ఐపీఎల్-11 సీజన్‌లో ప్లే ఆఫ్ నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీ పడ్డ విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి ప్లే ఆఫ్ రేసులో నిలిచిన రాజస్తాన్.. కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల కోసం వేచి చూసింది. రాజస్తాన్ కన్నా ముంబై ఇండియన్స్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో కొంత కలవరపాటుకు సైతం గురైంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు ముంబై ఇండియన్స్ ఓడిపోవాలని కోరుకున్నారు.