అమిత్ మిశ్రాకు మందలింపు | Amit Mishra reprimanded for using abusive language | Sakshi
Sakshi News home page

అమిత్ మిశ్రాకు మందలింపు

Published Sun, May 1 2016 5:19 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

అమిత్ మిశ్రాకు మందలింపు

అమిత్ మిశ్రాకు మందలింపు

ఢిల్లీ:ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాచ్ రిఫరీ హెచ్చరికకు గురయ్యాడు. శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో అమిత్ మిశ్రా దురుసుగా ప్రవర్తించడంతో అతన్ని మ్యాచ్ రిఫరీ మందలించాడు. కోల్ కతా ఆటగాడు ఆండ్రీ రస్సెల్ వికెట్ తీసిన అనంతరం అతనిపై నేరుగా మిశ్రా అసభ్యపదజాలం ప్రయోగించాడు.

 

ఐపీఎల్ కోడ్ ఆర్టికల్ 2.1.4 ప్రకారం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో మిశ్రా మందలింపుకు గురయ్యాడు. ఇది లెవల్-1 ఉల్లంఘన కావడంతోపాటు, మొదటి తప్పు కావడంతో మిశ్రాను హెచ్చరించి వదిలేశారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 27 పరుగుల తేడాతో కోల్ కతాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement