న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా భారీ వర్షం ప్రారంభం కావడంతో ఆట ఆగిపోయింది. వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ కొనసాగించనున్నారు. భారీ వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ జరుగుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆట నిలిచేపోయే సమయానికి ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్(17), శుక్లా(14) క్రీజ్లో ఉన్నారు. పీటర్సన్ 35, అగర్వాల్ 25, డీకాక్ 7 పరుగులు చేసి అవుటయ్యారు. అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశాడు. స్టెయిన్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ తప్పనిసరిగా నెగ్గాలి.
హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్కు వర్షం అడ్డంకి
Published Sat, May 10 2014 5:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement