అది సర్వ సాధారణం: జహీర్ ఖాన్ | Zaheer Khan Says Good Things in Store for Delhi Daredevils After Loss | Sakshi
Sakshi News home page

అది సర్వ సాధారణం: జహీర్ ఖాన్

Published Mon, Apr 11 2016 6:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

అది సర్వ సాధారణం: జహీర్ ఖాన్

అది సర్వ సాధారణం: జహీర్ ఖాన్

కోల్కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘోర పరాజయాన్ని ఆ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ లైట్గా తీసుకున్నాడు. ప్రతీ జట్టూ ఏదొక సందర్భాల్లో క్లిష్టపరిస్థితిని ఎదుర్కొనక తప్పదని, అలాంటి పరిస్థితినే తాము కూడా చవిచూశామన్నాడు.  ఈ పరాజయం తమకు ఓ గుణపాఠంగా ఉపయోగపడుతుందన్నాడు. ఈ టోర్నీ ఇంకా ఆరంభ దశలో ఉండటంతో తమకు మంచి రోజులు మిగిలే ఉన్నాయని సంగతిని గుర్తించుకోవాలన్నాడు. ఒక మ్యాచ్లో ఓటమితోనే తమ పని ముగిసిపోయిందంటూ రాయడం ఎంతమాత్రం సరికాదని జహీర్ పేర్కొన్నాడు.

 ఆటలో గెలుపు, ఓటములు సర్వ సాధారణమని పేర్కొన్న జహీర్.. తమ కుర్రాళ్లు ఫీల్డ్లో చురుగ్గా కదిలిన తీరుతో సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తమది యువకులతో నిండిన జట్టు కాబట్టి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నాడు. నిన్నటి మ్యాచ్కు జేపీ డుమినీ అందుబాటులో లేని విషయాన్ని జహీర్ ఈ సందర్బంగా గుర్తు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement