
మాజీ ఇండియన్ క్రికెటర్ జహీర్‌ఖాన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే వారి ఇంట్లోకి మూడో మనిషి రాబోతున్నారు. జహీర్ ఖాన్ బాలీవుడ్ నటి సాగరిక గాట్గేను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ యూఏఈలో ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఐపీఎల్ జరుగుతుండగా జహీర్‌ఖాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్(డీసీఏ)గా పనిచేస్తున్నారు. జహీర్‌ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను కూడా ముంబై ఇండియన్స్ జట్టుతో కలసి దుబాయ్‌లోనే జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జహీర్ గురించి వర్ణించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం కోరగా జహీర్ అందరితో సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలను తీసుకుంటాడని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇక టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తాను తండ్రికాబోతున్నట్లు, వచ్చే ఏడాది జనవరిలో వారి ఇంటికి ఒక అతిధి రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ!
Comments
Please login to add a commentAdd a comment