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో మరో 11 బంతులుండగానే కోహ్లి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జోర్డాన్ (బి) చాహల్ 60; రిషబ్ పంత్ (సి) రాహుల్ (బి) శ్రీనాథ్ 1; కరుణ్ నాయర్ (సి) కోహ్లి (బి) చాహల్ 11; శామ్సన్ (సి) రాహుల్ (బి) చాహల్ 17; బిల్లింగ్ (సి) గేల్ (బి) జోర్డాన్ 4; నేగి (సి) డివిలియర్స్ (బి) గేల్ 6; బ్రాత్‌వైట్ (సి) వాట్సన్ (బి) గేల్ 1; మోరిస్ నాటౌట్ 27; జయంత్ యాదవ్ రనౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-11, 2-42, 3-71, 4-81, 5-96, 6-98, 7-107, 8-138. బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 2-0-15-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-28-1; జోర్డాన్ 2-0-10-1; వాట్సన్ 4-0-27-0; చాహల్ 4-0-32-3; అబ్దుల్లా 2-0-14-0; గేల్ 2-0-11-2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) మోరిస్ 1; కోహ్లి నాటౌట్ 54; డివిలియర్స్ (సి) రిషబ్ (బి) జహీర్ 6; రాహుల్ (బి) బ్రాత్‌వైట్ 38; వాట్సన్ (సి) బిల్లింగ్స్ (బి) నేగి 14; బిన్నీ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1-5, 2-17, 3-83, 4-111. బౌలింగ్: జహీర్ 4-0-30-1; మోరిస్ 3-0-31-1; నేగి 3-0-19-1; మిశ్రా 4-0-33-0; జయంత్ యాదవ్ 1-0-8-0, బ్రాత్‌వైట్ 3.1-0-18-1. -
రాణించిన డేవిడ్ వార్నర్
రాయ్ పూర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్(73;56 బంతుల్లో 8 ఫోర్లు,1 సిక్స్ ) మినహా అంతా విఫలమయ్యారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(10) రనౌట్ రూపంలో తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత దీపక్ హూడా(1), యువరాజ్ సింగ్(10), హెన్రీక్యూస్(18), ఇయాన్ మోర్గాన్(14)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఓ వైపు వార్నర్ ఒంటరి పోరు చేసినా మిగిలిన ఆటగాళ్లు వైఫల్యం చెందడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో బ్రాత్ వైట్ కు రెండు వికెట్లు లభించగా, కౌల్టర్ నైల్, జేపీ డుమినీలకు తలో వికెట్ దక్కింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
రాయ్ పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు 12 మ్యాచ్ లు ఆడగా హైదరాబాద్ ఎనిమిది మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకోగా, ఢిల్లీ ఆరు మ్యాచ్ ల్లో గెలిచి ఆరో స్థానంలో ఉంది. దీంతో ఢిల్లీకి ఈ మ్యాచ్ లో గెలుపు కీలకం. తకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
డేర్ డెవిల్స్ కు చావో రేవో!
రాయ్ పూర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్ లో లీగ్ మ్యాచ్ లు క్లైమాక్స్ దశకు వచ్చేశాయి. ఈ టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ , ఢిల్లీ డేర్ డెవిల్స్ లు ప్లే ఆఫ్ రేసులో నిలవడంతో ఇక నుంచి ఆయా జట్ల మధ్య జరిగే ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. ఈ జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలను ఖాయం చేసుకోగా, మిగతా ఐదు జట్లు తుదికంటూ పోరాడితేగానీ వారి ప్లే ఆఫ్ అవకాశాలపై అంచనాకు రావడం కష్టం. నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉండటంతో ఏ జట్టు ముందంజ వేస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ -ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య శుక్రవారం ఇక్కడ షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరో రసవత్తపోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్ కు సగర్వంగా అడుగుపెట్టడంతో పాటు టాప్-2లో కూడా స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. టోర్నీ ఆరంభంలో సంచలన విజయాలతో దూసుకుపోయిన ఢిల్లీ.. ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. ఇప్పటివరకూ 12 మ్యాచ్ లాడిన ఢిల్లీ ఆరింట మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఢిల్లీ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడితే మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ నేపథ్యంలో అటు జహీర్ ఖాన్ అండ్ గ్యాంగ్ ఏ వ్యూహాలతో సిద్ధమవుతుందో వేచి చూడకతప్పదు. -
ఢిల్లీ విజయ లక్ష్యం 147
హైదరాబాద్: ఐపీఎల్-9లో భాగంగా గురువారమిక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 46 పరుగులు), శిఖర్ దావన్(37 బంతుల్లో 34 పరుగులు) రాణించడంతో సన్‌రైజర్స్ జట్టుకు శుభారంభం లభించింది. అయితే విలియం సన్(24 బంతుల్లో 27 పరుగులు) తప్ప మిగతా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. యువరాజ్ సింగ్(8 బంతుల్లో 8 పరుగులు) అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సిక్స్ బాది మంచి ఫాంలో ఉన్నట్లు కనిపించినా.. అదే ఓవర్లో సునాయాసమైన బంతికి వెనుదిరిగాడు. ఆ వెంటనే షమీ బౌలింగ్‌లో హెన్రిక్స్ డకౌట్‌గా వెనుదిరగడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. చివర్లో ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. డేర్ డెవిల్స్ బౌలర్లలో అమిత్ మిశ్రా, కౌల్టర్ నైల్‌లకు రెండేసి వికెట్లు దక్కగా యాదవ్, షమీ, మోరిస్‌లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. -
ఢిల్లీపై పంజాబ్ విజయం
► వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన జహీర్ సేన ► 9 పరుగులతో నెగ్గిన విజయ్ బృందం ► రాణించిన స్టోయినిస్, సాహా మొహాలీ: నిరాశాజనక ప్రదర్శనతో అట్టడుగు స్థానానికి పడిపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు స్ఫూర్తినిచ్చే విజయం. స్టోయినిస్ (44 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు; 3/40) ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడు... వృద్ధిమాన్ సాహా (33 బంతుల్లో 52; 7 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో శనివారం జరిగిన ఐపీఎల్-9 లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 9 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచింది. టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేసింది. డికాక్ (30 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్సన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగినా.. ఆఖర్లో సహచరులు ఒత్తిడికి తలొగ్గారు. సాహా జోరు... తొలి ఓవర్లో ఒక్క పరుగే వచ్చినా.. పంజాబ్ ఓపెనర్లు విజయ్ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు), స్టోయినిస్ మాత్రం ధాటిగా ఆడారు. వరుస బౌండరీలతో దూకుడు పెంచిన విజయ్ ఆరో ఓవర్లో అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆమ్లా (1) విఫలమైనా... సాహా నిలకడగా ఆడాడు. స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ వీరిద్దరు తొలి 10 ఓవర్లలో పంజాబ్ స్కోరును 76/2కు చేర్చారు. 12వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన స్టోయినిస్ 42 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ 14వ ఓవర్లో జహీర్ వేసిన బంతిని కట్ చేయబోయి శామ్సన్ చేతికి చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 16; ఒక సిక్స్) నెమ్మదిగా ఆడినా.. సాహా మాత్రం బౌండరీల జోరు చూపెట్టడంతో పంజాబ్ రన్‌రేట్ వాయువేగంతో దూసుకుపోయింది. అయితే 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన సాహా, మ్యాక్స్‌వెల్ వరుస బంతుల్లో అవుటైనా... మిల్లర్ (6 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్), అక్షర్ పటేల్ (5 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు రాబట్టడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. మోరిస్ 2 వికెట్లు తీశాడు. ఆరంభం అదుర్స్... లక్ష్య ఛేదనలో డికాక్, శామ్సన్ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ఆరో ఓవర్లో డికాక్ తొలి సిక్స్ బాదడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 51 పరుగులు చేసింది. అయితే 8వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్స్‌తో అర్ధసెంచరీ (27 బంతుల్లో) పూర్తి చేసిన డికాక్ ఐదో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కరుణ్ నాయర్ (25 బంతుల్లో 23; 1 ఫోర్) నెమ్మదిగా ఆడినా... శామ్సన్ సిక్స్, ఫోర్ కొట్టడంతో 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 91/1కి చేరింది. ఈ దశలో పంజాబ్ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. పరుగులను నియంత్రిస్తూ శామ్సన్ వికెట్‌ను తీశారు. దీంతో రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 15వ ఓవర్లో నాయర్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసిన మిల్లర్... తర్వాతి ఓవర్లో ఆ తప్పును సరిదిద్దుకున్నాడు. ఇక 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో బిల్లింగ్స్ (6), బ్రాత్‌వైట్ (12) వరుస ఓవర్లలో అవుటయ్యారు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 28 పరుగులుగా మారింది. కానీ క్రీజులో ఉన్న మోరిస్ (17 నాటౌట్), రిషబ్ పంత్ (4 నాటౌట్) 19వ ఓవర్లో 3, ఆఖరి ఓవర్లో 15 పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) బ్రాత్‌వైట్ (బి) మోరిస్ 25; స్టోయినిస్ (సి) శామ్సన్ (బి) జహీర్ 52; ఆమ్లా రనౌట్ 1; సాహా (సి) మోరిస్ (బి) షమీ 52; మ్యాక్స్‌వెల్ (బి) మోరిస్ 16; మిల్లర్ (నాటౌట్) 11; అక్షర్ పటేల్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 181 వికెట్ల పతనం: 1-45; 2-48; 3-106; 4-152; 5-152 బౌలింగ్: నదీమ్ 4-0-30-0; షమీ 3-0-34-1; మోరిస్ 4-0-30-2; జహీర్ 3-0-25-1; బ్రాత్‌వైట్ 2-0-20-0; మిశ్రా 4-0-37-0. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) అక్షర్ (బి) స్టోయినిస్ 52; శామ్సన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టోయినిస్ 49; కరుణ్ నాయర్ (సి) మిల్లర్ (బి) కరియప్ప 23; బిల్లింగ్స్ (సి) సాహా (బి) స్టోయినిస్ 6; బ్రాత్‌వైట్ (సి) గురుకీరత్ (బి) సందీప్ 12; మోరిస్ (నాటౌట్) 17; పంత్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-70; 2-121; 3-134; 4-141; 5-153. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-36-1; మోహిత్ శర్మ 4-0-21-0; కరియప్ప 4-0-37-1; స్టోయినిస్ 4-0-40-3; అక్షర్ పటేల్ 4-0-32-0. -
ఢిల్లీ డేర్ డెవిల్స్ కు భారీ లక్ష్యం
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత కింగ్స్ పంజాబ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. పంజాబ్ ఓపెనర్లు మురళీ విజయ్(25; 16 బంతుల్లో 4 ఫోర్లు), స్టోనిస్(52;44 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం సాహా(52;33 బంతుల్లో 7ఫోర్లు) ధాటిగా ఆడగా, మ్యాక్స్ వెల్(16) నిరాశపరిచాడు. చివర్లో డేవిడ్ మిల్లర్(11 నాటౌట్),అక్షర్ పటేల్(16 నాటౌట్;5 బంతుల్లో 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 181పరుగులు చేసింది. -
ఢిల్లీ బౌలింగ్.. పంజాబ్ బ్యాటింగ్
మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచింది. ఇప్పటివరకూ ఢిల్లీ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు గెలవగా, పంజాబ్ ఎనిమిది మ్యాచ్ లకు గాను రెండింట మాత్రమే నెగ్గింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా,పంజాబ్ చివరి స్థానంలో ఉంది. -
పుణె విజయలక్ష్యం 163
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో పుణె సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణె ఆదిలోనే రిషబ్ పంత్(2)వికెట్ ను కోల్పోయింది. అనంతరం సంజూ శాంసన్(20), కేకే నాయర్(32), జేపీ డుమినీ(34), బిల్లింగ్స్ (24), బ్రాత్ వైట్(20), నేగీ(19నాటౌట్) ఇలా తలో చేయి వేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.పుణె బౌలర్లలో పెరీరా, భాటియాలు తలో రెండు వికెట్లు సాధించారు. -
ఢిల్లీ ‘పంతం’ నెగ్గింది
వయసు 18 ఏళ్లు... అనుభవం రెండే ఐపీఎల్ మ్యాచ్‌లు... అయినా ఏ మాత్రం తడబాటు లేదు... భారత క్రికెట్‌కు ఐపీఎల్ ద్వారా లభించిన మరో ఆణిముత్యంలా... రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తన సంచలన స్ట్రోక్స్‌తో గుజరాత్‌పై ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు. * గుజరాత్‌పై డేర్‌డెవిల్స్ ప్రతీకారం * 8 వికెట్లతో ఘన విజయం * రాణించిన రిషబ్, డికాక్ రాజ్‌కోట్: సరిగ్గా వారం క్రితం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతంగా పోరాడినా గుజరాత్ లయన్స్ చేతిలో ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా డేర్‌డెవిల్స్ చెలరేగిపోయారు. బౌలర్ల సమష్టి కృషికి న్యాయం చేస్తూ... ఓపెనర్లు రిషబ్ పంత్ (40 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), డికాక్ (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో ఢిల్లీ ఎనిమిది వికెట్లతో గుజరాత్ లయన్స్‌ను ఓడించింది. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా... గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. ఫామ్‌లో ఉన్న విదేశీ స్టార్స్ డ్వేన్ స్మిత్ (15), మెకల్లమ్ (1), ఫించ్ (5) విఫలం కావడంతో నాలుగు ఓవర్లలోపే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రైనా (20 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) అండతో దినేశ్ కార్తీక్ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. కార్తీక్, జడేజా (26 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఐదో వికెట్‌కు 52 పరుగులు జతచేయడంతో గుజరాత్‌కు ఓ మాదిరి స్కోరు వచ్చింది. నదీమ్ రెండు వికెట్లు తీయగా... జహీర్, మోరిస్, షమీ, మిశ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ 17.2 ఓవర్లలో రెండు వికెట్లకు 150 పరుగులు చేసి మరో 16 బంతులు మిగిలుండగానే గెలిచింది. పంత్, డికాక్ తొలి వికెట్‌కు 13.3 ఓవర్లలో 115 పరుగులు జోడించారు. కేవలం 25 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన పంత్... ఇన్నింగ్స్ ఆద్యంతం ఆకట్టుకునే షాట్లు ఆడాడు. ఇన్నింగ్స్‌కు యాంకర్ పాత్ర పోషించిన డికాక్ కొద్దిలో అర్ధసెంచ రీని కోల్పోయాడు. ఆరు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు అవుటైనా... శామ్సన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్), డుమిని (7 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు:- గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) మోరిస్ (బి) నదీమ్ 15; మెకల్లమ్ (బి) జహీర్ 1; ఫించ్ (సి) పంత్ (బి) నదీమ్ 5; రైనా (స్టం) డికాక్ (బి) మిశ్రా 24; దినేశ్ కార్తీక్ (బి) షమీ 53; రవీంద్ర జడేజా నాటౌట్ 36; ఫాల్క్‌నర్ (బి) మోరిస్ 7; ఇషాన్ కిషన్ రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1-17; 2-17; 3-24; 4-75; 5-127; 6-138; 7-149. బౌలింగ్: నదీమ్ 3-0-23-2; మోరిస్ 4-0-32-1; జహీర్ 4-0-27-1; షమీ 4-0-31-1; అమిత్ మిశ్రా 3-0-19-1; డుమిని 2-0-14-0. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) స్మిత్ (బి) కౌశిక్ 46; రిషబ్ పంత్ (సి) కార్తీక్ (బి) జడేజా 69; సంజు శామ్సన్ నాటౌట్ 19; డుమిని నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.2 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1-115; 2-121. బౌలింగ్: ప్రవీణ్ 2-0-20-0; ధావల్ 2-0-24-0; రైనా 4-0-34-0; కౌశిక్ 4-0-29-1; డ్వేన్ స్మిత్ 2-0-12-0; ఫాల్క్‌నర్ 1-0-9-0; జడేజా 2.2-0-21-1. -
ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు సాధారణ లక్ష్యం
రాజ్‌కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత గుజరాత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే బ్రెండన్ మెకల్లమ్(1), డ్వేన్ స్మిత్(15) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.అనంతరం ఆరోన్ ఫించ్(5) కూడా నిష్రమించడంతో గుజరాత్ 24 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలోసురేష్ రైనా-దినేష్ కార్తీక్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడీ 51 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం రైనా(24) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే దినేష్ కార్తీక్(53;43 బంతుల్లో 5 ఫోర్లు) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ తేరుకుంది. ఆపై రవీంద్ర జడేజా(36 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్) రాణించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నదీమ్ కు రెండు వికెట్లు సాధించగా, క్రిస్ మోరిస్,జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
రాజ్‌కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మంగళవారం ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత గుజరాత్‌ను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో గుజరాత్ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ ఆరు మ్యాచ్‌లకు గాను నాలుగు నెగ్గింది. -
'మా విజయ రహస్యం అదే'
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో తమ జట్టు సక్సెస్ వెనుక డ్రెసింగ్ రూమ్‌లో సానుకూల వాతావరణమే కారణమని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు కార్లోస్ బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు. జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ లో సరదాగా, సాన్నిహిత్యంగా ఉంటున్నారన్నాడు. ఇదే ఢిల్లీ విజయాల బాట పట్టడానికి ప్రధాన కారణమని బ్రాత్ వైట్ అభిప్రాయపడ్డాడు. ' నేను గత మా ప్రదర్శన గురించి మాట్లాడదలుచుకోలేదు. గతేడాది జట్టులో నేను సభ్యుడిని కూడా కాను. ఈ సీజన్ లో మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అంతా కుటుంబంలా కలిసి చర్చిస్తున్నాం. ఇది మా విజయాలకు దోహదం చేస్తుంది'అని బ్రాత్ వైట్ తెలిపాడు. గత మ్యాచ్ లో కీలక స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ కు స్థానం దక్కకపోవడానికి నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలన్న నిబంధనే కారణమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిపోయిన బ్రాత్ వైట్.. అన్ని సార్లూ ఆ తరహా ప్రదర్శనతో ఆకట్టుకోవడం కష్టమన్నాడు.తన కంటే ముందు నాయర్,బిల్లింగ్స్ లు రాణించడంతోనే ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించానన్నాడు. బ్యాటింగ్ వచ్చిన ప్రతీసారి హిట్టింగ్ చేయాలంటే అది కష్టసాధ్యమన్నాడు. -
అమిత్ మిశ్రాకు మందలింపు
ఢిల్లీ:ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాచ్ రిఫరీ హెచ్చరికకు గురయ్యాడు. శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో అమిత్ మిశ్రా దురుసుగా ప్రవర్తించడంతో అతన్ని మ్యాచ్ రిఫరీ మందలించాడు. కోల్ కతా ఆటగాడు ఆండ్రీ రస్సెల్ వికెట్ తీసిన అనంతరం అతనిపై నేరుగా మిశ్రా అసభ్యపదజాలం ప్రయోగించాడు. ఐపీఎల్ కోడ్ ఆర్టికల్ 2.1.4 ప్రకారం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో మిశ్రా మందలింపుకు గురయ్యాడు. ఇది లెవల్-1 ఉల్లంఘన కావడంతోపాటు, మొదటి తప్పు కావడంతో మిశ్రాను హెచ్చరించి వదిలేశారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 27 పరుగుల తేడాతో కోల్ కతాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన ఢిల్లీ డేర్ డెవిల్స్
ఢిల్లీ: సొంతగడ్డపై ఢిల్లీ డేర్ డెవిల్స్ అదరగొట్టింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 27 పరుగుల తేడాతో నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. ఢిల్లీ విసిరిన 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా 18.3 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కోల్ కతా ఆటగాడు రాబిన్ ఉతప్ప(72; 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో ఆకట్టుకున్నా జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆదిలోనే ఐయ్యర్ (0), డీ కాక్ (1), సంజూ శాంసన్(15) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత కరుణ్ నాయర్ (68;50 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(54;34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాత్ వైట్(34;11బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్, ఉమేష్ యాదవ్ తలో మూడు వికెట్లు సాధించారు. ఆ తరువాత భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గౌతం గంభీర్(6) పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆపై పీయూష్ చావ్లా(8), యూసఫ్ పఠాన్(10)లు కూడా విఫలమయ్యారు. దీంతో కోల్ కతా 58 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో ఓపెనర్ రాబిన్ ఉతప్ప కు జత కలిసిన సూర్యకుమార్ యాదవ్(21)కాస్త ఫర్వాలేదనిపించినా, సతీష్(6), ఆండ్రీ రస్సెల్(17)లు విఫలం చెందడంతో కోల్ కతా కు ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో బ్రాత్ వైట్, జహీర్ ఖాన్ లు తలో మూడు వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రాలకు చెరో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్ కతా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
నాయర్, బిల్లింగ్స్, బ్రాత్ వైట్..
ఢిల్లీ: తొలి ఓవర్ లో రెండు వికెట్లు.. 32 పరుగులకే మూడు వికెట్లు.. అది కూడా పవర్ ప్లే ముగియకుండానే.. ఐయ్యర్ (0), డీ కాక్ (1), సంజూ శాంసన్(15) స్వల్ప వ్యవధిలో క్యూకట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో శనివారం కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆదిలో ఆడిన తీరు. అయితే ఆ తరువాత కరుణ్ నాయర్ (68;50 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(54;34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాత్ వైట్(34;11బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు)లు ఎదురుదాడికి దిగడంతో ఢిల్లీ 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ను అందుకున్న కోల్ కతా బౌలర్ ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు తీసి ఢిల్లీకి షాకిచ్చాడు. ఐయ్యార్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, డీకాక్ ఒక పరుగుకే పరిమితమయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో సంజూ శాంసన్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఢిల్లీ వంద పరుగుల మార్కును చేరడం కూడా కష్టమే అనిపించింది. ఆ సమయంలో కేకే నాయర్, బిల్లింగ్స్‌లు చెలరేగిపోయారు. ఈ జోడీ నాల్గో వికెట్ 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఢిల్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇదే క్రమంలో వారిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆపై బ్రాత్ వైట్ కూడా దాటిగా బ్యాటింగ్ చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో రస్సెల్, ఉమేష్ యాదవ్ లు తలో మూడు వికెట్లు సాధించారు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శనివారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), డీకాక్, ఐయ్యర్, సంజూ శాంసన్, కేకే నాయర్, బిల్లింగ్స్, రిషబ్ పంత్, బ్రాత్ వైట్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రా, మొహ్మద్ షమీ కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్, యూసఫ్ పఠాన్, రాజగోపాల్ సతీష్, హోల్డర్, పీయూష్ చావ్లా, ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, బ్రాడ్ హాగ్ -
'నా టీ 20 కెరీర్లో ఇదే నా బెస్ట్'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ లయన్స్ పై 17 బంతుల్లో నమోదు చేసిన హాఫ్ సెంచరీనే తన టీ 20 కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు క్రిస్ మోరిస్ స్పష్టం చేశాడు. ఆ ఇన్నింగ్స్ తనకు సంతృప్తినిచ్చినా చివరి వరకూ క్రీజ్‌లో ఉండి ఢిల్లీకి విజయాన్ని అందించలేకపోవడం నిరాశకల్గించదన్నాడు. చివరి బంతికి నాలుగు బంతులు చేయాల్సిన క్రమంలో రెండు పరుగులే సాధించి ఓటమి పాలుకావడం బాధ కల్గించిదన్నాడు. ' నా టీ 20 కెరీర్ లో ఇదే అత్యత్తమ ఇన్నింగ్స్. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చేసరికి మా జట్టు ఓవర్ కు సగటున 13 పరుగులు చేయాల్సి ఉంది. నా సహజసిద్ధమైన ఆట తీరునే ప్రదర్శించాలని క్రీజ్‌లోకి వచ్చే సమయంలోనే అనుకున్నా. కేవలం బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టా. నా వ్యూహం ఫలించింది. వికెట్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. దాంతో బౌలర్ ఎవరన్నది చూడకుండా విరుచుకుపడ్డా. కానీ చివరి ఓవర్ వరకూ క్రీజ్‌లో ఉన్నా జట్టును గెలిపించలేకపోయా' అని మోరిస్ తెలిపాడు. ఐపీఎల్-లో భాగంగా బుధవారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. క్రిస్ మోరిస్ 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, 8 సిక్సర్లతో పరుగుల వరద సృష్టించినా ఢిల్లీని పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. గుజరాత్ విసిరిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 171 పరుగులకే పరిమితమై పాలైంది. -
ముంబై ఇండియన్స్ కు ఢిల్లీ షాక్
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై పోరాడి ఓడింది. ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ(65; 48 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్),కృణాల్ పాండ్యా(36; 17 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. వీరిద్దరి తరువాత అంబటి రాయుడు(25) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. టాస్ గెలిచిన ముంబై తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఆదిలోనే డీ కాక్(9) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత ఐయ్యర్ (19), కరుణ్ నాయర్(5) కు కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన సంజూ శాంసన్(60;48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ తేరుకుంది. అతనికి జతగా జేపీ డుమినీ (49 నాటౌట్; 31బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ పార్దీవ్ పటేల్(1) వికెట్ ను ఆదిలోనే నష్టపోయింది. అనంతరం రోహిత్ శర్మ, అంబటి రాయుడుల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ జోడీ 53 పరుగుల చేసిన అనంతరం రాయుడు రెండో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న రోహిత్ శర్మకు కృనాల్ పాండ్యా నుంచి చక్కటి సహకారం లభించింది. ముంబై స్కోరు 103 పరుగుల వద్ద కృనాల్ అవుట్ కావడంతో జట్టు మరోసారి కష్టాల్లో పడింది. ఆ తరువాత ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు పది పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో ముంబై మూడో ఓటమిని మూట కట్టుకోగా, ఢిల్లీ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. -
రాణించిన సంజూ శ్యాంసన్, డుమినీ
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ముంబై తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఆదిలోనే డీ కాక్(9) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత ఐయ్యర్(19), కరుణ్ నాయర్(5) కు కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన సంజూ శాంసన్(60;48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ తేరుకుంది. అతనికి జతగా జేపీ డుమినీ (49 నాటౌట్; 31బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లాన్‌గన్ రెండు వికెట్లు సాధించగా, హర్భజన్, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ రెండింట్లో గెలవగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. -
డికాక్ ధమాకా
గత ఐపీఎల్‌లలో పేలవ ప్రదర్శనకు డీలా పడిపోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్... ఈ సీజన్లో వీరోచిత ప్రదర్శనతో చెలరేగిపోతోంది. బెంగళూరులాంటి పటిష్టమైన జట్టుపై 192 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. కరుణ్ నాయర్ అండతో డికాక్ సూపర్ సెంచరీతో దుమ్మురేపితే... అటూ డివిలియర్స్, కోహ్లిల శ్రమ వృథా అయ్యింది. * ఢిల్లీ ఓపెనర్ మెరుపు సెంచరీ * బెంగళూరుపై డేర్‌డెవిల్స్ అద్భుత విజయం * కోహ్లి, డివిలియర్స్ శ్రమ వృథా బెంగళూరు: కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... ప్రత్యర్థి జట్టులో అందరూ నాణ్యమైన బౌలర్లున్నా.... ఒంటరిగా ఢీకొట్టిన క్వింటన్ డికాక్ (51 బంతుల్లో 108; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్-9లో వీరోచిత సెంచరీతో రెచ్చిపోయాడు. కరుణ్ నాయర్ (42 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో కొండంత స్కోరును నీళ్లు తాగినంత సులువుగా ఛేదించాడు. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సంచలన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (48 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డివిలియర్స్ (33 బంతుల్లో 55; 9 ఫోర్లు, 1 సిక్స్), వాట్సన్ (19 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపారు. అనంతరం ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. గేల్ మళ్లీ విఫలం... భారీ ఆశలు పెట్టుకున్న క్రిస్ గేల్‌ను ఇన్నింగ్స్ మూడో బంతికే జహీర్ అవుట్ చేసినా.. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ విశ్వరూపం చూపెట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డివిలియర్స్ కూడా వరుసగా ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డు సునామీలా కదిలింది. నాలుగు, ఐదు, ఆరు ఓవర్లలో 44 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో ఆర్సీబీ స్కోరు 63/1కు చేరుకుంది. ఈ దశలో స్పిన్నర్లు వచ్చినా.... ఈ జోడిని ఆడ్డుకోలేకపోయారు. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంతో పాటు ఓవర్‌కు ఓ ఫోర్ బాదడంతో తొలి 10 ఓవర్లలో బెంగళూరు 97 పరుగులు చేసింది. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన డివిలియర్స్‌ను 12వ ఓవర్లో బ్రాత్‌వైట్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 65 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన వాట్సన్ మరింత రెచ్చిపోయాడు. భారీ షాట్లతో కోహ్లితో పోటీపడటంతో మూడు ఓవర్ల (14, 15, 16)లోనే 50 పరుగులు సమకూరాయి. ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 30 బంతుల్లో 63 పరుగులు జత చేరాయి. అయితే 12 బంతుల తేడాలో వాట్సన్, సర్ఫరాజ్ (1), కోహ్లి అవుట్‌కావడం.... చివరి మూడు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే రావడంతో ఆర్సీబీ స్కోరు రెండొందలు దాటలేదు. అద్భుత భాగస్వామ్యం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ ఓపెనర్లలో శ్రేయస్ (0) విఫలమైనా.. రెండో ఎండ్‌లో డికాక్ ధాటిగా ఆడాడు. వరుసగా బౌండరీలు బాదుతూ రన్‌రేట్‌ను పెంచాడు. కానీ ఐదో ఓవర్లో శామ్సన్ (9) కూడా అవుట్ కావడంతో ఢిల్లీ 50 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చినా కరుణ్ నాయర్ జాగ్రత్తగా ఆడాడు. భారీ షాట్లకు పోకుండా డికాక్‌కు మంచి సహకారాన్ని అందించాడు. ఈ ఇద్దరి నిలకడతో ఢిల్లీ 10 ఓవర్లలో 93 పరుగులు చేసింది. ఈ క్రమంలో డికాక్ 22 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 14వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 20 పరుగులు రాబట్టగా, ఆ తర్వాతి ఓవర్లో మరో 10 పరుగులు సాధించారు. ఇక 30 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన దశలో ఈ ఇద్దరు భారీ షాట్లకు తెరలేపారు. నాయర్ ఓ ఫోర్, సిక్స్ బాదితే, డికాక్ రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో నాయర్ 36 బంతుల్లో అర్ధసెంచరీ; డికాక్ 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. ఆ తర్వాత డికాక్ మరో రెండు ఫోర్లు బాది అవుటయ్యాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 12.4 ఓవర్లలో 134 పరుగులు జోడించారు. 12 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో డుమిని (7 నాటౌట్) ఫోర్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) డుమిని (బి) జహీర్ 0; కోహ్లి (సి) అయ్యర్ (బి) షమీ 79; డివిలియర్స్ (సి) షమీ (బి) బ్రాత్‌వైట్ 55; వాట్సన్ (సి) మోరిస్ (బి) షమీ 33; సర్ఫరాజ్ రనౌట్ 1; కేదార్ జాదవ్ నాటౌట్ 9; వీస్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1-0; 2-107; 3-170; 4-172; 5-177. బౌలింగ్: జహీర్ 4-0-50-1; మోరిస్ 4-0-29-0; షమీ 4-0-34-2; నేగి 3-0-26-0; మిశ్రా 3-0-26-0; బ్రాత్‌వైట్ 2-0-18-1. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) జాదవ్ (బి) వాట్సన్ 108; శ్రేయస్ అయ్యర్ (సి) వీస్ (బి) అరవింద్ 0; శామ్సన్ (సి) చాహల్ (బి) వాట్సన్ 9; కరుణ్ నాయర్ నాటౌట్ 54; డుమిని నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-11; 2-50; 3-184. బౌలింగ్: అరవింద్ 3-0-32-1; రసూల్ 3-0-28-0; వాట్సన్ 4-0-25-2; చాహల్ 2.1-0-23-0; వీస్ 4-0-49-0; హర్షల్ పటేల్ 3-0-32-0. -
దుమ్మురేపిన డికాక్, ఢిల్లీ సంచలన విజయం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)9లో ఢిల్లీ డేర్ డెవిల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం రాత్రి ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ గెలుపొందింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్బుత సెంచరీ (108; 51 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు)కి తోడు కరుణ్ నాయర్ (54 నాటౌట్; 42 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించడంతో మరో 5 బంతులుండానే మ్యాచ్ ను ముగించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓ దశలో 220 పరుగులు చేసేలా కనిపించినా చివర్లో వికెట్లు కోల్పోవడంతో రెండొందల స్కోరు కూడా నమోదు కాలేదు. మూడు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ రెండు విజయాలు సాధించింది. బెంగళూరు బౌలర్లలో షేన్ వాట్సన్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. వాట్సన్ రెండు వికెట్లు పడగొట్టగా, అరవింద్ ఒక్క వికెట్ తీశాడు. బెంగళూరు ఇన్నింగ్స్: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ (79;48 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. మరోవైపు ఏబీ డివిలియర్స్(55;33 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో రాయల్ చాలెంజర్స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ క్రిస్ గేల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఏబీ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేసి ఢిల్లీ బౌలర్లు గుండెల్లో దడ పుట్టించాడు. ఈ క్రమంలోనే బెంగళూరు 10.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు సాధించింది. అయితే హాఫ్ సెంచరీకి మరో ఐదు పరుగులు మాత్రమే జోడించిన అనంతరం బ్రాత్ వైట్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత షేన్ వాట్సన్(33;19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఒకానొక దశలో బెంగళూరు 200 పైగా స్కోరు నమోదు చేస్తుందని భావించినా.. వాట్సన్, కోహ్లిలు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులకు మాత్రమే చేయకల్గింది.ఢిల్లీ బౌలర్లో మహ్మద్ షమీ రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, బ్రాత్ వైట్ లకు తలో వికెట్ దక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విరాట్(75;51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి బెంగళూరు విజయలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
కోహ్లి మళ్లీ ఇరగదీశాడు!
బెంగళూరు: మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇరగదీశాడు. ఐపీఎల్-9లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ (79;48 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. మరోవైపు ఏబీ డివిలియర్స్(55;33 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో రాయల్ చాలెంజర్స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ క్రిస్ గేల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆ తరుణంలో విరాట్ కు జత కలిసిన ఏబీ రెచ్చిపోయాడు. ఒకవైపు విరాట్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళుతుంటే, ఏబీ మాత్రం తన సహజసిద్ధమైన ఆటతో ధాటిగా ఆడాడు. ఏబీ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేసి ఢిల్లీ బౌలర్లు గుండెల్లో దడ పుట్టించాడు. ఈ క్రమంలోనే బెంగళూరు 10.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు సాధించింది. అయితే హాఫ్ సెంచరీకి మరో ఐదు పరుగులు మాత్రమే జోడించిన అనంతరం బ్రాత్ వైట్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత షేన్ వాట్సన్(33;19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఒకానొక దశలో బెంగళూరు 200 పైగా స్కోరు నమోదు చేస్తుందని భావించినా.. వాట్సన్, కోహ్లిలు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులకు మాత్రమే చేయకల్గింది.ఢిల్లీ బౌలర్లో మహ్మద్ షమీ రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, బ్రాత్ వైట్ లకు తలో వికెట్ దక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విరాట్(75;51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి బెంగళూరు విజయలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా ఆదివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగూళురుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత రాయల్ చాలెంజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన రాయల్ చాలెంజర్స్ అందులో విజయం సాధించగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడిన రెండింటిలో ఒక దాంట్లో ఓడి, మరొక మ్యాచ్‌లో గెలిచింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ , సర్పరాజ్ ఖాన్, కేదర్ జాదవ్‌లతో రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండగా, ఢిల్లీలో డీ కాక్, జేపీ డుమినీ, ఐయ్యర్, సంజూ శ్యాంసన్‌లు కీలకం కానున్నారు. -
అది సర్వ సాధారణం: జహీర్ ఖాన్
కోల్‌కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘోర పరాజయాన్ని ఆ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ లైట్‌గా తీసుకున్నాడు. ప్రతీ జట్టూ ఏదొక సందర్భాల్లో క్లిష్టపరిస్థితిని ఎదుర్కొనక తప్పదని, అలాంటి పరిస్థితినే తాము కూడా చవిచూశామన్నాడు. ఈ పరాజయం తమకు ఓ గుణపాఠంగా ఉపయోగపడుతుందన్నాడు. ఈ టోర్నీ ఇంకా ఆరంభ దశలో ఉండటంతో తమకు మంచి రోజులు మిగిలే ఉన్నాయని సంగతిని గుర్తించుకోవాలన్నాడు. ఒక మ్యాచ్‌లో ఓటమితోనే తమ పని ముగిసిపోయిందంటూ రాయడం ఎంతమాత్రం సరికాదని జహీర్ పేర్కొన్నాడు. ఆటలో గెలుపు, ఓటములు సర్వ సాధారణమని పేర్కొన్న జహీర్.. తమ కుర్రాళ్లు ఫీల్డ్‌లో చురుగ్గా కదిలిన తీరుతో సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తమది యువకులతో నిండిన జట్టు కాబట్టి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నాడు. నిన్నటి మ్యాచ్‌కు జేపీ డుమినీ అందుబాటులో లేని విషయాన్ని జహీర్ ఈ సందర్బంగా గుర్తు చేశాడు. -
అప్పుడు 14.. ఇప్పుడు 16 కోట్లు
-
అప్పుడు 14.. ఇప్పుడు 16 కోట్లు
బెంగళూరు: ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి సంచలనం సృష్టించాడు. తాజాగా సోమవారం ఐపీఎల్-8 వేలంలో యూవీని ఏకంగా రూ.16 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది. గతేడాది యువరాజ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈసారి అంతకంటే ఎక్కువ ధర పలికాడు ఈ ఆటగాడు. ఇక దినేష్ కార్తీక్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రూ.10కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతకు ముందు శ్రీలంక ఆటగాడు ఏంజిలో మాథ్యూస్‌ని రూ. 7.50 లక్షలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. మురళీ విజయ్‌ని రూ.౩ కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లాను 2కోట్ల రూపాయలు పలికాడు. ఇక కేన్ విలియమ్స్‌ను రూ.60 లక్షలకు హైదరాబాద్ దక్కించుకుంది. -
ఆఖరి మ్యాచ్‌లోనూ అదుర్స్
పంజాబ్‌కు 11వ విజయం రాణించిన మిల్లర్, వోహ్రా పీటర్సన్ శ్రమ వృథా ఢిల్లీకి తప్పని మరో ఓటమి మొహాలీ: ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసి విజయంతో లీగ్ దశను ముగించింది. దీంతో కీలకమైన నాకౌట్‌కు ముందు జట్టులో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. పీటర్సన్ (41 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. దినేశ్ కార్తీక్ (13), నీషమ్ (12) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కార్తీక్, పీటర్సన్ రెండో వికెట్‌కు 31 పరుగులు జోడించడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 3 వికెట్లకు 44 పరుగులు చేసింది. తర్వాతి వరుస బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా ఢిల్లీ 24 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. అవానా, పటేల్, జాన్సన్, కరణ్వీర్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత పంజాబ్ 13.5 ఓవర్లలో 3 వికెట్లకు 119 పరుగులు చేసి గెలిచింది. వోహ్రా (38 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిల్లర్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. సెహ్వాగ్ (9) విఫలమయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను వోహ్రా, మిల్లర్ మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించి విజయపథంలో నిలబెట్టారు. షమీ, ఉనాద్కట్, తాహిర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. వోహ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పీటర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ధావన్ 58; అగర్వాల్ (సి) సెహ్వాగ్ (బి) జాన్సన్ 2; కార్తీక్ (సి) పటేల్ (బి) అవానా 13; జాదవ్ (సి) వోహ్రా (బి) అవానా 0; తివారీ రనౌట్ 8; డుమిని (సి) పటేల్ (బి) కరణ్వీర్ 8; నీషమ్ (సి) బెయిలీ (బి) కరణ్వీర్ 12; నదీమ్ నాటౌట్ 3; షమీ (బి) పటేల్ 0; తాహిర్ (సి) ధావన్ (బి) పటేల్ 4; ఉనాద్కట్ (సి) మాక్స్వెల్ (బి) జాన్సన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (18.1 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1-13; 2-44; 3-44; 4-67; 5-91; 6-93; 7-110; 8-111; 9-115; 10-115 బౌలింగ్: అవానా 3-1-15-2; అక్షర్ పటేల్ 4-0-28-2; జాన్సన్ 3.1-0-27-2; కరణ్వీర్ 4-0-22-2; రిషీ ధావన్ 4-0-22-1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) కార్తీక్ (బి) షమీ 9; వోహ్రా (బి) తాహిర్ 47; మాక్స్వెల్ (సి) పీటర్సన్ (బి) ఉనాద్కట్ 0; మిల్లర్ నాటౌట్ 47; బెయిలీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (13.5 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1-13; 2-16; 3-112 బౌలింగ్: షమీ 3-0-26-1; ఉనాద్కట్ 2-0-3-1; నీషమ్ 1-0-14-0; డుమిని 2-0-15-0; తాహిర్ 3.5-0-32-1; నదీమ్ 2-0-24-0. -
ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
మొహాలీ: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తన చివరి లీగ్ మ్యాచ్ ను విజయం ముగించింది. ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విసిరిన 116 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఆటగాళ్లు కేవలం 13.5 ఓవర్లలో ఛేదించారు. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(9) పరుగులు చేసి విఫలమైనప్పటికీ, వాహ్రా (47) పరుగుల చేసి జట్టు గెలుపుకు చక్కటి పునాది వేశాడు.అనంతరం మ్యాక్స్ వెల్ (0)కే పెవిలియన్ చేరినా, మిల్లర్ (47) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోని అగర్వాల్ వికెట్టును కోల్పోయింది. కాగా మరో ఓపెనర్, కెప్టెన్ పీటర్ సన్(58) బాధ్యాతయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. అనంతరం దినేష్ కార్తీక్(13), నిషామ్ (12) పరుగుల మినహా ఎవరూ రెండెంకల స్కోరును దాటకపోవడంతో ఢి్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో అవానా, మన్వీర్ సింగ్, జాన్సన్, పటేల్ కు తలో రెండు వికెట్లు దక్కాయి. -
పంజాబ్ కింగ్స్ విజయలక్ష్యం 116
మొహాలీ: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోని అగర్వాల్ వికెట్టును కోల్పోయింది. కాగా మరో ఓపెనర్, కెప్టెన్ పీటర్ సన్(58) బాధ్యాతయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. అనంతరం దినేష్ కార్తీక్(13), నిషామ్ (12) పరుగుల మినహా ఎవరూ రెండెంకల స్కోరును దాటకపోవడంతో ఢి్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో అవానా, మన్వీర్ సింగ్, జాన్సన్, పటేల్ కు తలో రెండు వికెట్లు దక్కాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న పంజాబ్.. ప్లే ఆఫ్ దశలో రెండో స్థానంలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. -
రాజస్థాన్ రాజసం
ఐపీఎల్-7లో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌ల్లో మరొకటి చేరింది. ఈసారి కూడా అందులో ఢిల్లీ పాత్ర ఉంది. రాజస్థాన్ సమష్టి ప్రదర్శనతో రెండొందలకు పైగా స్కోరు చేస్తే...పది ఓవర్లు ముగిసే సరికే ఢిల్లీ చేతులెత్తేసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించినా ఆ జట్టు ఆటతీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. మరో వైపు భారీ విజయంతో రాజస్థాన్ తమ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగు పర్చుకుంది. అహ్మదాబాద్: ఐపీఎల్ మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ దశకు మరింత చేరువైంది. బ్యాటింగ్‌లో రహానే (50 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్), శామ్సన్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా.. బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 62 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. గురువారం అహ్మదాబాద్‌లోని మొతేరాలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. రహానే, శామ్సన్తో పాటు కూపర్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (8 బంతుల్లో 23 నాటౌట్; 3 సిక్స్‌లు) రాణించారు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. మనోజ్ తివారి (44 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రహానే, శామ్సన్ మెరుపులు కెప్టెన్ షేన్ వాట్సన్ తుది జట్టులో లేకుండానే బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు రహానే, కరుణ్ నాయర్ శుభారంభాన్ని ఇచ్చారు. ఢిల్లీ బౌలర్లపై మొదటినుంచి వీరు ఆధిక్యం ప్రదర్శించడంతో పవర్ ప్లేలో స్కోరు 52 పరుగులకు చేరింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెవాన్ కూపర్ ఉన్నంతసేపు దడదడలాడించాడు. రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టి జోరుమీదున్న కూపర్ (32)ను డుమిని వెనక్కిపంపాడు. కూపర్ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన సంజు శామ్సన్ జట్టు స్కోరును పెంచే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. కౌల్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రాజస్థాన్ స్కోరు 150 పరుగులు దాటిన తర్వాత రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మరింతగా విజృంభించారు. స్కోరు పెంచే ప్రయత్నంలో రహానే(64) అవుటయ్యాడు. మూడో వికెట్‌కు శామ్సన్తో కలిసి రహానే 74 పరుగులు జోడించారు. చివర్లో ఫాల్క్‌నర్ (23 నాటౌట్) విజృంభించడంతో రాయల్స్ స్కోరు రెండొందలు దాటింది. చివరి ఐదు ఓవర్లలో రాజస్థాన్ 60 పరుగులు రాబట్టింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యం లక్ష్యఛేదనను ధాటిగా ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మూడో ఓవర్లోనే తొలి వికెట్ చేజార్చుకుంది. వ్యక్తిగత స్కోరు 4 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అగర్వాల్ (17) ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కార్తీక్ (3) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. జట్టు స్కోరు నెమ్మదించడంతో ఢిల్లీ పవర్ ప్లేలో 34 పరుగులు మాత్రమే చేసింది. డుమిని (8)ని తాంబే వెనక్కి పంపగా... భాటియా వరుస ఓవర్లలో పీటర్సన్ (13), టేలర్ (4)లను అవుట్ చేశాడు. దీంతో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆ తర్వాత ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఇక 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మనోజ్ తివారి ధాటిగా బ్యాటింగ్ చేసినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ జాదవ్ (3), నదీమ్ (1), తాహిర్ (4), శుక్లా (14) విఫలమయ్యారు. ఫలితంగా వరుసగా ఆరో ఓటమి తప్పలేదు. పీటర్సన్...రనౌట్ కథ! రనౌట్‌లో కూడా నాటౌట్‌గా మిగలడం ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్కే సాధ్యమేమో...ఈ సారి ఐపీఎల్లో ఒకటి కాదు రెండు సార్లు, అదీ రాజస్థాన్‌తో మ్యాచుల్లోనే ఇది చోటు చేసుకోవడం విశేషం. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో కార్తీక్ షాట్ ఆడగా పీటర్సన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే పాయింట్ స్థానంనుంచి ఉన్ముక్త్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకింది. అయితే పీటర్సన్ క్రీజ్‌లోకి చేరుకున్నాడని భావించిన రాజస్థాన్ పెద్దగా అప్పీలు చేయలేదు. దాంతో అంపైర్లూ పట్టించుకోలేదు. అయితే రీప్లేలో చూస్తే కెవిన్ ఖచ్చితంగా అవుటే! అతని బ్యాట్ క్రీజ్‌కు కాస్త బయటే ఉండిపోయింది. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో కేపీ బతికిపోయాడు. రాజస్థాన్‌తోనే జరిగిన గత మ్యాచ్‌లో కూడా పీటర్సన్ రనౌట్ అయినట్లు స్పష్టంగా కనిపించినా ఫీల్డ్ అంపైర్ రీప్లే కోరకపోవడంతో నాటౌట్‌గా మిగిలాడు. దీనిపై జట్టు కెప్టెన్ వాట్సన్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఆ తర్వాత అంపైర్ సంజయ్ హజారేను లీగ్‌నుంచి సస్పెండ్ చేశారు. అయితే రెండు సార్లు రనౌట్ అయి కూడా నాటౌట్‌గా ప్రకటించుకోగలగడం పీటర్సన్‌ను కూడా ఆశ్చర్యపరచి ఉంటుంది. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (బి) నదీమ్ 64; నాయర్ ఎల్బీడబ్ల్యూ (బి) నదీమ్ 19; కూపర్ (సి) శుక్లా (బి) డుమిని 32; శామ్సన్ (సి) జాదవ్ (బి) తాహిర్ 40; స్టువర్ట్ బిన్ని (స్టంప్డ్) కార్తీక్ (బి) తాహిర్ 0; కటింగ్ రనౌట్ 8; ఫాల్క్‌నర్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) : 201. వికెట్ల పతనం: 1-44; 2-93; 3-167; 4-168; 5-169; 6-201. బౌలింగ్: డుమిని 3-0-25-1; రాహుల్ శుక్లా 4-0-44-0; కౌల్ 3-0-34-0; నదీమ్ 4-0-35-2; తాహిర్ 4-0-25-2; మనోజ్ తివారి 2-0-28-0. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పీటర్సన్ (బి) భాటియా 13; అగర్వాల్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 17; కార్తీక్ (సి) కటింగ్ (బి) కులకర్ణి 3; డుమిని (సి) నాయర్ (బి) తాంబే 8; తివారి నాటౌట్ 61; రాస్ టేలర్ (సి) అండ్(బి) భాటియా 4; జాదవ్ రనౌట్ 3; నదీమ్ (బి) కటింగ్ 1; తాహిర్ (బి) బిన్ని 4; శుక్లా (సి) స్మిత్ (బి) కూపర్ 14; కౌల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం ( 20 ఓవర్లలో 9 వికెట్లకు) : 139. వికెట్ల పతనం: 1-19; 2-30; 3-43; 4-48; 5-58; 6-75; 7-86; 8-91; 9-120. బౌలింగ్: కులకర్ణి 4-1-24-1; కటింగ్ 4-0-31-1; ఫాల్క్‌నర్ 1-0-6-1; కూపర్ 3-0-19-1; తాంబే 3-0-24-1; భాటియా 3-0-18-2; బిన్ని 2-0-14-1. -
ఐపీఎల్-7: సన్ రైజర్స్ విజయం
ఐపీఎల్-7లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఎనిమిది వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విజయం సాధించింది. 5 ఓవర్లలో 43 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మరో నాలుగు బంతులు మిగిలుండగా గెలుపొందింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని పలుమార్లు కుదించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 143 పరుగులు సాధించింది. దినేష్ కార్తీక్ 39, పీటర్సన్ 35, అగర్వాల్ 25, లక్ష్మీ శుక్లా 21 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లు స్టెయిన్, అమిత్ మిశ్రా, హెన్రిక్స్ రెండేసి వికెట్లు తీశారు. కాగా ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 103 పరుగుల స్కోరుతో ఉన్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తెరిపి ఇచ్చాక మళ్లీ మ్యాచ్ కొనసాగించారు. -
హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా భారీ వర్షం ప్రారంభం కావడంతో ఆట ఆగిపోయింది. వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ కొనసాగించనున్నారు. భారీ వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ జరుగుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆట నిలిచేపోయే సమయానికి ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్(17), శుక్లా(14) క్రీజ్‌లో ఉన్నారు. పీటర్సన్ 35, అగర్వాల్ 25, డీకాక్ 7 పరుగులు చేసి అవుటయ్యారు. అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశాడు. స్టెయిన్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తప్పనిసరిగా నెగ్గాలి.