పుణె విజయలక్ష్యం 163 | delhi dare devils set target of 163 runs for pune super giants | Sakshi
Sakshi News home page

పుణె విజయలక్ష్యం 163

Published Thu, May 5 2016 9:47 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

delhi dare devils set target of 163 runs for pune super giants

ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో పుణె సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుణె ఆదిలోనే రిషబ్ పంత్(2)వికెట్ ను కోల్పోయింది.

 

అనంతరం సంజూ శాంసన్(20), కేకే నాయర్(32), జేపీ డుమినీ(34), బిల్లింగ్స్ (24), బ్రాత్ వైట్(20), నేగీ(19నాటౌట్) ఇలా తలో చేయి వేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.పుణె బౌలర్లలో పెరీరా, భాటియాలు తలో రెండు వికెట్లు సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement