రాజ్కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మంగళవారం ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత గుజరాత్ను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో గుజరాత్ ఎనిమిది మ్యాచ్ల్లో ఆరింట గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ ఆరు మ్యాచ్లకు గాను నాలుగు నెగ్గింది.