వేలంలో అమ్ముడుపోని టాప్ బ్యాట్స్ మన్ | No takers for Hashim Amla in IPL auction | Sakshi
Sakshi News home page

వేలంలో అమ్ముడుపోని టాప్ బ్యాట్స్ మన్

Published Mon, Feb 16 2015 10:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

హషిమ్ ఆమ్లా(ఫైల్)

హషిమ్ ఆమ్లా(ఫైల్)

బెంగళూరు: ఇండిన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో వరల్డ్ టాప్ ర్యాంకింగ్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లాను ఎవరూ కొనలేదు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్న ఆమ్లాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఆమ్లా ప్రాథమిక ధరను రూ. 2 కోట్లుగా నిర్ధారించారు.

ప్రస్తుతం తమ జట్టు తరపున వన్డే ప్రపంచకప్ ఆడుతున్న ఆమ్లా ఇప్పటివరకు 108 వన్డేలు ఆడాడు. అతడి బ్యాటింగ్ సగటు 55.93 గా ఉంది. 19 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 153. అయితే టి20ల్లో అతడి రికార్డు అంత ఘనంగా లేదు. 26 టి20 మ్యాచ్ లు ఆడిన ఆమ్లా 25 సగటుతో 600 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement