పుణె విజయలక్ష్యం 173 | kings punjab set target of 173 runs | Sakshi
Sakshi News home page

పుణె విజయలక్ష్యం 173

Published Sat, May 21 2016 5:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

kings punjab set target of 173 runs

విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(30), మురళీ విజయ్(59)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడీ 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం ఆమ్లా తొలి వికెట్ గా అవుటయ్యాడు.

 

అనంతరం  సాహా(3) విఫలమైనా, గుర్ కీరత్ సింగ్(51) రాణించడంతో  పంజాబ్ ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పుణె బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, జంపా, తిషారా పెరీరా, అశోక్ దిండాలకు తలో వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement