ఢిల్లీ విజయ లక్ష్యం 147 | sunrisers hyderabad match with delhi dare devils in hyderabad | Sakshi
Sakshi News home page

ఢిల్లీ విజయ లక్ష్యం 147

Published Thu, May 12 2016 9:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

ఢిల్లీ విజయ లక్ష్యం 147

ఢిల్లీ విజయ లక్ష్యం 147

హైదరాబాద్: ఐపీఎల్-9లో భాగంగా గురువారమిక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 46 పరుగులు), శిఖర్ దావన్(37 బంతుల్లో 34 పరుగులు) రాణించడంతో సన్రైజర్స్ జట్టుకు శుభారంభం లభించింది. అయితే విలియం సన్(24 బంతుల్లో 27 పరుగులు) తప్ప మిగతా టాపార్డర్ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు.

యువరాజ్ సింగ్(8 బంతుల్లో 8 పరుగులు) అమిత్ మిశ్రా బౌలింగ్లో సిక్స్ బాది మంచి ఫాంలో ఉన్నట్లు కనిపించినా.. అదే ఓవర్లో సునాయాసమైన బంతికి వెనుదిరిగాడు. ఆ వెంటనే షమీ బౌలింగ్లో హెన్రిక్స్ డకౌట్గా వెనుదిరగడంతో సన్రైజర్స్ కష్టాల్లో పడింది. చివర్లో ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు తోడు సన్రైజర్స్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. డేర్ డెవిల్స్ బౌలర్లలో అమిత్ మిశ్రా, కౌల్టర్ నైల్లకు రెండేసి వికెట్లు దక్కగా యాదవ్, షమీ, మోరిస్లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement