ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత కింగ్స్ పంజాబ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. పంజాబ్ ఓపెనర్లు మురళీ విజయ్(25; 16 బంతుల్లో 4 ఫోర్లు), స్టోనిస్(52;44 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం సాహా(52;33 బంతుల్లో 7ఫోర్లు) ధాటిగా ఆడగా, మ్యాక్స్ వెల్(16) నిరాశపరిచాడు. చివర్లో డేవిడ్ మిల్లర్(11 నాటౌట్),అక్షర్ పటేల్(16 నాటౌట్;5 బంతుల్లో 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 181పరుగులు చేసింది.