ముంబై: కోవిడ్ కేసులతో తల్లడిల్లుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు పంజాబ్ కింగ్స్‌తో పుణేలో ఆడాల్సిన మ్యాచ్‌ను ముంబైకి తరలించారు. అయితే ముందుగా బుధవారం ఉదయం ఢిల్లీ ఆటగాళ్లందరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్టులన్నీ నెగెటివ్‌గా వస్తే ఏ సమస్యా ఉండదు. ఏ ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా... మ్యాచ్‌ను వాయిదా వేసి ఆటగాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచేస్తారు.
తద్వారా ఢిల్లీ ఫ్రాంచైజీకి సోకిన వైరస్‌ను అక్కడితోనే అంతం చేస్తారు. క్యాపిటల్స్ బృందంలోని ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష, డాక్టర్ అభిజిత్ సాల్వి, మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్‌లకు వైరస్ సోకగా... తాజాగా సోషల్ మీడియా కంటెంట్ సభ్యుడు ఆకాశ్ మనే కోవిడ్ బారిన పడ్డారు. దీంతో కరోనా పేషెంట్ల సంఖ్య ఐదుగురికి చేరడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. మ్యాచ్ కోసం పుణేకు వెళ్లకుండా జట్టు ప్రస్తుతం బస చేసిన చోటే (ముంబై) ఉంచి వైరస్ సంక్రమణ నిరోధక చర్యలు చేపట్టింది. మంగళవారం చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలన్నీ నెగెటివ్‌గా వచ్చినా.. బుధవారం నాటి టెస్టులే కీలకమని బీసీసీఐ వైద్య బృందం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment