అప్పుడు 14.. ఇప్పుడు 16 కోట్లు
బెంగళూరు: ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి సంచలనం సృష్టించాడు. తాజాగా సోమవారం ఐపీఎల్-8 వేలంలో యూవీని ఏకంగా రూ.16 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది. గతేడాది యువరాజ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈసారి అంతకంటే ఎక్కువ ధర పలికాడు ఈ ఆటగాడు.
ఇక దినేష్ కార్తీక్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రూ.10కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతకు ముందు శ్రీలంక ఆటగాడు ఏంజిలో మాథ్యూస్‌ని రూ. 7.50 లక్షలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. మురళీ విజయ్‌ని రూ.౩ కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లాను 2కోట్ల రూపాయలు పలికాడు. ఇక కేన్ విలియమ్స్‌ను రూ.60 లక్షలకు హైదరాబాద్ దక్కించుకుంది.