ఐపీఎల్‌కు ఆండ్రూ టై దూరం
భుజం నొప్పి కారణంగా గుజరాత్ లయన్స్ పేసర్ ఆండ్రూ టై ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తను డీప్ స్క్వేర్‌లెగ్‌లో బౌండరీని ఆపేందుకు డైవ్ చేయగా భుజం దగ్గర గాయమైంది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్చించారు. ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసుకున్న టై లయన్స్‌కు కీలక బౌలర్‌గా సేవలందించాడు.