న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం ఈనెల మూడో వారంలో ఓ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఫ్రాంచైజీల యజమానులతో పాటు సీఈఓలు హాజరుకానున్న ఈ సమావేశానికి ఐపీఎల్-8 వేలానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించనున్నారు. ‘ఢిల్లీలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని అనధికారికంగా ఫ్రాంచైజీలకు చెప్పాం. చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ల భవితవ్యంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెల్లడించలేదు.
ఈ రెండు ఫ్రాంచైజీలు ఆందోళనలో ఉన్నాయి. వేలానికి ముందు యజమానులతో చర్చించడం పరిపాటి. కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు తెలిపారు. మొదట్లో ఈ సమావేశాన్ని దుబాయ్‌లో నిర్వహించాలనుకున్నా... గతంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ల మాదిరిగా ఉండొద్దనే భావనతో ఇక్కడే ఏర్పాటు చేశారు.
మూడో వారంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల వర్క్‌షాప్!
Published Thu, Jan 8 2015 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM
Advertisement
Advertisement