IPL-T20
-
ఐపీఎల్ పండగ
ఆతిథ్యమివ్వనున్న విశాఖ నగరం మూడు మ్యాచులకు వేదిక సిద్ధమవుతున్న వైఎస్సార్ స్టేడియం విశాఖపట్నం: ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభం కానుంది. ఇందులో విశాఖ నగరం తనవంతు పాత్ర పోషించనుంది. ఐపిఎల్ టీ20 మూడు మ్యాచులకు వేదిక కానుంది. రానున్న సీజన్లోనే తొలి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వైఎస్ఆర్ స్టేడియానికి అప్పుడే పండుగ కళ వచ్చేసింది. అటు ప్రపంచకప్ పోటీలు ఊపందుకుంటుంటే విశాఖ ఐపిఎల్‌కు రెడీ అవుతోంది. వన్డేల్లో ఆతిథ్యజట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగా పేరుపడ్డ వైఎస్ఆర్ ఏసిఏవీడీసీఏ స్టేడియంలో ఐపిఎల్‌కు మరోమారు వేదికగా నిలవనుంది. గతంలో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీ హోదాలో రెండు ఐపిఎల్ మ్యాచ్ లాడగా ఈసారి స్దానిక ఫ్రాంచైజీ హోదాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్ని ఆడనుంది. ఏప్రిల్ 8 నుంచి మే 24వరకు జరిగే ఈ సీజన్లో మొత్తంగా 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎనిమిది జట్లు డబుల్ రౌండ్ రాబిన్ తర్వాత పాటు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. కెప్టెన్‌గా శిఖర్ ధావన్... ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో శిఖర్ ధావన్‌తో పాటు మరో పదముగ్గుర్ని స్దానిక ఫ్రాంచైజి తిరిగి సొంతం చేసుకోగా పదకొండు మంది ఆటగాళ్ళను వదులుకుంది. స్థానిక అంతర్జాతీయ ఆటగాడు వేణుగోపాలరావుని వదులుకోగా రికీబుయ్‌ను జట్టుకు తీసుకుంది. శిఖర్ ధావన్ జట్టుకు నాయకత్వం వహించనుండగా డేల్ స్టెయిన్, భువనేశ్వర్‌లు జట్టుకు ఆడనున్నారు. లక్ష్మణ్ పర్యవేక్షణ సన్‌రైజర్స్ జట్టును వివిఎస్ లక్ష్మణ్ మెంటర్‌గా పర్యవేక్షించనుండగా మాజీ డాషింగ్ బాట్స్మెన్ శ్రీకాంత్ సహకరించనున్నాడు. ప్రధాన కోచ్‌గా టామ్ మూడీ సేవలందిచనుండగా అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ముత్తయ్యమురళీదరన్ బౌలింగ్ కోచ్‌గా విశాఖ రానున్నారు. జట్టు సభ్యులు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, మోర్గాన్, కేవిన్ పీటర్సన్, హనుమ విహారీ, కరణ్ శర్మ, లక్ష్మిశుక్లా, మోసెస్ హెరిక్, పద్మనాభన్ ప్రశాంత్, పర్వేజ్ రసూల్, రికీబుయ్ బ్యాట్ ఝళిపించనున్నారు. డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మ, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్, చమా మిలింద్, ప్రవీణ్‌కుమార్, రవిబొపారా, ఆశిష్‌రెడ్డి,సిద్దార్దకౌల్ బంతితో చెలరేగిపోనున్నారు. నమన్ ఓజాతోపాటు లోకేష్ రాహుల్ వికెట్ల వెనుక నిలవనున్నారు. ఇవీ మ్యాచ్‌లు... గతంలో విశాఖ వేదికగా 2012లో డెక్కన్ చార్జర్స్‌తో చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబయ్ ఇండియన్స్ జట్లు ఆడగా ఈసారి సన్‌రైజర్స్‌తో రాజస్థాన్, ఢిల్లీ,కోల్‌కతా జట్లు ఆడనున్నాయి. ఏప్రిల్- 16న రాజస్థాన్ రాయల్స్‌తో రాత్రి 8గంటలకు ఏప్రిల్- 18న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో సాయంత్రం నాలుగు గంటలకు ఏప్రిల్ -22న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సాయంత్రం నాలుగు గంటలకు -
జాక్‌పాట్!
ఐపీఎల్ వేలం వజ్రం ఎప్పటికీ విలువైనదే... వన్నె తగ్గినా దాని ధర పెరుగుతుంది తప్ప తగ్గదు... క్రికెటర్ యువరాజ్ సింగ్ విషయంలో ఇది అక్షరాలా మరోసారి రుజువైంది. ప్రపంచకప్ ఆడటానికి పనికిరావు పొమ్మన్నారు... నీకు రూ.14 కోట్లెందుకు అని వదిలేశారు. కానీ క్రికెట్ ప్రపంచంలో తన విలువ అంతకంతకు పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి ఏకంగా ఏడాదికి 16 కోట్ల రూపాయలు... వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువరాజ్‌కు ఇచ్చిన ధర ఇది. ఇది అలాంటిలాంటిది కాదు... జాక్ పాట్... క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికీ ఒక్క సీజన్‌కు దక్కని మొత్తాన్ని ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ సొంతం చేసుకోబోతున్నాడు.. బెంగళూరు: జాతీయ జట్టుకు దూరమైనా... ఫామ్‌లో లేకపోయినా.. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు డబ్బుల వర్షం కురిపించాయి. సోమవారం జరిగిన ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ కనీవినీ ఎరుగని రీతిలో రూ. 16 కోట్లకు యువీని కొనుగోలు చేసింది. గతంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఈ పంజాబ్ ప్లేయర్‌ను రూ. 14 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్లో రెండో అత్యధిక ధర పలికిన దినేశ్ కార్తీక్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 10.5 కోట్లకు దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి అతనికి రూ. 1.5 కోట్ల తక్కువ ధర పలికింది. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు కూడా ఊహించని రీతిలో ధర పలికింది. గత సీజన్లో ఎవరూ తీసుకోని మాథ్యూస్‌ను... ఈసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. రోజంతా జరిగిన ఈ వేలంలో మొత్తం 343 మంది ఆటగాళ్లు పాల్గొనగా, 67 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. అందులో 23 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అయితే చాలా మంది స్టార్ ఆటగాళ్లకు ఈ వేలంలో నిరాశే ఎదురైంది. కరియప్ప బన్‌గయా కరోడ్‌పతి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో వీడియో విశ్లేషకుడిగా పని చేస్తున్న కేసీ కరియప్ప ఈ వేలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌కు చెందిన ఈ స్పిన్నర్‌ను కోల్‌కతా రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతని కోసం ఫ్రాంచైజీలు బాగానే పోటీపడ్డాయి. హుబ్లీకి చెందిన 20 ఏళ్ల కరియప్ప కోసం ఢిల్లీ కూడా బాగానే పోరాడింది. బీజాపూర్ బుల్స్‌కు చెందిన అతను ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. గత ఏడాది చాంపియన్స్ లీగ్‌కు ముందు నెట్స్‌లో కరియప్ప కోల్‌కతా ఆటగాళ్లకు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తన నైపుణ్యాన్ని కలిస్ గుర్తించి ఈ సీజన్‌కు తీసుకోవాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. దీంతో కరియప్ప పంట పండింది. యువరాజ్‌కు రూ. 16 కోట్లు రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన యువరాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు యువీ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే బిడ్డింగ్ రూ. 7 కోట్లకు చేరుకున్న తర్వాత రాజస్థాన్, పంజాబ్‌లు వెనక్కి తగ్గాయి. ఇక ఢిల్లీ, బెంగళూరు విపరీతంగా ధరను పెంచుకుంటూ పోయాయి. చివరకు ఢిల్లీ... యువీని రికార్డు స్థాయి రేట్‌తో సొంతం చేసుకుంది. 2014: రూ.2.6 కోట్లు 2015: రూ. 4 కోట్లు జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌ను తొలి రౌండ్లో ఎవరూ కొనలేదు. దీంతో ఈ ఇద్దర్ని రెండో రౌండ్లో మళ్లీ వేలానికి పెట్టారు. జహీర్‌కు ఢిల్లీ రూ. 4 కోట్లు వెచ్చించగా, ఇర్ఫాన్‌ను చెన్నై రూ. 1.5 కోట్లకు తీసుకుంది. గత సీజన్లో ఇర్ఫాన్ రూ. 2.6 కోట్లకు అమ్ముడుపోయాడు. ⇒ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్‌కు ఈ వేలం నిరాశపర్చింది. గత వేలంలో ఢిల్లీ రూ. 9 కోట్లకు కొనుగోలు చేయగా, ఈసారి హైదరాబాద్ ⇒కనీస ధర రూ. 2 కోట్లకే ఎగరేసుకుపోయింది. ⇒గత సీజన్లో రూ.4.75 కోట్లకు అమ్ముడుపోయిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను ఈసారి ఢిల్లీ రూ. 3.5 కోట్లకే దక్కించుకుంది. ⇒రూ.50 లక్షల కనీస ధర ఉన్న మురళీ విజయ్‌ని పంజాబ్ రూ. 3 కోట్లకు తీసుకుంది. ⇒ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు ముంబై ఇండియన్స్ రూ. 3.2 కోట్లు వెచ్చించింది. ⇒ఆల్‌రౌండర్ డారెన్ స్యామీ (రూ.2.8 కోట్లు), దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ వీస్ (రూ. 2.8 కోట్లు)లను బెంగళూరు తీసుకుంది. ⇒ఫిల్ హ్యూజ్ మరణానికి కారణమైన బంతి వేసిన ఆసీస్ పేసర్ సీన్ అబాట్‌ను బెంగళూరు కోటి రూపాయలకు తీసుకుంది. ⇒ఆసీస్ వెటరన్ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీని కనీస ధర రూ. 1.5 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. గత సీజన్లో అతని ధర రూ. 5 కోట్లు. ⇒గత వేలంలో హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కోసం రూ. 3.25 కోట్లు వెచ్చించిన ముంబై ఇండియన్స్ ఈసారి తెలివిగా వ్యవహరించింది. కేవలం రూ. 50 లక్షలకే అతన్ని సొంతం చేసుకుంది. ⇒భారత సంతతికి చెందిన ఆసీస్ పేసర్ గురీం దర్ సంధూని రూ.1.7 కోట్లకు, జైదేవ్ ఉనాద్కట్ని రూ.1.1 కోట్లకు ఢిల్లీ చేజిక్కించుకుంది. ⇒మునాఫ్ పటేల్, చతేశ్వర్ పుజారా, పంకజ్ సింగ్‌లను ఎవరూ కొనలేదు. ⇒సంగక్కరను మూడుసార్లు వేలానికి తెచ్చినా ఎవరూ ఆసక్తి చూపలేదు. జయవర్ధనే, దిల్షాన్ (శ్రీలంక), హషీమ్ ఆమ్లా, అలెక్స్ హేల్స్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్, రోంచి (న్యూజిలాండ్), బ్రాడ్ హాడ్జ్, కామెరూన్ వైట్ (ఆస్ట్రేలియా), శామ్యూల్స్ (విండీస్) లను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. ⇒ ప్రముఖ వ్యాపారవేత్తలు నీతా అంబానీ, విజయ్ మాల్యా, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా, మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అనిల్ కుంబ్లే, రికీ పాంటింగ్, ఫ్లెమింగ్, లక్ష్మణ్‌లు తమ ఫ్రాంచైజీల తరఫున హాజరయ్యారు. అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 87.6 కోట్లు ఖర్చు చేశాయి. ఆచితూచి వ్యవహరించిన ‘సన్’ స్టార్లపై కాకుండా ఈసారి మామూలు స్థాయి ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇంగ్లండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ (రూ. 2 కోట్లు)ను కనీస ధరకు తీసుకుంది. బెంగళూరు, ముంబైల నుంచి గట్టిపోటీ ఎదుర్కొని కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 3.8 కోట్లకు దక్కించుకున్న సన్‌రైజర్స్.. ఇయాన్ మోర్గాన్ కోసం రూ. 1.5 కోట్లు వెచ్చించింది. కేన్ విలియమ్సన్‌ను కేవలం రూ. 60 లక్షలకే చేజిక్కించుకుంది. బౌలింగ్ బలోపేతం కోసం పేసర్ ప్రవీణ్ కుమార్‌కు రూ. 2.20 కోట్లు, రవి బొపారాకు కోటి రూపాయలు ఖర్చు చేసింది. గత వేలంలో కోటిన్నర పలికిన లక్ష్మీరతన్ శుక్లాను చాలా తక్కువగా రూ. 30 లక్షలకు తీసుకుంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ హనుమ విహారి, ప్రశాంత్, సిద్ధార్థ్ కౌల్‌లకు తలా రూ 10లక్షలు వెచ్చించింది. కరియప్ప బన్‌గయా కరోడ్‌పతి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో వీడియో విశ్లేషకుడిగా పని చేస్తున్న కేసీ కరియప్ప ఈ వేలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌కు చెందిన ఈ స్పిన్నర్‌ను కోల్‌కతా రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతని కోసం ఫ్రాంచైజీలు బాగానే పోటీపడ్డాయి. హుబ్లీకి చెందిన 20 ఏళ్ల కరియప్ప కోసం ఢిల్లీ కూడా బాగానే పోరాడింది. బీజాపూర్ బుల్స్‌కు చెందిన అతను ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. గత ఏడాది చాంపియన్స్ లీగ్‌కు ముందు నెట్స్‌లో కరియప్ప కోల్‌కతా ఆటగాళ్లకు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తన నైపుణ్యాన్ని కలిస్ గుర్తించి ఈ సీజన్‌కు తీసుకోవాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. దీంతో కరియప్ప పంట పండింది. -
16కోట్లు పలికిన యువరాజ్
ఐపీఎల్ వేలంలో కోసం రికార్డు మొత్తం వెచ్చించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రపంచకప్‌లో చోటు దక్కకపోయినా... ఐపీఎల్లో మాత్రం యువరాజ్‌కు ‘రేటు’ పెరిగింది. గత ఏడాది రూ.14 కోట్లకు తీసుకున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్... తమకు భారమయ్యాడంటూ ఈ ఏడాది తప్పించింది. దీంతో సోమవారం బెంగళూరులో జరిగిన వేలంలోకి యువీ వచ్చాడు. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్-8 సీజన్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రికార్డు స్థాయిలో రూ.16 కోట్లు పెట్టి యువీని కొనుక్కుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌కు ఒక ఆటగాడికి ఇంత మొత్తం లభించడం ఇదే తొలిసారి. ఈ వేలంలో దినేశ్ కార్తీక్, శ్రీలంక ఆల్‌రౌండర్ మాథ్యూస్‌లకు కూడా భారీ మొత్తాలు లభించాయి. ధోని వల్లే చోటు దక్కలేదు: యువీ తండ్రి ప్రపంచకప్‌కు భారత జట్టులో యువరాజ్‌కు స్థానం దక్కకపోవడానికి కెప్టెన్ ధోనియే కారణమని... యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఆరోపించారు. ‘ప్రపంచంలోనే యువీ అత్యుత్తమ ఆల్‌రౌండర్ కాబట్టే ఐపీఎల్లో భారీగా డబ్బు ఇస్తున్నారు. అయితే ధోనికి యువీ అంటే ఇష్టం లేనందునే జట్టులోకి రానీయలేదు’ అని ఆయన ధ్వజమెత్తారు. అయితే దీనిని యువీ వెంటనే తోసిపుచ్చాడు. తనకు, ధోనికి సంబంధాలు బాగున్నాయని చెప్పాడు. -
వేలంలో అమ్ముడుపోని టాప్ బ్యాట్స్ మన్
బెంగళూరు: ఇండిన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో వరల్డ్ టాప్ ర్యాంకింగ్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లాను ఎవరూ కొనలేదు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్న ఆమ్లాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఆమ్లా ప్రాథమిక ధరను రూ. 2 కోట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం తమ జట్టు తరపున వన్డే ప్రపంచకప్ ఆడుతున్న ఆమ్లా ఇప్పటివరకు 108 వన్డేలు ఆడాడు. అతడి బ్యాటింగ్ సగటు 55.93 గా ఉంది. 19 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 153. అయితే టి20ల్లో అతడి రికార్డు అంత ఘనంగా లేదు. 26 టి20 మ్యాచ్ లు ఆడిన ఆమ్లా 25 సగటుతో 600 పరుగులు చేశాడు. -
అప్పుడు 14.. ఇప్పుడు 16 కోట్లు
బెంగళూరు: ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి సంచలనం సృష్టించాడు. తాజాగా సోమవారం ఐపీఎల్-8 వేలంలో యూవీని ఏకంగా రూ.16 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది. గతేడాది యువరాజ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈసారి అంతకంటే ఎక్కువ ధర పలికాడు ఈ ఆటగాడు. ఇక దినేష్ కార్తీక్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రూ.10కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతకు ముందు శ్రీలంక ఆటగాడు ఏంజిలో మాథ్యూస్‌ని రూ. 7.50 లక్షలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. మురళీ విజయ్‌ని రూ.౩ కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లాను 2కోట్ల రూపాయలు పలికాడు. ఇక కేన్ విలియమ్స్‌ను రూ.60 లక్షలకు హైదరాబాద్ దక్కించుకుంది. -
వైజాగ్‌లో 3 ఐపీఎల్ మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2015 షెడ్యూల్‌ను విడుదల చేశారు. 47 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో సహా మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. విశాఖపట్నం మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్‌లు ఈ వేదికపై జరగనున్నాయి. ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 8న ఆరంభంకానుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. దేశవ్యాప్తంగా పలు వేదికలపై ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. -
ఏప్రిల్ 8న ఐపీఎల్ 2015 ప్రారంభం
న్యూఢిల్లీ: ఈ వేసవి అంతా క్రికెట్ అభిమానులకు కనువిందే. వన్డే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2015 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. ఈ సిజన్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ అన్ని మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో ఆడనుంది. -
యువరాజ్ కనీస ధర రూ. 2 కోట్లు
ముంబై: ఐపీఎల్-8 కోసం ఫిబ్రవరి 16న బెంగళూరులో వేలం నిర్వహించనున్నారు. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ వేలంలో తన కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు. కెవిన్ పీటర్సన్, దినేశ్ కార్తీక్‌లతో పాటు గతంలో ఎన్నడూ ఐపీఎల్ ఆడని హషీం ఆమ్లా కూడా రూ. 2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నాడు. ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, మైక్ హస్సీ, మాథ్యూస్, దిల్షాన్, శామ్యూల్స్, వైట్ తమ కనీస ధరను రూ. 1.50 కోట్లుగా పెట్టుకున్నారు. ఆరోన్ ఫించ్, రవి బొపారా, జహీర్‌ఖాన్‌లు తమ కనీస ధరను రూ. 1 కోటిగా నిర్ణయించుకోగా, మురళీ విజయ్ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంకు సిద్ధమయ్యాడు. ఆటగాళ్ల విడుదల అనంతరం ప్రస్తుతం అత్యధికంగా బెంగళూరు వద్ద రూ. 21 కోట్లు, అత్యల్పంగా చెన్నై వద్ద రూ. 5 కోట్లు ఉన్నాయి. అయితే గత సీజన్లో వేలం కోసం ఫ్రాంచైజీలకు గరిష్టం గా అనుమతించిన మొత్తాన్ని మరో రూ. 3 కోట్లు పెంచుతూ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడంతో జట్లకు వెసులుబాటు కలగనుంది. -
మూడో వారంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల వర్క్‌షాప్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం ఈనెల మూడో వారంలో ఓ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఫ్రాంచైజీల యజమానులతో పాటు సీఈఓలు హాజరుకానున్న ఈ సమావేశానికి ఐపీఎల్-8 వేలానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించనున్నారు. ‘ఢిల్లీలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని అనధికారికంగా ఫ్రాంచైజీలకు చెప్పాం. చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ల భవితవ్యంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ రెండు ఫ్రాంచైజీలు ఆందోళనలో ఉన్నాయి. వేలానికి ముందు యజమానులతో చర్చించడం పరిపాటి. కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు తెలిపారు. మొదట్లో ఈ సమావేశాన్ని దుబాయ్‌లో నిర్వహించాలనుకున్నా... గతంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ల మాదిరిగా ఉండొద్దనే భావనతో ఇక్కడే ఏర్పాటు చేశారు.