ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో నగరంలోని వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఎటు చూసినా చిన్నారులే కనిపించారు. నీలం రంగు జెర్సీలో వేసుకుని ముంబై ఇండియన్స్ జెండాలతో స్డేడియంలో సందడి చేశారు. ఏకంగా 21వేల మంది చిన్నారులు గ్యాలరీల్లో కూర్చొని ముంబై ఇండియన్స్ కు మద్దతు తెలియజేశారు